కష్టాల్లో కమెడియన్ | Tanmay Bhat trolled on Twitter for mocking Tendulkar, Lata Mangeshkar | Sakshi
Sakshi News home page

కష్టాల్లో కమెడియన్

Published Mon, May 30 2016 12:04 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM

కష్టాల్లో కమెడియన్ - Sakshi

కష్టాల్లో కమెడియన్

ముంబై: 'సచిన్ వర్సెస్ లత సివిల్ వార్' వ్యవహారంతో కమెడియన్ తన్మయ్ భట్ కష్టాల్లో పడ్డాడు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను అమానించిందుకు అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై వివాదం రేగింది. వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు వీడియో చూపించారు. వీడియాలో ఇలా సాగుతుంది.

లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్
సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన్మయ్ తన వికారాన్ని బయటపెట్టుకున్నాడని మండిపడ్డారు. బాల్ థాకరే బతికివుంటే అతడికి చుక్కలు చూపించేవారని పేర్కొన్నారు. వివాదాలు తన్మయ్ కు కొత్తకాదని దుమ్మెత్తిపోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement