watchdog
-
మితిమీరిన సృజనాత్మకత
వాణిజ్య ప్రకటనల్లోని మితిమీరిన సృజనాత్మకతకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి దేశంలోనూ ఒక ‘వాచ్డాగ్’ ఉంటుంది. అలాగే స్వీడన్‌లోనూ ఉంది. స్త్రీలను తక్కువ చేసేలా ఉన్న ఒక మూస తరహా ప్రకటనపై ఆ వాచ్డాగ్ తాజాగా కొరడా ఝళిపించి, దానిని నిషేధించింది. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి కనుక మీ పాత ఉద్యోగాన్ని మానేసి, ఈ కొత్త ఉద్యోగంలో చేరండి అంటూ ఇంటర్నెటెట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ‘బానోఫ్’.. ఫేస్ బుక్‌లో ఒక ప్రకటన పెట్టింది. ఆ ప్రకటనలో ఒక అబ్బాయి తన గర్ల్‌ఫ్రెండ్‌తో వెళుతూ, ఇంకో అమ్మాయి వైపు చూస్తుంటాడు. ఆ అబ్బాయి ఫొటో మీద ‘యు’ అని, గర్ల్‌ఫ్రెండ్ ఫొటో మీద ‘యువర్ కరెంట్ ఎంప్లాయర్’ అని, ఆ ఇంకో అమ్మాయి మీద ‘బానోఫ్’ అని రాసి ఉంటుంది. దీనిపై పెద్దగా విమర్శలు రానప్పటికీ.. స్త్రీలను తేలిక భావనతో చూసే పాతకాలపు ధోరణికి ఈ ప్రకటన ఒక నిదర్శలా ఉంది కనుక వెంటనే దీనిని తొలగించాలని స్వీడన్ వాణిజ్య ప్రకటనల నియంత్రణ సంస్థ ఆదేశించింది. -
వాచ్ డాగ్ లా పని చేస్తాం: ఇబోబి
ఇంఫాల్ : కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహిస్తుందని మాజీ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండి వాచ్ డాగ్ పాత్రను పోషిస్తున్నామని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత బిరేన్ సింగ్‌తో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఇబోబి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. సంకీర్ణంగా ఏర్పడ్డ ప్రభుత్వం విధానాలపై తాము నిరంతరం వాచ్ డాగ్‌లా ఉంటామన్నారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ, బీజేపీకే అవకాశాలు దక్కాయన్నారు. కాగా వాస్తవానికి 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో చాలాకాలంగా బలమైన ప్రతిపక్షం లేదనే చెప్పాలి. కాగా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. 28 స్థానాలు గెలుచుకుని తాము అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ముందు తమనే పిలవాల్సిందని కాంగ్రెస్ వాదిస్తోంది. అధికారం చేపట్టాలంటే కనీసం 31 మంది మద్దతు అవసరం. అయితే బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ దాదాపు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలందరూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడంతో తొలిసారి మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. -
రాందేవ్‌కు మరో షాక్
కోలకతా: ప్రముఖ యోగాగురు రాందేవ్ కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలికి భారీ షాక్ తగిలింది. సంస్థ కు చెందిన వంట నూనెల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) మరో కీలక అడుగువేసింది. ఇటీవల తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసిన సంస్థ పతంజలి కి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కేంద్ర అనుమతుల సంస్థను కోరింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని ఎఫ్ఎస్ఎస్ఎఐ పేర్కొంది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులను విచారించిన సంస్థ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ వాదన. ఈ తాజా పరిణామంపై పతంజలిని వివరణ కోరగా....షోకాజ్ నోటీసులు తమకు అందిన తరువాత స్పందిస్తామని సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ తెలిపారు. పెట్రోలియం ప్రొడక్ట్ అయిన హెగ్సాగెన్ ద్రావకం క్యాన్సర్ కారకమన్న తమవాదనను సమర్ధించుకున్నారు. -
రాందేవ్ బాబాకు ఝలక్
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి పై ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) భారీ ఝలక్ ఇచ్చింది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసింది. తనకు అందిన సుమారు 156 ఫిర్యాదులపై విచారించి ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లెటర్ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పతంజలి కచ్చి ఘనీ మస్టర్డ్ ఆయిల్, కేశ్ కాంతి న్యాచురల్ హెయిర్ క్లెన్సర్ తదితర ప్రకటలపై సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తప్పుడు ప్రచారం ద్వారా పతంజలి ఆయుర్వేద వినియోగదారుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే పతంజలి ఆయుర్వేద సంస్థ మాత్రం తన ప్రచారాన్ని గట్టిగానే సమర్ధించుకుంది. వాస్తవాలు, పరిశోధనల ఆధారంగానే తమ ప్రచారాన్ని రూపొందించామని, ఎవరినీ తప్పుదారి పట్టించే ఆలోచన లేదంటూ వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామంపై పతంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి. -
వాచ్డాగ్ పాత్ర పోషిస్తాం
- ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తాం - రాజకీయపార్టీలను కలుపుకోం, అంశాల ఆధారంగా కలిసి పనిచేస్తాం - ఇరిగేషన్ పాలసీపై అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తాం - గ్రూప్-2లో రెండువేల పోస్టులు, త్వరలో డీఎస్సీ ప్రకటించాలి - టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టి.జేఏసీ) రాష్ట్రంలో వాచ్డాగ్ పాత్రను పోషిస్తుందని చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తెలిపారు. ప్రజల ఆకాంక్ష సాధనకు ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం పునాదిగా ప్రజల కేంద్రంగా ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. ఇటీవలి కాలంలో జేఏసీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లిన నేపథ్యంలో.. తాజాగా జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి దాదాపు ఇరవైకి పైగా ప్రజా సంఘాలు వివిధ జేఏసీ నాయకులు హాజరై భవిష్యత్తు కార్యచరణపై చర్చించుకున్నారు. అనంతరం చైర్మన్ ప్రొ.ఎం.కోదండరామ్ జేఏసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇక నుంచి జేఏసీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. ప్రజలు తమపై నమ్మకముంచి అనేక పిలుపులకు స్పందించి మద్దతుగా నిలిచారు కాబట్టి వారికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తిచూపాలని స్థూలంగా నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో వాచ్డాగ్ పాత్రను పోషించడం కోసం టీ-జేఏసీ నిర్మాణాన్ని విస్తృత పరచాలని, అందుకోసం నిర్మాణాత్మక కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. జేఏసీ నుంచి ఇటీవలి కాలంలో పలు ఉద్యోగ సంఘాలు వెళ్లిపోవడాన్ని తప్పు పట్టడంలేదని, ప్రతీ సంఘానికి స్వేచ్ఛ ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందన్నారు. అయితే వారు ఇన్నాళ్లు తమతో కలిసి నిర్వహించిన పాత్రను గుర్తు పెట్టుకుంటామన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రయత్నాలోనైనా తమవంతు భాగస్వామ్యం నిర్వహిస్తామన్నారు. రాజకీయపార్టీలను జేఏసీలోకి చేర్చుకోం.. తమ టీంను ఇక నుంచి టీ-జేఏసీగానే పిలవాలని కోదండరామ్ కోరారు. జేఏసీలోకి కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుంటామని, రాజకీయ పార్టీలను మాత్రం చేర్చుకోబోమన్నారు. అయితే అంశాల ఆధారంగా అవసరమైనప్పుడు రాజకీయపార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న ఇరిగేషన్ పాలసీపై అధ్యయనం చేసిన తర్వాతనే తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. దీనిపై అనుభవజ్ఞులైన వారితో చర్చించి అభిప్రాయం వ్యక్తంచేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని, అలాగే తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో పశువులకు మేత విషయమై త్వరలో రెవెన్యూమంత్రితో సమావేశమవుతామన్నారు. గ్రూప్-2లో పోస్టులు పెంచాలి.. గ్రూప్-2లో కనీసం రెండు పోస్టులను ప్రకటించి భర్తీ చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. అలాగే టీచర్ల నియామకానికి సంబంధించి డీఎస్సీని ప్రకటించాలని కోరారు. వయస్సు సడలింపుకు సంబంధించి ఎక్సైజ్ పోస్టులకు కూడా వర్తింప చేయాలని సూచించారు. అలాగే హెచ్‌సీయూ ఘటనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తున్నట్లు తెలిపారు. వీసీ అప్పారావుపై కేసు విచారణ జరుగుతున్న సమయంలో తిరిగి పదవిలో చేరడం చాలా తప్పునిర్ణయమన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. యూనివర్శిటీలలోకి సాయుధ పోలీసులు ప్రవేశించకుండా సుప్రీంకోర్టు నియమాలను భవిష్యత్తులో కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వాలు చూడాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ స్టీరింగ్ కమిటీకి హాజరైన వారు... చైర్మన్ కోదండరామ్‌తో పాటు కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కోఆర్డినేటర్- పిట్టల రవీందర్, విద్యుత్ జేఏసీ- కె.రఘు, అడ్వకేట్స్ జేఏసీ- నల్లపు ప్రహాద్, విద్యావంతుల వేదిక- గురిజాల రవీందర్రావు, డాక్టర్స్ జేఏసీ- డా.ప్రవీణ్, ఆర్ఎంపీ డాక్టర్స్ జేఏసీ- సి.శంకర్‌ముదిరాజ్, పీవోడబ్ల్యూ- వి.సంధ్య, టీడీఎఫ్-డి.పి.రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్స్- జి.వెంకట్‌రెడ్డి, మాల మహానాడు- బైరి రమేష్, రైల్వే జేఏసీ- ముత్తయ్య, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ- కామగిరి ప్రకాశ్, నిజామాబాద్ జేఏసీ- గోపాల్ శర్మ, రంగారెడ్డి జేఏసీ- వెదిరె చెల్మారెడ్డి, ఆమెరికా టీడీఎఫ్- లక్ష్మణ్ అనుగు, బహ్రెన్ జేఏసీ- దే వేందర్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ- గణేష్ పటేల్, ఉద్యోగుల సంఘం- మామిడి నారాయణ ఉన్నారు.