
సాక్షి, హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్ బాబా జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు కోల్పోవాల్సిందేనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. రామ్‌దేవ్ బాబా జనాభాను తగ్గించేందుకు మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండటంతోపాటు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని పేర్కొనడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘రాజ్యాంగ విరుద్ధమైన విషయాలు మాట్లాడేవారిని నిలువరించడానికి ఎలాంటి చట్టాలు లేవు. అయినా రామ్‌దేవ్ బాబా ఆలోచనలకు ఎందుకంత ప్రాధాన్యం దక్కుతుంది? రామ్‌దేవ్ బాబా పొట్టతో చేసినట్టో లేక కాళ్లు ఆడించినట్టో కాదు. అలా అయితే మూడో సంతానం కాబట్టి మోదీ కూడా తన ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది’అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment