మోదీ ఓటు హక్కు కోల్పోవాల్సిందే : ఓవైసీ | Asaduddin Owaisi fires on Ramdev overpopulation control comments | Sakshi
Sakshi News home page

మోదీ ఓటు హక్కు కోల్పోవాల్సిందే : ఓవైసీ

Published Mon, May 27 2019 11:57 AM | Last Updated on Mon, May 27 2019 2:22 PM

Asaduddin Owaisi fires on Ramdev overpopulation control comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యోగా గురు రామ్‌దేవ్‌బాబా జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. తాజాగా రామ్‌దేవ్ బాబా జనాభాను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. మరో 50ఏళ్లలో భారత దేశ జనాభా 150కోట్లను మించకూడదని అన్నారు. అంతకు మించి జనాభా పెరిగితే ప్రభుత్వాలు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేవని అభిప్రాయపడ్డారు. ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్న ఆయన మూడో బిడ్డ పుడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండటంతో పాటూ వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని రామ్‌దేవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ది మూడో బిడ్డకు అందకుండా చూడాలని చెప్పారు. మతంతో సంబంధం లేకుండా సంతానం విషయంలో ప్రతి ఒక్కరూ నియంత్రణ పాటించాలని రామ్‌దేవ్ బాబా సూచించారు.

రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇచ్చారు. 'స్పష్టమైన రాజ్యాంగ విరుద్ధమైన విషయాలు మాట్లాడేవారిని నిలువరించడానికి ఎలాంటి చట్టాలు లేవు. అయినా రామ్‌దేవ్‌ బాబా ఆలోచనలకు ఎందుకంత ప్రాధాన్యం దక్కుతుంది? రామ్‌ దేవ్‌ బాబా పొట్టతో చేసినట్టో లేక కాళ్లు ఆడించినట్టో కాదు. అలా అయితే మూడో సంతానం కాబట్టి నరేంద్రమోదీ కూడా తన ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది' అని అసదుద్దీన్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement