సాక్షి, న్యూఢిల్లీ : భారత అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న’ ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును అందించలేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సన్యాసులకు ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.(ప్రణబ్‌దా భారతరత్న )
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు కనీసం ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం దరదృష్టకరం. మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి లాంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదు. వచ్చే ఏడాదైనా కేంద్రం సన్యాసుల పట్ల సానుకూలంగా స్పందించి ఒక్కరికైనా భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నా’ అని రాందేవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత రత్న అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment