సాక్షి, న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యాన్ని తప్పుపడుతూ యోగా గురు రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై జూన్ ఒకటో తేదీన బ్లాక్‌డేగా పాటించి, నిరసన తెలుపుతామని రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాందేవ్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్‌వోఆర్‌డీఏ శనివారం ట్విట్టర్‌లో పేర్కొంది.
ఇందుకు నిరసనగా జూన్ 1వ తేదీన బ్లాక్‌డేగా పాటిస్తూ విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలుపుతామని తెలిపింది. ఇప్పటికే ఎఫ్‌వోఆర్‌డీఏ రాందేవ్‌పై రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా కూడా వేసింది. అల్లోపతి వైద్యులు, వైద్యంపై ఇటీవల రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.
(చదవండి: రాజాకు సతీవియోగం)
Comments
Please login to add a commentAdd a comment