హరిద్వార్: భారతీయ వేద విద్య, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు అందించేందుకు రాందేవ్ బాబా చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొనియాడారు. హరిద్వార్‌లోని యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ సన్యాస్ దీక్షా మహోత్సవం సందర్భంగా ఆయన పతంజలి యూనివర్సిటీ కొత్త భవనాన్ని ప్రారంభించారు.
‘‘గడిచిన పాతికేళ్లలో యోగ, ఆయుర్వేద, స్వదేశీ పరిశ్రమకు రాందేవ్ బాబా గణనీయమైన సేవలు అందించారు. ఇప్పుడు అదే స్పూర్తితో విద్యా రంగంపై దృష్టి సారించారు. రానున్న రోజుల్లో పతంజలి గ్రూప్ దేశాభివృద్ధికి ఎంతోగానూ తోడ్పడుతుంది’’ అని అన్నారు. పతంజలి యూనివర్సిటీ, భారతీయ శిక్షా బోర్డు ద్వారా ప్రాచీన విద్యను నేటి తరానికి అందించి ఉత్తమ సమాజ స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని రాందేవ్ బాబా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment