ad campaign
-
బ్లాకర్లు వాడుతున్నా యాడ్! ఇప్పుడేం చేయాలి..?
ఎంతో ఆసక్తిగా యూట్యూబ్‌లో వీడియా చూస్తూంటే యాడ్ వచ్చిందనుకోండి చిరాకేస్తుంది కదా. అందుకోసం మార్కెట్లో ఉన్న యాడ్బ్లాకర్లను వాడుతుంటారు. దాంతో ఎలాంటి యాడ్లు రాకుండా ఏంచక్కా వీడియో చూస్తుంటారు. కానీ ఇకపై ఇలాంటివి కుదరకుండా యూట్యూబ్ పక్కా చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్కిప్ చేయలేని యాడ్లను డిస్ప్లే చేస్తున్న యూట్యూబ్.. యాడ్బ్లాకర్లు వాడుతున్నా వీడియో పాజ్ చేసినప్పుడు యాడ్ వచ్చేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.యూట్యూబ్ ‘యాడ్ బ్లాకర్ డిటెక్షన్ టెక్నాలజీ’ను వినియోగిస్తుంది. దీనివల్ల యాడ్ బ్లాక్ యాప్‌లు వాడుతున్న ఫోన్లు, డెస్క్టాప్ల్లో వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేస్తే యాడ్ డిస్ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు. ‘యూట్యూబ్‌లో వీడియో పాజ్ చేయబడినప్పుడు కూడా స్క్రీన్‌పై పాప్ అప్ ప్రకటన డిస్ప్లే అవుతుంది. పాజ్ చేసిన స్క్రీన్ సమయాన్ని లక్ష్యంగా చేసుకుని యాడ్ వచ్చేలా ప్రకటనదారులకు కంపెనీ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. త్వరలో ఇది అందరి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది’ అని యూట్యూబ్ కమ్యూనికేషన్ మేనేజర్ ఒలువా ఫలోడున్ తెలిపారు.ఇదీ చదవండి: ఐదు నెలల్లో యూపీఐ లావాదేవీలు ఎంతంటే..ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో ఎలాంటి యాడ్లు రాకూడదని భావించేవారు ‘యూట్యూబ్ ప్రీమియం’ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నెలకు సుమారు రూ.1,100 ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి యాడ్స్ రాకుండా వీడియోను వీక్షించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రకటనదారులు చెల్లించే మొత్తంలో కంటెట్ క్రియేటర్లకు 55 శాతం, యూట్యూబ్‌కు 45 శాతం ఆదాయం అందేలా ప్రస్తుత యాడ్ రెవెన్యూ పాలసీ ఉంది. -
కమెడియన్ నోటి దురుసు.. షాకిచ్చిన బ్యాంక్!
ప్రైవేట్ బ్యాంక్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రముఖ కమెడియన్ తన్మయ్ బట్‌తో కుదుర్చుకున్న వ్యాపార ప్రకటనల నుంచి తప్పించింది. అందుకు కారణం తన్మయ్ నోటి దురుసేనని తెలుస్తోంది. 11 ఏళ్ల క్రితం తన్మయ్ బట్ ఓ సామాజిక వర్గంతో పాటు, దేవుళ్ల విగ్రహాలు, చిన్న పిల్లల గురించి అసభ్యకర వ్యాఖ్యలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. ఆ అభ్యంతర వ్యాఖ్యలు మరో సారి సోషల్ మీడియాలో చర్చనీయాంశగా మారాయి. తాజాగా కొటక్ మహీంద్రా బ్యాంక్ 811 పేరుతో కమెడియన్ గ్రూప్ ఆల్ ఇండియా బక్ చోడ్తో కలిసి కమెడియన్ తన్మయ్ బట్, సమయ్ రైనాలతో ఓ యాడ్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే పలువురు నెటిజన్లు దశాబ్దం నాటి ట్వీట్లను వెలుగులోకి తెచ్చారు. వాటిని రీట్వీట్ చేస్తూ కొటక్ మహీంద్రా బ్యాంక్ బాయ్ కాట్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో హోరెత్తించారు. Hi @KotakBankLtd @udaykotak I am a customer of your bank but the fact that you have hired a hinduphobic, woman and child abuser Tanmay Bhat for a campaign is making me consider closing my account. Discontinue the association with him and apologise? pic.twitter.com/W57pdic4jf — Monica Verma (@TrulyMonica) February 12, 2023 బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సైతం తన్మయ్ బట్‌తో అడ్వటైజ్మెంట్ చేయడాన్ని తప్పు పట్టింది. ఆమెకు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. పలువురు వినియోగదారులు తమకు కొటక్ బ్యాంక్‌లో అకౌంట్లు ఉన్నాయని, వాటిని వెంటనే క్యాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో కొటక్ బ్యాంక్ ఖాతాదారులకు క్షమాపణలు చెప్పింది. కమెడియన్ గ్రూప్ ఆల్ ఇండియా బక్ చోడ్తో కలిసి చేసే ఈ వ్యాపార ప్రకటన నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపింది. We, at Kotak Mahindra Bank Ltd. do not support or endorse the views of actors made in their personal capacity that harm or offend any individual or group. We have withdrawn the campaign. — Kotak 811 (@kotak811) February 12, 2023 -
కొత్త అవతారమెత్తిన ధోని.. షాక్‌లో నెటిజన్స్!
ముంబై: ‘జెడ్ బ్లాక్’ అగర్బత్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీ.. సంస్థ నూతన ప్రచార కార్యక్రమంలో ‘గురూజీ’ అవతారంలో కనిపించనున్నాడు. ధోనీ ప్రచారంతో బ్రాండ్ ప్రజలకు మరింత చేరువ అవుతుందని జెడ్బ్లాక్ అగర్బత్తి బ్రాండ్ యజమాని మైసూర్ డీప్ పెర్ఫ్యూమ్ హౌస్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘దేశంలో టాప్–3 బ్రాండ్లలో జెడ్ బ్లాక్ ఒకటి. కంపెనీ వినూత్న ఆవిష్కరణలు సంస్థకు అంబాసిడర్ పనిచేసేందుకు ప్రోత్సాహాన్నిచ్చాయి’ అని ధోనీ చెప్పారు. ప్రస్తుత జెబ్ బ్లాక్ అగర్బత్తి మార్కెట్ రూ. 7,000 కోట్లుగా ఉండగా,దాదాపు ఈ కంపెనీ 20% వాటాను కలిగి ఉంది. వాటి బ్రాండ్ల విషయానికొస్తే జెడ్ బ్లాక్ 3 ఇన్ 1, మంథన్ ధూప్, మంథన్ సాంబ్రాణి కప్స్, ఆరోగ్యం కాంఫర్, జెబ్ బ్లాక్ పైనాపిల్, శ్రీఫాల్, గౌవ్డ్ సాంబ్రాణి కప్స్, అరోమిక్స్, నేచర్ ఫ్లవర్ గోల్డ్, సియాన్ పేర్లతో మార్కెట్లో లభిస్తున్నాయి. కాగా ఐపీఎల్ 2022 తర్వాతా తెరపై మహేంద్ర సింగ్ ధోని కనపడడం ఇదే తొలిసారి. అయితే గురూజీ అవతారంలో ఉన్న ధోనిని చూసి మొదట నెటిజన్లు షాకయ్యారు. ఆ తర్వాత అగర్బత్తి యాడ్ కోసం అలా మారడని తెలుసుకుని ఈ గెటప్‌లో కూడా బాగున్నాడంటూ కామెంట్లు పెట్టారు. చదవండి: ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! -
ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!
21 ఏళ్ల ధన్య సోజన్ వధువుగా నటించిన యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ పర్సనాలిటీలతో మొదలు అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ధన్య చావుతో పోరాడుతోంది. చావును గెలవాలనుకుంటోంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి, వెంట్రుకలు పూర్తిగా కోల్పోయిన స్థితి నుంచి అందమైన పెళ్లికూతురిగా మారడం ఇటీవలి గొప్ప కుతూహలపు కథ. 28 ఆగస్టు 2019లో ధన్య సోజన్ టొరెంటో (కెనడా)లో దిగింది. అక్కడ రెండేళ్లు పోస్ట్ డిప్లమో కోర్సు ఆమె చదవాలి. కేరళ ఇడుక్కి జిల్లాలోని తోడపుజ అనే చిన్న టౌన్ ఆమెది. తండ్రి జోసఫ్ మిల్క్‌బూత్ నడుపుతాడు. తల్లి శాంతి గృహిణి. హైస్కూల్లో చదివే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న ధన్య బాగా చదువుకుని కెనడాలో సీటు సంపాదించుకుంది. కొన్ని నెలలు బాగా జరిగాయి. సెమిస్టర్లు రాసింది. కాని 2020 ఆగస్టు నాటికి ఆమె వూరికూరికే స్పృహ తప్పి పడిపోవడం మొదలెట్టింది. అక్కడి డాక్టర్లు చూసి మొదట నిమోనియా అనుకున్నారు. కాని రిపోర్టులు చూసి ఆమెకు ‘కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ ఉందని తేల్చారు. ప్రమాదకరమైన గుండెజబ్బు. ఏ క్షణం ఏమైనా కావచ్చు. గుండె మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ధన్య. ఊరుగాని ఊరు. దేశం కాని దేశం. ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్ రోజులు 20 ఏళ్ల హుషారైన అమ్మాయి ధన్య. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. ఆమెకు ఆక్సిజన్ సరిగా అందడం లేదు. జుట్టు కొన్నాళ్లు నిలవదని చెప్పారు. ఉన్న జుట్టును పూర్తిగా తొలగించారు. ఆమె స్టూడెంట్ వీసా మీద రావడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగించుకునే వీలు లేదు. అలాగని ఇంటినుంచి డబ్బు తెప్పించుకోలేదు. దారుణమైన పరిస్థితిలో పడింది ధన్య. అదృష్టం... ఆమె చేరిన హాస్పిటల్లో కేరళ నుంచి వచ్చిన నర్స్‌లు పని చేస్తున్నారు. వారు ధన్యను ఆదుకున్నారు. ధైర్యం చెప్పారు. ధన్య పరిస్థితిని టొరెంటోలో ఉన్న మలయాళీ సంఘం ‘హృదయపూర్వం’కు తెలియచేశారు. హృదయపూర్వం వెంటనే ధన్య కోసం ఫండ్ రైజింగ్ మొదలెట్టింది. దాదాపు లక్షన్నర డాలర్లు (కోటి రూపాయలు) కలెక్ట్ అయ్యాయి. హాస్పిటల్ బిల్ అందులో నుంచే కట్టారు. అయితే సమస్య అదుపులో ఉంది కాని ట్రీట్మెంట్ కొనసాగాల్సి ఉంది. ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. ఈలోపు హాస్పిటల్, యూనివర్సిటీ వాళ్ల సహకారం వల్ల హాస్పిటల్ నుంచి ఎగ్జామ్స్ రాసి పాసయ్యింది ధన్య. మార్చి వరకూ ఉంటే వర్క్ వీసాకు అర్హత వస్తుందని అప్పటి వరకూ అక్కడే ఉండి కొచ్చి చేరుకుంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్ అయ్యింది ధన్య. మెరుపు కలలు ధన్య ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా మెరుపు కలలు కనడం మానలేదు. ఆమెకు మోడలింగ్ చేయాలని కోరిక. అలాగే పాటలకు డాన్స్ చేయడం కూడా సరదా. హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ బోర్ పోయేందుకు కొన్ని సినిమా పాటలకు చేతులు కదిలించి డాన్స్ చేసి ఆ వీడియోలు రిలీజ్ చేసింది. అవి ఇన్స్టాంట్ హిట్ అయ్యాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి నటులు ఆమె స్థితిని తెలుసుకుని ఆ స్థితిలో కూడా అంత హుషారుగా ఉన్నందుకు మెచ్చుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మలుపుతిప్పిన ఘడియ కొచ్చి చేరుకుని వైద్యం తీసుకుంటున్న ధన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మలబార్ గోల్డ్’ వారి ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ యాడ్ కాంపెయిన్ ప్రకటన కనిపించింది. ‘మీకు పెళ్లికూతురిలా కనిపించాలని ఉందా’ అనే ప్రశ్నకు 7000 మంది యువతులు ‘అవును’ అని ఉత్సాహపడి సమాధానం ఇచ్చారు. ధన్య కూడా ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోయింది. కాని కొన్నాళ్లకు మలబార్ గోల్డ్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. తమ ప్రకటనల్లో కేరళ వధువుగా కనిపించమని వారు కోరారు. ధన్య సంతోషానికి అవధులు లేవు. కేరళ క్రిస్టియన్ వధువుగా తెల్లగౌన్లో కనిపించడానికి అందుకు తగ్గ షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. మలబార్‌గోల్డ్ ఈ షూట్ కోసం అసలు సిసలు వజ్రాల నెక్లెస్‌ను వాడటానికి పంపింది. దానిని ధరించిన ధన్య ఎంతో ముచ్చటపడింది. ‘ఈరోజు నాకెంతో బాగుంది’ అని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. ఆమె స్వచ్ఛమైన నవ్వు వధువు పాత్రకు అందం తెచ్చింది. ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు ‘ఈరోజు మా అమ్మాయి పేషెంట్ అన్న సంగతే మర్చిపోయింది’ అని ఎంతో సంబరంగా ఆమెను చూశారు. నిరాశలో కూడా ఒక ఆశ చేతికి దొరుకుతుంది. అంతవరకూ ఓపిక పట్టమని ధన్య నవ్వు అందరికీ చెబుతోంది. విశేష స్పందన ‘స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా’గా మలబార్ గోల్డ్ వారు విడుదల చేసిన ధన్య యాడ్ విశేష స్పందన పొందింది. ఆ యాడ్‌లో ధన్య ఎంతో అందంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఆమె నవ్వుకు ఎందరో ఫాన్స్ అయ్యారు. ఇవాళ ధన్య సెలబ్రిటీ అయ్యింది. తన అనారోగ్యాన్ని గెలిచి తీరగలననే ఆత్మవిశ్వాసం పొందింది. -
అగరబత్తుల సంస్థకు ధోని యాడ్ క్యాంపెయిన్
ముంబై: ప్రముఖ అగరబత్తుల సంస్థ జెడ్ బ్లాక్ తన బ్రాండ్ అంబాసిడర్ అయిన క్రికెటర్ మహీంద్రా సింగ్ ధోనితో నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధోని ప్రచారంతో బ్రాండ్ ప్రజలకు మరింత చేరువ అవుతుందని కంపెనీ ఎండీపీహెచ్ (జెడ్ బ్లాక్ గ్రూప్) డైరెక్టర్ అంకిత్ అభిప్రాయపడ్డారు. ‘దేశంలో టాప్–3 బ్రాండ్లలో జెడ్ బ్లాక్ ఒకటి. కంపెనీ వినూత్న ఆవిష్కరణలు, సాధించిన విజయాలు నన్ను సంస్థకు అంబాసిడర్‌గా పనిచేసేందుకు ప్రోత్సాహానిచ్చాయి’’ అని ధోని తెలిపారు. -
ప్రధాని కోసం ప్రచారం చేయట్లేదు: అమితాబ్
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచారచిత్రాలు వేటిలోనూ తాను చేయడంలేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఓ టీవీ ప్రకటన చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారని, భారతదేశ సమ్మిళిత అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా భారతీయులంతా కలిసి రావాలని అందులో ఆయన కోరుతారని ప్రచారం జరిగింది. అయితే.. ఈ విషయంలో తన నిర్ణయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రధానమంత్రి గానీ, ప్రధాని కార్యాలయం గానీ తనను ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ఏమీ కోరలేదని ఆయన అన్నారు. -
కోక్ యాడ్లపై కోట్లు కుమ్మరిస్తున్న కోక కోలా