
డెహ్రాడూన్: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు అత్యంత సన్నిహితులు, పతంజలి ఆయుర్వేద సంస్థ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పతంజలి యోగాపీఠం సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తల తిరగడం, ఛాతిలో నొప్పి రావడంతో బాలకృష్ణను ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ అత్యవసర విభాగపు వైద్యులు ఆయనకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని సమాచారం. ఆచార్య బాలకృష్ణ నేపాల్ సంతతికి చెందిన భారతీయ బిలియనీర్.
Comments
Please login to add a commentAdd a comment