
'జర్నలిస్టుగా మాత్రమే కలిశా'
లష్కరే తోయిబా చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను జర్నలిస్టుగా మాత్రమే కలిశానని వేద్ ప్రతాప్ వైదిక్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : లష్కరే తోయిబా చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను జర్నలిస్టుగా మాత్రమే కలిశానని వేద్ ప్రతాప్ వైదిక్ స్పష్టం చేశారు. తన భేటీ వెనుక ప్రభుత్వ ప్రమేయం లేదని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. పాకిస్తాన్‌లో హాఫీజ్ సయీద్‌తో జర్నలిస్ట్, రాందేవ్ బాబా అనుచరుడు వేదప్రతాప్ వైదిక్ కలవటంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టిన విషయం తెలిసిందే. దీనిపై వేద్ ప్రతాప్ వైదిక్ పై విధంగా స్పందించారు.
కాగా ఈ భేటీపై ప్రతిపక్షాలు సోమవారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీసాయి. వారి భేటీతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసినా విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విదేశీ వ్యవహారాల శాక మంత్రితో ప్రకటన చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.