ఎంతో ఆసక్తిగా యూట్యూబ్‌లో వీడియా చూస్తూంటే యాడ్ వచ్చిందనుకోండి చిరాకేస్తుంది కదా. అందుకోసం మార్కెట్‌లో ఉన్న యాడ్‌బ్లాకర్లను వాడుతుంటారు. దాంతో ఎలాంటి యాడ్‌లు రాకుండా ఏంచక్కా వీడియో చూస్తుంటారు. కానీ ఇకపై ఇలాంటివి కుదరకుండా యూట్యూబ్ పక్కా చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్కిప్ చేయలేని యాడ్‌లను డిస్‌ప్లే చేస్తున్న యూట్యూబ్.. యాడ్‌బ్లాకర్లు వాడుతున్నా వీడియో పాజ్ చేసినప్పుడు యాడ్ వచ్చేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
యూట్యూబ్ ‘యాడ్ బ్లాకర్ డిటెక్షన్ టెక్నాలజీ’ను వినియోగిస్తుంది. దీనివల్ల యాడ్ బ్లాక్ యాప్‌లు వాడుతున్న ఫోన్లు, డెస్క్‌టాప్‌ల్లో వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేస్తే యాడ్ డిస్‌ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. ‘యూట్యూబ్‌లో వీడియో పాజ్ చేయబడినప్పుడు కూడా స్క్రీన్‌పై పాప్ అప్ ప్రకటన డిస్‌ప్లే అవుతుంది. పాజ్ చేసిన స్క్రీన్ సమయాన్ని లక్ష్యంగా చేసుకుని యాడ్ వచ్చేలా ప్రకటనదారులకు కంపెనీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. త్వరలో ఇది అందరి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది’ అని యూట్యూబ్ కమ్యూనికేషన్ మేనేజర్ ఒలువా ఫలోడున్ తెలిపారు.
ఇదీ చదవండి: ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..
ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో ఎలాంటి యాడ్‌లు రాకూడదని భావించేవారు ‘యూట్యూబ్ ప్రీమియం’ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నెలకు సుమారు రూ.1,100 ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి యాడ్స్ రాకుండా వీడియోను వీక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రకటనదారులు చెల్లించే మొత్తంలో కంటెట్ క్రియేటర్లకు 55 శాతం, యూట్యూబ్‌కు 45 శాతం ఆదాయం అందేలా ప్రస్తుత యాడ్ రెవెన్యూ పాలసీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment