ad claims
-
బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..?
ఎంతో ఆసక్తిగా యూట్యూబ్‌లో వీడియా చూస్తూంటే యాడ్ వచ్చిందనుకోండి చిరాకేస్తుంది కదా. అందుకోసం మార్కెట్లో ఉన్న యాడ్బ్లాకర్లను వాడుతుంటారు. దాంతో ఎలాంటి యాడ్లు రాకుండా ఏంచక్కా వీడియో చూస్తుంటారు. కానీ ఇకపై ఇలాంటివి కుదరకుండా యూట్యూబ్ పక్కా చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్కిప్ చేయలేని యాడ్లను డిస్ప్లే చేస్తున్న యూట్యూబ్.. యాడ్బ్లాకర్లు వాడుతున్నా వీడియో పాజ్ చేసినప్పుడు యాడ్ వచ్చేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.యూట్యూబ్ ‘యాడ్ బ్లాకర్ డిటెక్షన్ టెక్నాలజీ’ను వినియోగిస్తుంది. దీనివల్ల యాడ్ బ్లాక్ యాప్‌లు వాడుతున్న ఫోన్లు, డెస్క్టాప్ల్లో వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేస్తే యాడ్ డిస్ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. ‘యూట్యూబ్‌లో వీడియో పాజ్ చేయబడినప్పుడు కూడా స్క్రీన్‌పై పాప్ అప్ ప్రకటన డిస్ప్లే అవుతుంది. పాజ్ చేసిన స్క్రీన్ సమయాన్ని లక్ష్యంగా చేసుకుని యాడ్ వచ్చేలా ప్రకటనదారులకు కంపెనీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. త్వరలో ఇది అందరి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది’ అని యూట్యూబ్ కమ్యూనికేషన్ మేనేజర్ ఒలువా ఫలోడున్ తెలిపారు.ఇదీ చదవండి: ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో ఎలాంటి యాడ్లు రాకూడదని భావించేవారు ‘యూట్యూబ్ ప్రీమియం’ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నెలకు సుమారు రూ.1,100 ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి యాడ్స్ రాకుండా వీడియోను వీక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రకటనదారులు చెల్లించే మొత్తంలో కంటెట్ క్రియేటర్లకు 55 శాతం, యూట్యూబ్‌కు 45 శాతం ఆదాయం అందేలా ప్రస్తుత యాడ్ రెవెన్యూ పాలసీ ఉంది. -
రాందేవ్‌కు మరో షాక్
కోలకతా: ప్రముఖ యోగాగురు రాందేవ్ కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలికి భారీ షాక్ తగిలింది. సంస్థ కు చెందిన వంట నూనెల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) మరో కీలక అడుగువేసింది. ఇటీవల తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసిన సంస్థ పతంజలి కి షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కేంద్ర అనుమతుల సంస్థను కోరింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని ఎఫ్ఎస్ఎస్ఎఐ పేర్కొంది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వ్యాఖ్యానించింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులను విచారించిన సంస్థ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా ల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ వాదన. ఈ తాజా పరిణామంపై పతంజలిని వివరణ కోరగా....షోకాజ్ నోటీసులు తమకు అందిన తరువాత స్పందిస్తామని సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ తెలిపారు. పెట్రోలియం ప్రొడక్ట్ అయిన హెగ్సాగెన్ ద్రావకం క్యాన్సర్ కారకమన్న తమవాదనను సమర్ధించుకున్నారు. -
రాందేవ్ బాబాకు ఝలక్
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు రాం దేవ్ బాబా కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి పై ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) భారీ ఝలక్ ఇచ్చింది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన ప్రకటనల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ద ఎడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టింస్తోందంటూ మొట్టికాయలేసింది. తనకు అందిన సుమారు 156 ఫిర్యాదులపై విచారించి ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రత, ప్రమాణాల భారతీయ సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఐ), ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లెటర్ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పతంజలి కచ్చి ఘనీ మస్టర్డ్ ఆయిల్, కేశ్ కాంతి న్యాచురల్ హెయిర్ క్లెన్సర్ తదితర ప్రకటలపై సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కోల్డ్ ప్రాసెస్డ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని వెంటనే అడ్డుకోవాలంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తప్పుడు ప్రచారం ద్వారా పతంజలి ఆయుర్వేద వినియోగదారుల్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే పతంజలి ఆయుర్వేద సంస్థ మాత్రం తన ప్రచారాన్ని గట్టిగానే సమర్ధించుకుంది. వాస్తవాలు, పరిశోధనల ఆధారంగానే తమ ప్రచారాన్ని రూపొందించామని, ఎవరినీ తప్పుదారి పట్టించే ఆలోచన లేదంటూ వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామంపై పతంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి.