న్యూఢిల్లీ: కంపెనీలో పబ్లిక్ వాటాను పెంచేందుకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి (ఎఫ్‌పీవో) వచ్చే యోచనేదీ లేదని స్టాక్ ఎక్సే్చంజీలకు పతంజలి ఫుడ్స్ తెలిపింది. అయితే, ఆఫర్ ఫర్ సేల్, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) వంటి మార్గాలు పరిశీలిస్తున్నట్లు వివరించింది. పతంజలి ఫుడ్స్‌లో తమ వాటాలను నిర్దేశిత స్థాయిలోపునకు తగ్గించుకోనందుకు గాను 21 ప్రమోటర్ సంస్థల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేసిన సంగతి తెలిసిందే.
దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను 2019లో పతంజలి గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పట్లో గ్రూప్‌నకు 98.87 శాతం వాటాలు ఉండేవి. తర్వాత ఎఫ్‌పీవోకి వచ్చాక పబ్లిక్ వాటా 19.18 శాతానికి పెరగ్గా.. ప్రమోటర్ల వాటా 80.82 శాతానికి తగ్గింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి పబ్లిక్ వాటాను 25 శాతానికి చేర్చాల్సి ఉన్నప్పటికీ అలా చేయకపోవడంతో ప్రమోటర్ల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment