ఆ అసభ్య వీడియోను వెంటనే బ్లాక్ చేయండి!
ఆ అసభ్య వీడియోను వెంటనే బ్లాక్ చేయండి!
Published Mon, May 30 2016 5:13 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్ తన్మయ్ భట్ వీడియోపై ముంబై సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ల పట్ల అసభ్య హాస్యంతో ఉన్న ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడకుండా బ్లాక్ చేయాలంటూ గూగుల్, ఫేస్‌బుక్, యుట్యూబ్‌లను వారు అడిగారు. లతా, సచిన్‌ను అవమానపరిచేవిధంగా ఉన్న ఈ వీడియోను తొలగించాలని ఆదేశించారు.
ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. 'లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్.. సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు' అంటూ సంభాషణ సాగే వీడియోలో 86 ఏళ్ల లతా ఇంకా ఎందుకు బతికి ఉందని అంటూ వెకిలీ హాస్యాన్ని చూపించారు. ఈ వీడియోపై ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడగా.. బీజేపీ, శివసేన, ఎమ్మెన్నెస్ దీని రూపకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్‌బుక్‌లో, యుట్యూబ్‌లో ఈ వీడియో పెట్టిన తన్మయ్ భట్‌తోపాటు ఏఐబీ టీమ్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఐపీ అడ్రస్‌ను తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ముంబై అసిస్టెంట్ పోలీసు కమిషనర్ యశ్వంత్ పాఠక్ విలేకరులకు తెలిపారు.
Advertisement
Advertisement