వీడియో దుమారంపై హీరోయిన్ సీరియస్! | Stop spewing hate on behalf of Sachin and Lata, says Sonam | Sakshi
Sakshi News home page

వీడియో దుమారంపై హీరోయిన్ సీరియస్!

Published Tue, May 31 2016 8:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

వీడియో దుమారంపై హీరోయిన్ సీరియస్! - Sakshi

వీడియో దుమారంపై హీరోయిన్ సీరియస్!

సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్‌ తన్మయ్‌ భట్‌ వీడియోపై బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ స్పందించింది. కమెడియన్ తన్మయ్ కు తన పూర్తి మద్ధతు తెలుపుతూ ట్విట్టర్లో కొన్ని కామెంట్లను పోస్టు చేసింది. ఫ్రెండ్ గా నీకు మద్ధతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నువ్వు ఏదైనా పని చేసినప్పుడు.. అది అందరూ మెచ్చుకునేలా, నవ్వు తెప్పించేలా ఉండాలని, అయితే అందరూ వ్యతిరేకించేలా ఉండకూడదని సోనమ్ చురక అంటించింది. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి, ముందు వాటిపై స్పందించాల్సిన అవసరముందని, అంతేకానీ ఇలా దొరికిన వీడియోలపై రెచ్చిపోవడం తగదని సోనమ్ కపూర్ సూచించింది.

'భారత రత్నాలు' అయిన ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌, ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ల పట్ల కమెడియన్ తన్మయ్ భట్ హాస్యంతో కూడిన వీడియో చేశాడు. ఆ తర్వాత ఈ వీడియో ఎక్కడ పోస్ట్ అయిందో కానీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసి అందరికీ తీవ్ర ఆవేశం తెప్పించింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడకుండా బ్లాక్ చేయాలంటూ గూగుల్‌, ఫేస్‌బుక్‌, యుట్యూబ్‌ సంస్థలను అడిగారు. ఈ వీడియోను తొలగించాలని తన్మయ్ ను ఆదేశించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement