Kotak Mahindra Bank Withdraws Ad Campaign Featuring Comedian Tanmay Bhat - Sakshi
Sakshi News home page

కమెడియన్‌ నోటి దురుసు..తన్మయ్‌ బట్‌కు షాకిచ్చిన బ్యాంక్‌!

Published Tue, Feb 14 2023 8:35 PM | Last Updated on Tue, Feb 14 2023 9:39 PM

Kotak Mahindra Bank Withdraws Ad Campaign Featuring Comedian Tanmay Bhat - Sakshi

ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రముఖ కమెడియన్‌ తన్మయ్‌ బట్‌తో కుదుర్చుకున్న వ్యాపార ప్రకటనల నుంచి తప్పించింది. అందుకు కారణం తన్మయ్‌ నోటి దురుసేనని తెలుస్తోంది. 

11 ఏళ్ల క్రితం తన్మయ్‌ బట్‌ ఓ సామాజిక వర్గంతో పాటు, దేవుళ్ల విగ్రహాలు, చిన్న పిల్లల గురించి అసభ‍్యకర వ్యాఖ్యలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  ఆ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. ఆ అభ్యంతర వ్యాఖ్యలు మరో సారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశగా మారాయి.

తాజాగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 811 పేరుతో కమెడియన్‌ గ్రూప్‌ ఆల్ ఇండియా బక్ చోడ్‌తో కలిసి కమెడియన్‌ తన్మయ్‌ బట్‌, సమయ్ రైనాలతో ఓ యాడ్‌ క్యాంపెయిన్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే పలువురు నెటిజన్లు దశాబ్దం నాటి ట్వీట్‌లను వెలుగులోకి తెచ్చారు. వాటిని రీట్వీట్‌ చేస్తూ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ బాయ్ కాట్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌లతో హోరెత్తించారు.

బాలీవుడ్​ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్ సైతం తన్మయ్‌ బట్‌తో అడ్వటైజ్మెంట్‌ చేయడాన్ని తప్పు పట్టింది. ఆమెకు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. పలువురు వినియోగదారులు తమకు కొటక్‌ బ్యాంక్‌లో అకౌంట్‌లు ఉన్నాయని, వాటిని వెంటనే క్యాన్సిల్‌ చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో కొటక్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు క్షమాపణలు చెప్పింది. కమెడియన్‌ గ్రూప్‌ ఆల్ ఇండియా బక్ చోడ్‌తో కలిసి చేసే ఈ వ్యాపార ప్రకటన నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement