patanjali group
-
ఎఫ్‌పీవో యోచన లేదు: పతంజలి ఫుడ్స్
న్యూఢిల్లీ: కంపెనీలో పబ్లిక్ వాటాను పెంచేందుకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి (ఎఫ్‌పీవో) వచ్చే యోచనేదీ లేదని స్టాక్ ఎక్సే్చంజీలకు పతంజలి ఫుడ్స్ తెలిపింది. అయితే, ఆఫర్ ఫర్ సేల్, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) వంటి మార్గాలు పరిశీలిస్తున్నట్లు వివరించింది. పతంజలి ఫుడ్స్‌లో తమ వాటాలను నిర్దేశిత స్థాయిలోపునకు తగ్గించుకోనందుకు గాను 21 ప్రమోటర్ సంస్థల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను 2019లో పతంజలి గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పట్లో గ్రూప్‌నకు 98.87 శాతం వాటాలు ఉండేవి. తర్వాత ఎఫ్‌పీవోకి వచ్చాక పబ్లిక్ వాటా 19.18 శాతానికి పెరగ్గా.. ప్రమోటర్ల వాటా 80.82 శాతానికి తగ్గింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి పబ్లిక్ వాటాను 25 శాతానికి చేర్చాల్సి ఉన్నప్పటికీ అలా చేయకపోవడంతో ప్రమోటర్ల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేశాయి. -
ఐదు పతంజలి ఔషధాలపై నిషేధం ఎత్తివేత
డెహ్రాడూన్: పతంజలి ఔషధాలు ఐదింటిపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆయుర్వేద, యునాని సర్వీసెస్ లైసెన్సింగ్ అధికారి పతంజలి ఔషధ ఉత్పత్తి సంస్థ దివ్య ఫార్మసీకి ఒక లేఖ రాస్తూ, ‘పొరపాటున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని వివరించారు. గత వారం లైసెన్సింగ్ అథారిటీ ‘తప్పుదోవ పట్టించే ప్రకటనలు’ కారణంగా చూపుతూ ఐదు ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలని పతంజలి ఉత్పత్తులను తయారు చేసే దివ్య ఫార్మసీని ఆదేశించింది. బీపీగ్రిట్, మధుగ్రిట్, థైరోగ్రిట్, లిపిడొమో, ఐగ్రిట్ గోల్డ్ ట్యాబ్లెట్లు ఇందులో ఉన్నాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
లక్ష కోట్ల దిశగా పతంజలి గ్రూప్..
న్యూఢిల్లీ: వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతం ఆదాయం రూ.40,000 కోట్లు ఉందని గ్రూప్ ఫౌండర్, యోగా గురు బాబా రామ్‌దేవ్ తెలిపారు. అయిదేళ్లలో తమ సంస్థ ప్రత్యక్షంగా అయిదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ‘గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లను తాకింది. మరో నాలుగు కంపెనీలను 2027 నాటికి లిస్ట్ చేయనున్నాం. ఐపీవోకు రానున్న కంపెనీల్లో పతంజలి ఆయుర్వేద్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్‌స్టైల్, పతంజలి వెల్నెస్ ఉన్నాయి. ఈ నాలుగింటిలో పతంజలి ఆయుర్వేద్ తొలుత ఐపీవోకు రానుంది. ఈ కంపెనీకి మార్కెట్లో సుస్థిర స్థానం ఉంది’ అని వివరించారు. నెయ్యిలో కల్తీ అబద్ధం పతంజలి నెయ్యిలో కల్తీ జరుగుతోందడం సరికాదన్నారు. ల్యాబ్‌లో కనుగొన్న విషయాలు సరైనవి కావని, ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాల ల్యాబొరేటరీ ప్రమాణాలు పెరగాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ల్యాబొరేటరీలలో పరీక్షా సౌకర్యాలను మెరుగుపరచాలని, బాధ్యతా రహిత అధికారులను శిక్షించాలని సూచించారు. ‘అన్ని ఉత్పత్తులు బయటకు వచ్చే ముందు అనేకసార్లు పరీక్షిస్తాం. పరిశోధన, అభివృద్ధికి రూ.1,000 కోట్ల దాకా ఖర్చు చేశాం’ అని వెల్లడించారు. ఇమేజ్ కాపాడుకుంటాం.. ‘కుట్ర పన్నిన వ్యక్తులను ఈసారి వదిలిపెట్టబోము. బ్రాండ్ ప్రతిష్టను కాపాడేందుకు చట్ట ప్రకారం కఠిన చర్యలను గ్రూప్ తీసుకుంటుంది. 100 మందికిపైగా లీగల్ నోటీసులు పంపించాం. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’ అని స్పష్టం చేశారు. యోగా పరువు తీయడంలో మతపరమైన తీవ్రవాదం, ఆయుర్వేదం విషయంలో మెడికల్ టెర్రరిజం హస్తం ఉందని గ్రూప్ ప్రకటన ఒకటి తెలిపింది. లంపీకి పరిష్కారం దిశగా.. పశువులకు సోకుతున్న లంపీ చర్మ వ్యాధికి పరిష్కారం కనుగునే దిశగా పతంజలి గ్రూప్ కసరత్తు చేస్తోందని రామ్‌దేవ్ వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే దేశంలో ఒక లక్ష ఆవులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. హరిద్వార్‌లోని తన ఇంట్లో చాలా ఆవులకు కూడా ఈ వ్యాధి సోకిందని, అయితే ఒక్కటి కూడా చనిపోలేదని చెప్పారు. త్వరలో నాలుగు ఐపీవోలు ఐపీవో కోణం నుండి చూస్తే పతంజలి ఆయుర్వేద్ ఉత్తమమైనదని రామ్‌దేవ్ తెలిపారు. ‘ఉత్పత్తి శ్రేణి, విస్తృతి, కస్టమర్ల సంఖ్య, లాభదాయకత, భవిష్యత్తు అంచనా పరంగా ఇది అత్యంత అనుకూలమైనది. దివ్య ఫార్మసీని ప్రమోట్ చేస్తున్న పతంజలి మెడిసిన్ రెండవ ఐపీవోగా అడుగుపెట్టనుంది. ఆ తర్వాత ఔట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్స్, హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న పతంజలి వెల్నెస్ ఐపీవోకు రానుంది. పతంజలి వెల్నెస్ కింద 25,000 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 50 కేంద్రాలున్నాయి. వీటిని రెండింతలు చేస్తాం. ఫ్రాంచైజీ విధానంలోనూ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. దుస్తులు, రవాణా, పశువుల దాణా, ఇతర అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పతంజలి లైఫ్‌స్టైల్ కార్యకలాపాలు సాగిస్తోంది’ అని చెప్పారు. -
ప్రపంచంలో అతిపెద్ద బ్రాండు మాదే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఉత్పత్తులతో పతంజలి మార్కెట్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ ఫాస్ట్-మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీ పతంజలి 2018-19 నాటికి యునీలివర్‌ను, మిగతా వాటిని అధిగమిస్తుందని యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. 2020-21 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ బ్రాండుగా అవతరిస్తుందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో పతంజలి రూ.1 లక్షల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం హరిద్వార్‌లో రూ.15వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని, తేజ్‌పూర్‌లో రూ.25వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పతంజలి కలిగి ఉందన్నారు. నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పతంజలి ఉత్పత్తి సెంటర్లు రాబోతున్నాయని తెలిపారు. ఆయిల్, ఉప్పు వంటి వాటిని తయారుచేయడానికి 50 చిన్న యూనిట్లను పతంజలి కలిగి ఉందని బాబా రాందేవ్ ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ తాము రూ.1 లక్షల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటే, మొత్తం మార్కెట్ సైజు రూ.10 లక్షల కోట్లలో 10 శాతమని తెలిపారు. 2018-19 కల్లా యునిలీవర్, ఇతర టాప్ మోస్ట్ బ్రాండులను పతంజలి అధిగమిస్తుందని, 2020-21 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ బ్రాండుగా అవతరించాలని చూస్తున్నట్టు బాబా రాందేవ్ చెప్పారు. బాబా రాందేవ్, ఆయన అసోసియేట్ ఆచార్య బాలక్రిష్ణ కలిసి తక్కువ సమయంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ గ్రూప్ పతంజలిని ఓ స్థాయిలో నిల్చోబెట్టారు. త్వరలోనే తమ గ్రూప్ జీన్స్, ట్రౌజర్స్, కుర్తాలు, షర్ట్లు, స్పోర్ట్స్‌వేర్, యోగా వేర్లను విక్రయించబోతున్నట్టు తెలిపారు. -
అమర సైనికుల పిల్లలకు రాందేవ్ స్కూలు
రాందేవ్ బాబా అనగానే ముందుగా మనకు యోగా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత వేల కోట్లలో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. కానీ.. ఆయనలోని మరో కోణం ఇప్పుడు వెలుగు చూసింది. అమరులైన సైనికుల పిల్లల కోసం తాను ఈ ఏడాది 'పతంజలి ఆవాసీయ సైనిక్ స్కూల్' ఒకదాన్ని ప్రారంభిస్తానని రాందేవ్ ప్రకటించారు. ఇందులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పిల్లలకు ఉచితంగా చదువు చెబుతామని అన్నారు. ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ స్కూలు ఏర్పాటు కానుంది. గురువారం నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో రాందేవ్ బాబా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉన్న ఆస్తిని చారిటీ కోసం ఖర్చు చేయాలన్న లక్ష్యమే పతంజలి బృందాన్ని ముందుకు నడిపిస్తోందని ఆయన తెలిపారు. రాబోయే ఒకటి రెండేళ్లలో పతంజలి దేశంలోనే అతిపెద్ద బ్రాండు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు లాభాలు సాధించడం మాత్రమే లక్ష్యం కాదని.. నాణ్యమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులతో ప్రజలకు సేవ చేయాలన్నదే ధ్యేయమని రాందేవ్ వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో మరణించిన 25 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పిల్లల చదువులకు అయ్యే ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని ఇటీవలే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా ప్రకటించాడు. शहीदों के बच्चों के लिए पतंजलि आवासीय स्कूल की शुरुआत होगी #ProsperityForCharity pic.twitter.com/oQmgsQJoBs — Swami Ramdev (@yogrishiramdev) 4 May 2017