డెహ్రాడూన్: పతంజలి ఔషధాలు ఐదింటిపై విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆయుర్వేద, యునాని సర్వీసెస్ లైసెన్సింగ్ అధికారి పతంజలి ఔషధ ఉత్పత్తి సంస్థ దివ్య ఫార్మసీకి ఒక లేఖ రాస్తూ, ‘పొరపాటున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని వివరించారు.
గత వారం లైసెన్సింగ్ అథారిటీ ‘తప్పుదోవ పట్టించే ప్రకటనలు’ కారణంగా చూపుతూ ఐదు ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలని పతంజలి ఉత్పత్తులను తయారు చేసే దివ్య ఫార్మసీని ఆదేశించింది. బీపీగ్రిట్, మధుగ్రిట్, థైరోగ్రిట్, లిపిడొమో, ఐగ్రిట్ గోల్డ్ ట్యాబ్లెట్లు ఇందులో ఉన్నాయి.
చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment