Tanmay Bhat
-
కమెడియన్ నోటి దురుసు.. షాకిచ్చిన బ్యాంక్!
ప్రైవేట్ బ్యాంక్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రముఖ కమెడియన్ తన్మయ్ బట్‌తో కుదుర్చుకున్న వ్యాపార ప్రకటనల నుంచి తప్పించింది. అందుకు కారణం తన్మయ్ నోటి దురుసేనని తెలుస్తోంది. 11 ఏళ్ల క్రితం తన్మయ్ బట్ ఓ సామాజిక వర్గంతో పాటు, దేవుళ్ల విగ్రహాలు, చిన్న పిల్లల గురించి అసభ్యకర వ్యాఖ్యలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. ఆ అభ్యంతర వ్యాఖ్యలు మరో సారి సోషల్ మీడియాలో చర్చనీయాంశగా మారాయి. తాజాగా కొటక్ మహీంద్రా బ్యాంక్ 811 పేరుతో కమెడియన్ గ్రూప్ ఆల్ ఇండియా బక్ చోడ్తో కలిసి కమెడియన్ తన్మయ్ బట్, సమయ్ రైనాలతో ఓ యాడ్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే పలువురు నెటిజన్లు దశాబ్దం నాటి ట్వీట్లను వెలుగులోకి తెచ్చారు. వాటిని రీట్వీట్ చేస్తూ కొటక్ మహీంద్రా బ్యాంక్ బాయ్ కాట్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో హోరెత్తించారు. Hi @KotakBankLtd @udaykotak I am a customer of your bank but the fact that you have hired a hinduphobic, woman and child abuser Tanmay Bhat for a campaign is making me consider closing my account. Discontinue the association with him and apologise? pic.twitter.com/W57pdic4jf — Monica Verma (@TrulyMonica) February 12, 2023 బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ సైతం తన్మయ్ బట్‌తో అడ్వటైజ్మెంట్ చేయడాన్ని తప్పు పట్టింది. ఆమెకు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. పలువురు వినియోగదారులు తమకు కొటక్ బ్యాంక్‌లో అకౌంట్లు ఉన్నాయని, వాటిని వెంటనే క్యాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో కొటక్ బ్యాంక్ ఖాతాదారులకు క్షమాపణలు చెప్పింది. కమెడియన్ గ్రూప్ ఆల్ ఇండియా బక్ చోడ్తో కలిసి చేసే ఈ వ్యాపార ప్రకటన నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపింది. We, at Kotak Mahindra Bank Ltd. do not support or endorse the views of actors made in their personal capacity that harm or offend any individual or group. We have withdrawn the campaign. — Kotak 811 (@kotak811) February 12, 2023 -
ఆమెను 'సోకాల్డ్' అని ఎందుకన్నామంటే!
న్యూఢిల్లీ: భారత లెజండ్ సినీ గాయని లతా మంగేష్కర్‌ను ఉద్దేశించి 'సోకాల్డ్' ప్లేబ్యాక్ సింగర్ అంటూ కథనాన్ని ప్రచురించడంపై తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరణ ఇచ్చింది. 'సోకాల్డ్' పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ ప్రఖ్యాత గాయనిని కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చింది. లత, సచిన్ టెండూల్కర్ లను ఉద్దేశించి వెకిలి హాస్యపు వీడియో పెట్టి కమెడియన్ తన్మయ్ భట్ దుమారం రేపిన సంగతి తెలసిందే. ఈ వివాదంపై కథనాన్ని రాస్తూ ఆమె ఒక అనామక గాయని అన్న తరహాలో 'సోకాల్డ్' అని పేర్కొంటూ అమెరికా దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. లతను అవమానపరిచేలా ఈ కథనం ఉండటంతో ట్విట్టర్లో ఆ పత్రిక తీరుపై భారతీయులు మండిపడ్డారు. 1943 నుంచి సినీ పాటలు పాడుతూ.. 13భాషల్లో మధురమైన గీతాలు ఆలాపించి.. భారత రత్న కీర్తిని పొందిన అంత గొప్ప గాయనిని ఇలా అనామక నేపథ్య గాయని అంటూ కథనాన్ని రాస్తారా? అని పలువురు మండిపడ్డారు. దీంతో న్యూయార్క్ టైమ్స్‌లో పనిచేస్తున్న భారతీయ రచయిత అసీమ్ ఛాబ్రా విమరణ ఇచ్చారు. తాము లతను అవమానపరచలేదని పేర్కొన్నారు. -
వీడియో దుమారంపై హీరోయిన్ సీరియస్!
సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్ తన్మయ్ భట్ వీడియోపై బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ స్పందించింది. కమెడియన్ తన్మయ్ కు తన పూర్తి మద్ధతు తెలుపుతూ ట్విట్టర్లో కొన్ని కామెంట్లను పోస్టు చేసింది. ఫ్రెండ్ గా నీకు మద్ధతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నువ్వు ఏదైనా పని చేసినప్పుడు.. అది అందరూ మెచ్చుకునేలా, నవ్వు తెప్పించేలా ఉండాలని, అయితే అందరూ వ్యతిరేకించేలా ఉండకూడదని సోనమ్ చురక అంటించింది. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి, ముందు వాటిపై స్పందించాల్సిన అవసరముందని, అంతేకానీ ఇలా దొరికిన వీడియోలపై రెచ్చిపోవడం తగదని సోనమ్ కపూర్ సూచించింది. 'భారత రత్నాలు' అయిన ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ల పట్ల కమెడియన్ తన్మయ్ భట్ హాస్యంతో కూడిన వీడియో చేశాడు. ఆ తర్వాత ఈ వీడియో ఎక్కడ పోస్ట్ అయిందో కానీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసి అందరికీ తీవ్ర ఆవేశం తెప్పించింది. ఈ వీడియో ఆన్లైన్లో కనిపించడకుండా బ్లాక్ చేయాలంటూ గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్ సంస్థలను అడిగారు. ఈ వీడియోను తొలగించాలని తన్మయ్ ను ఆదేశించారు. Being living legends I know @sachin_rt and @mangeshkarlata don't even know and care about what's going on!stop spewing hate on their behalf! — Sonam Kapoor (@sonamakapoor) 31 May 2016 Dear @thetanmay ,being your friend I know what you say and do is never to offend, but to make people laugh.. https://t.co/O2kFj0dhjX — Sonam Kapoor (@sonamakapoor) 31 May 2016 Don't you guys think there are issues that are more important than @thetanmay snapchat jokes??? I'm in shock with this over reaction! — Sonam Kapoor (@sonamakapoor) 31 May 2016 -
ఆ అసభ్య వీడియోను వెంటనే బ్లాక్ చేయండి!
సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్ తన్మయ్ భట్ వీడియోపై ముంబై సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ల పట్ల అసభ్య హాస్యంతో ఉన్న ఈ వీడియో ఆన్లైన్లో కనిపించడకుండా బ్లాక్ చేయాలంటూ గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్‌లను వారు అడిగారు. లతా, సచిన్‌ను అవమానపరిచేవిధంగా ఉన్న ఈ వీడియోను తొలగించాలని ఆదేశించారు. ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. 'లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్.. సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు' అంటూ సంభాషణ సాగే వీడియోలో 86 ఏళ్ల లతా ఇంకా ఎందుకు బతికి ఉందని అంటూ వెకిలీ హాస్యాన్ని చూపించారు. ఈ వీడియోపై ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడగా.. బీజేపీ, శివసేన, ఎమ్మెన్నెస్ దీని రూపకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్బుక్లో, యుట్యూబ్లో ఈ వీడియో పెట్టిన తన్మయ్ భట్‌తోపాటు ఏఐబీ టీమ్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఐపీ అడ్రస్‌ను తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ముంబై అసిస్టెంట్ పోలీసు కమిషనర్ యశ్వంత్ పాఠక్ విలేకరులకు తెలిపారు. -
కష్టాల్లో కమెడియన్
ముంబై: 'సచిన్ వర్సెస్ లత సివిల్ వార్' వ్యవహారంతో కమెడియన్ తన్మయ్ భట్ కష్టాల్లో పడ్డాడు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను అమానించిందుకు అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై వివాదం రేగింది. వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు వీడియో చూపించారు. వీడియాలో ఇలా సాగుతుంది. లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్ సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన్మయ్ తన వికారాన్ని బయటపెట్టుకున్నాడని మండిపడ్డారు. బాల్ థాకరే బతికివుంటే అతడికి చుక్కలు చూపించేవారని పేర్కొన్నారు. వివాదాలు తన్మయ్ కు కొత్తకాదని దుమ్మెత్తిపోశారు.