మితిమీరిన సృజనాత్మకత | Too much creativity | Sakshi
Sakshi News home page

మితిమీరిన సృజనాత్మకత

Published Sun, Sep 30 2018 12:18 AM | Last Updated on Sun, Sep 30 2018 12:18 AM

Too much creativity - Sakshi

వాణిజ్య ప్రకటనల్లోని మితిమీరిన సృజనాత్మకతకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి దేశంలోనూ ఒక ‘వాచ్‌డాగ్‌’ ఉంటుంది. అలాగే స్వీడన్‌లోనూ ఉంది. స్త్రీలను తక్కువ చేసేలా ఉన్న ఒక మూస తరహా ప్రకటనపై ఆ వాచ్‌డాగ్‌ తాజాగా కొరడా ఝళిపించి, దానిని నిషేధించింది. సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి కనుక మీ పాత ఉద్యోగాన్ని మానేసి, ఈ కొత్త ఉద్యోగంలో చేరండి అంటూ ఇంటర్నెటెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అయిన ‘బానోఫ్‌’.. ఫేస్‌ బుక్‌లో ఒక ప్రకటన పెట్టింది.

ఆ ప్రకటనలో ఒక అబ్బాయి తన గర్ల్‌ఫ్రెండ్‌తో వెళుతూ, ఇంకో అమ్మాయి వైపు చూస్తుంటాడు. ఆ అబ్బాయి ఫొటో మీద ‘యు’ అని, గర్ల్‌ఫ్రెండ్‌ ఫొటో మీద ‘యువర్‌ కరెంట్‌ ఎంప్లాయర్‌’ అని, ఆ ఇంకో అమ్మాయి మీద ‘బానోఫ్‌’ అని రాసి ఉంటుంది. దీనిపై పెద్దగా విమర్శలు రానప్పటికీ.. స్త్రీలను తేలిక భావనతో చూసే పాతకాలపు ధోరణికి ఈ ప్రకటన ఒక నిదర్శలా ఉంది కనుక వెంటనే దీనిని తొలగించాలని స్వీడన్‌ వాణిజ్య ప్రకటనల నియంత్రణ సంస్థ ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement