రాందేవ్కు మరో షాక్
కోలకతా: ప్రముఖ యోగాగురు రాందేవ్ కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలికి భారీ షాక్ తగిలింది. సంస్థ కు చెందిన వంట నూనెల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) మరో కీలక అడుగువేసింది. ఇటీవల తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసిన సంస్థ పతంజలి కి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కేంద్ర అనుమతుల సంస్థను కోరింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని ఎఫ్ఎస్ఎస్ఎఐ పేర్కొంది.
పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్‌ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులను విచారించిన సంస్థ తాజా ఆదేశాలు జారీ చేసింది.
కాగా ల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ వాదన. ఈ తాజా పరిణామంపై పతంజలిని వివరణ కోరగా....షోకాజ్ నోటీసులు తమకు అందిన తరువాత స్పందిస్తామని సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ తెలిపారు. పెట్రోలియం ప్రొడక్ట్ అయిన హెగ్సాగెన్ ద్రావకం క్యాన్సర్ కారకమన్న తమవాదనను సమర్ధించుకున్నారు.