బాబా రాందేవ్ ‘కింబో’ యాప్
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సాప్‌కు కిల్లర్‌గా, బాబా రాందేవ్ స్వదేశీ యాప్ అంటూ తీసుకొచ్చిన ‘కింబో’ యాప్‌తో ప్రమాదమేనట. అందుకే ఈ యాప్‌ను వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేశారు. ఐఫోన్ కంపెనీ కూడా తన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను తొలగించింది. కేవలం గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్‌లో మాత్రమే కాక, కింబో పేజీ యాప్‌లో కూడా ఇది ఓపెన్ కావడం లేదు. దానిలోకి లింక్స్‌ను క్లిక్ చేస్తే, ఎర్రర్ చూపిస్తోంది. అయితే ఎందుకు కింబో యాప్‌ను గూగుల్, ఆపిల్‌లు తమ సంబంధిత స్టోర్లలో డిలీట్ చేశాయో స్పష్టమైన కారణం తెలియడం లేదు. కానీ డెవలపర్లు మాత్రం ఈ యాప్ ప్రమాదకరమని, బగ్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఒక ట్విటర్ యూజర్, కింబో యాప్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశాడు. దానిలో స్వదేశీ యాప్, పాకిస్తానీ నటి ఫోటోను ప్రమోషన్ కూడా వాడుతుందని పేర్కొన్నాడు. భారతీయుల కోసం భారతీయులు రూపొందించిన ఈ స్వదేశీ యాప్‌లో పాకిస్తానీ నటి ఫోటో కనిపించడం ఏమిటి? అని యూజర్లు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాక ఆధార్ సెక్యురిటీ పరంగా ఈ యాప్‌లో పలు లోపాలున్నాయనిద ఫ్రెంచ్ సెక్యురిటీ రీసెర్చర్ ఇలియట్ ఆండర్సన్ అన్నారు. ఈ యాప్ చాలా బగ్స్‌తో కూడుకుని ఉందని, యూజర్లు ఈ యాప్ వాడుతూ పంపించుకున్న మెసేజ్‌లన్నీ తాను యాక్సస్ చేయగలుగుతున్నానని పేర్కొన్నారు. పతంజలి కమ్యూనికేషన్స్ కూడా ఈ బగ్స్‌ను ఫిక్స్ చేయడంతోనే కింబో యాప్‌ను డిలీట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ యాప్ మొత్తం ఒక జోక్‌గా అభివర్ణించారు. ‘ఓకే, నేను ఇక్కడితో ఆపుతున్నా. కింబో ఆండ్రాయిడ్ యాప్ అనేది భద్రతా విపత్తు. యూజర్ల మెసేజ్‌లన్నీ నేను యాక్సస్ చేయగలను. ఈ కింబోయాప్ పెద్ద జోక్. ఈ సమయంలో దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోకుండా ఉంటేనే మేలు’ అని ఇలియట్ ట్వీట్ చేశారు. ఇది బోలో మెసెంజర్‌ను కాఫీ చేసిందనే ఆరోపణలతో కూడా కింబోను ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. కింబోయాప్ మరో అప్లికేషన్ కాపీ పేస్టని, వీటి స్క్రీన్‌షాట్లు, వివరాలు అన్నీ సమానంగా ఉన్నాయి అని ఇలియట్‌తో పాటు మరో ట్విటర్ యూజర్ కూడా ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment