పంచె పైకి కట్టి.. రాందేవ్ ఫుట్బాల్ | Ramdev baba plays football wearing his own attire | Sakshi
Sakshi News home page

పంచె పైకి కట్టి.. రాందేవ్ ఫుట్బాల్

Published Mon, Jul 25 2016 3:30 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

పంచె పైకి కట్టి.. రాందేవ్ ఫుట్బాల్ - Sakshi

పంచె పైకి కట్టి.. రాందేవ్ ఫుట్బాల్

యోగా గురువు రాందేవ్ బాబా ఏం చేసినా వెరైటీగానే చేస్తారు. తాజాగా ఆయన కొంతమంది స్టార్ ఆటగాళ్లతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పథకాలైన స్వచ్ఛభారత్ మిషన్, బేటీ బచావో- బేటీ పఢావో కార్యక్రమాలపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాందేవ్ పాల్గొన్నారు. ఇందు కోసం బాలీవుడ్ తారలు, పార్లమెంటేరియన్లు కలిసి ఒక ఫుట్బాల్ మ్యాచ్ అడగా, అందులో తాను సైతం అంటూ.. రాందేవ్ తన పంచె పైకి కట్టుకుని ఫుట్బాల్ ఆడారు. ఆల్ స్టార్స్ ఫుట్ బాల్ క్లబ్బు జట్టులో రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, డినో మోరియా, సిద్దార్థ మల్హోత్రా తదితరులుండగా... ఆ జట్టుకు అభిషేక్ బచ్చన్ నాయకత్వం వహించాడు.

ఇక పార్లమెంటేరియన్ల జట్టుకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో కెప్టెన్గా వ్యవహరించారు. టీఎంసీ ఎంపీ, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ ప్రసూన్ బెనర్జీ, బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, పర్వేష్ వర్మ, కమలేష్ పాశ్వాన్ సతీష్ గౌతమ్, భోలా సింగ్, ఐఎన్ఎల్డీ ఎంపీ దుష్యంత చౌతాలా, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు ఆడారు. ఆధునిక్ అనే ఓ ప్రైవేటు గ్యాలరీ ఏర్పాటుచేసిన ఈ ఆటను చూసేందుకు 200 రూపాయల నుంచి 800 రూపాయల వరకు టికెట్లు పెట్టారు. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆ రెండు పథకాల ప్రచారానికి విరాళంగా ఇచ్చారు. ఈ రెండు కార్యక్రమాల్లో దేనికీ రాందేవ్ విరాళం ఇవ్వకపోయినా.. ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన తారలు, నాయకులకు మాత్రం పతంజలి ఆయుర్వేద వారి ఎనర్జీ డ్రింకులు, స్నాక్స్ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement