ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచారచిత్రాలు వేటిలోనూ తాను చేయడంలేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచారచిత్రాలు వేటిలోనూ తాను చేయడంలేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఓ టీవీ ప్రకటన చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారని, భారతదేశ సమ్మిళిత అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా భారతీయులంతా కలిసి రావాలని అందులో ఆయన కోరుతారని ప్రచారం జరిగింది.
అయితే.. ఈ విషయంలో తన నిర్ణయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రధానమంత్రి గానీ, ప్రధాని కార్యాలయం గానీ తనను ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ఏమీ కోరలేదని ఆయన అన్నారు.