ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శిష్యులతో పాటు, రూ. 4,500 కోట్ల పతంజలి సామ్రాజ్యానికి ఏకైక అధిపతి అయిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఒకప్పుడు అమెరికా వీసా తిరస్కరించిందట. ఆయనకు బ్యాంకు అకౌంటు లేదని, బ్రహ్మచారి కావడం వల్ల వీసా రాలేదట. తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి ఏకంగా పదేళ్ల పాటు అమలులో ఉండేలా వీసాను అందించి మరీ స్వయంగా అగ్రరాజ్యమే ఆయనను ఆహ్వానించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉన్న విషయం తెలిసిందే. తనకు అమెరికా వీసా తిరస్కరించిన విషయాన్ని రాందేవ్ బాబా గ్లోబల్ ఇన్వెస్టర్ సద్సులో చెప్పారు.