సిక్కులపై వ్యాఖ్యలు.. రాహుల్ నివాసం ఎదుట భారీ నిరసనలు | Sikhs protest outside Rahul Gandhis house in Delhi over remarks in US | Sakshi
Sakshi News home page

సిక్కులపై వ్యాఖ్యలు.. రాహుల్ నివాసం ఎదుట భారీ నిరసనలు

Published Wed, Sep 11 2024 5:14 PM | Last Updated on Wed, Sep 11 2024 5:21 PM

Sikhs protest outside Rahul Gandhis house in Delhi over remarks in US

ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట సిక్కులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. జనపథ్‌ రోడ్డులోని ఆయన నివాసం వద్ద పోలీసుల బారికేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని బద్దలు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. భారత్ లో సిక్కులు తలపాగా, కడియాలు ధరించేందుకు అనుమతి ఉందా అంటూ ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఇదే పోరాటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే దేశంలో సిక్కుల భద్రత గురించి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ఈ క్రమంలో  రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పలు సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ మద్దతు కలిగిన పలు సిక్కు గ్రూపులు నిరసనలు చేపట్టారు. సిక్కుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాహుల్ శిక్కులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

 ఈ వ్యాఖ్యలను ఇప్పటికే బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. విదేశాల వేదికగా రాహుల్‌ ఎల్లప్పుడూ భారత్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement