
రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలకు నిరసనగా కర్నాటకలో ఆందోళన చేస్తున్న వైద్యులు
సాక్షి, ఢిల్లీ/ హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో అల్లోపతి వైద్యం పని చేయడం లేదని.. వైద్యులు విఫలమయ్యారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాఖ్యలు చేసిన రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం నల్ల దినంగా (బ్లాక్ డే) వైద్యులు రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు.
పీపీఈ కిట్లు ధరించి.. నల్లబ్యాడ్జీలు పెట్టుకుని విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌పై ఉత్తరాఖండ్ ఐఎంఏ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీతోపాటు కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నె తదితర ప్రాంతాల్లో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోషల్ మీడియాలో కూడా రామ్‌దేవ్ బాబాకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. #ArrestRamdev అనే హ్యాష్‌ట్యాగ్ చేస్తూ ట్విటర్, ఫేసుబుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి, వైద్యారోగ్య మంత్రులను విజ్ఞప్తులు పంపుతున్నారు.
చదవండి: బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు
చదవండి: రామ్‌దేవ్ బాబా ఇది ‘తమాషా’ కాదు: ఆరోగ్యశాఖ మంత్రి


పంజాబ్‌లోని ఓ ఆస్పత్రిలో..
Comments
Please login to add a commentAdd a comment