
రాందేవ్ బాబాపై ఎఫ్ఐఆర్ దాఖలు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాందేవ్ బాబాపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాందేవ్ బాబాపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కేవలం హనీమూన్ కోసం, పిక్నిక్ కోసమే రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు వెళ్తారంటూ రాందేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దళిత అమ్మాయిని అతడు పెళ్లి చేసుకుని ఉంటే ప్రధాని అయ్యేవాడని కూడా రాందేవ్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
రాహుల్ తలరాత ఏమాత్రం బాగోలేదని, విదేశీయురాలిని పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ ప్రధాని కాలేవని సోనియా ఆయనకు చెప్పిందని అన్నారు. కానీ భారతీయ అమ్మాయిని పెళ్లిచేసుకోవడం ఆ అబ్బాయికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందుకే ముందు ప్రధాని అయ్యి, తర్వాత ఓ విదేశీయురాలిని పెళ్లి చేసుకోవాలని వాళ్ల అమ్మ చెప్పిందన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తాజాగా రాందేవ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.