వారిపై ఉక్కుపాదం మోపాలి: బాబా రాందేవ్
నాగపూర్: జమ్ముకశ్మీర్లో ఆందోళనలు చేపడుతున్న వేర్పాటువాదులపై కఠినచర్యలు తీసుకోవాలని యోగా గురు బాబా రాందేవ్ ప్రభుత్వానికి సూచించారు. కశ్మీరీ ప్రజలు 90 శాతం మంది శాంతిని కోరుకుంటున్నారని.. మిగిలిన వారు మాత్రమే సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. ఆదివారం నాగపూర్లో మీడియాతో మాట్టాడుతూ.. అశాంతికి కారణమౌతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని రాందేవ్ బాబా కోరారు.
జమ్ముకశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, అవి ఫలితం దిశగా ఉండాలని బాబా రాందేవ్ సూచించారు. భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలు, నూతన పథకాల విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన బాగుందని కితాబిచ్చారు.