seperatists
-
వారిపై ఉక్కుపాదం మోపాలి: బాబా రాందేవ్
నాగపూర్: జమ్ముకశ్మీర్‌లో ఆందోళనలు చేపడుతున్న వేర్పాటువాదులపై కఠినచర్యలు తీసుకోవాలని యోగా గురు బాబా రాందేవ్ ప్రభుత్వానికి సూచించారు. కశ్మీరీ ప్రజలు 90 శాతం మంది శాంతిని కోరుకుంటున్నారని.. మిగిలిన వారు మాత్రమే సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. ఆదివారం నాగపూర్‌లో మీడియాతో మాట్టాడుతూ.. అశాంతికి కారణమౌతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని రాందేవ్ బాబా కోరారు. జమ్ముకశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, అవి ఫలితం దిశగా ఉండాలని బాబా రాందేవ్ సూచించారు. భద్రత, అంతర్జాతీయ వ్యవహారాలు, నూతన పథకాల విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన బాగుందని కితాబిచ్చారు. -
ఆ 56 అంగుళాల ఛాతి బలం ఎక్కడ?
పాట్నా:ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జెండాలు ఎగురువేస్తుంటే మోదీ ఛాతి బలం ఎక్కడకెళ్లిందని తీవ్రంగా విమర్శించారు. గత సాధారణ ఎన్నికల్లో తన ఛాతి బలాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన మోదీ.. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జమ్మూ కళ్మీర్ లో జెండాలు ఎగురవేస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. 'మోదీజీ ఇప్పుడు మీకు ఏమైంది?, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై చర్యలు ఏవి?, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారా?, ఆ 56 అంగుళాల ఛాతి బలం ఎక్కడ?అని నితీష్ ప్రశ్నించారు. గత రెండు రోజుల క్రితం జమ్ము కాశ్మీర్లో హురియత్ మద్దతుదారులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. శ్రీనగర్‌లోని ఓ మసీదు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కాశ్మీర్లో ఐఎస్ఐఎస్ జెండాలు
జమ్ము కాశ్మీర్లో హురియత్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని ఓ మసీదు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కాశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కాశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి. దీంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోకి ఇస్లామిక్ స్టేట్ క్రమంగా చాపకింద నీరులా చొచ్చుకొస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు మీద దాడికేసు దోషి అఫ్జల్ గురు అస్థికలను అతడి స్వగ్రామానికి రప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో ఇలాంటి సంఘటనలు వద్దంటూ కేంద్రం గతంలో హెచ్చరించినా.. వేర్పాటువాదులు మాత్రం తరచు పాకిస్థాన్ జెండాలను ఎగరేస్తూనే ఉన్నారు.