monks
-
వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల సంపద- సన్యాసుల్లో కలిసిపోయారు!
అందరూ కస్టపడి సంపాదించి జీవితంలో కుబేరులు కావాలని, విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కంటూ ఉంటారు. అయితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ మాత్రం కోట్ల సంపదను వదిలి సన్యాసుల్లో కలిసిపోయారు. ఇంతకీ వారెవరు? ఎందుకిలా చేశారు? వారి సంపాదన ఎలా ఉండేదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. కొంతమంది ఆస్తులు లేకున్నా జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మరి కొంతమంది ఎన్ని ఆస్తులున్నా మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటారు. గుజరాత్ రాష్ట్రంలో ధనవంతులైన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య కోట్ల సంపదను.. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. ఈ వజ్రాల వ్యాపారి కుమార్తె ఇప్పటికే తన తొమ్మిదవ ఏటనే సన్యాస దీక్షను తీసుకుంది. ఇదీ చదవండి: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ - అదేంటో తెలుసా? ఇప్పుడు ఆమె తల్లి తండ్రులు కూడా సన్యాసులుగా మారారు. సంవత్సరానికి రూ. 15 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే ఫ్యామిలీ అన్ని వదిలి సన్యాసిగా మారడంతో ఎంతోమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. షా కుమారుడు భాగ్యరత్న అతని దీక్షా వేడుకకు ఫెరారీలో, అతని తల్లిదండ్రులు దీపేష్ & పికా అదే జాగ్వార్లో ప్రయాణించారు. తమ కుమార్తె ఇప్పటికే సన్యాసంలో కలిసిపోవడం వల్ల వీరు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. సన్యాసంలో చేరకముందే వారు అలాంటి జీవితం గడపాలని నిర్ణయించుకుని దీపేష్ షా 350 కిమీ, అతని భార్య పికా షా 500 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మా కుమార్తె సన్యాసంలో స్వీకరించినప్పుడే ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు దీపేష్ షా వెల్లడించారు. జీవితంలో ఎన్నెన్నో విజయాలను చూసాను, కానీ అంతిమంగా శాంతి, ఆనందం కోసం ఈ దీక్ష స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు? దీపేష్ షా తండ్రి ప్రవీణ్ బెల్లం, చెక్కర వ్యాపారం చేసేవాడు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తోంది. అయినప్పటికీ భౌతిక సుఖాలు, విలాసాలు శాశ్వతం కాదని ఇప్పుడు జైన మతంలో సన్యాసులుగా చేరి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. -
గుజరాత్లో సన్యాసిగా సంపన్నుడి కూతురు
చిన్నవయసులో భౌతిక సుఖాలను త్యజించి సన్యాసం స్వీకరించింది తొమ్మిదేళ్ల చిన్నారి. ఈ ఘటన గుజరాత్‌లోని వెసు అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. పైగా ఆ చిన్నారి సంపన్న వజ్రాల వ్యాపారి కూతురు. వివరాల్లోకెళ్తే వజ్రాల వ్యాపారి ధనేష్ అతడి భార్య సంఘ్వీలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె దేవాన్షి సన్యాసిగా దీక్ష తీసుకుంటున్నట్లు కుటంబ సభ్యులు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి సూరత్‌లో దాదాపు మూడు దశాబ్దాల నాటి డైమండ్ పాలిషింగ్ ఎగుమతి సంస్థ సంఘ్వీ అండ్ సన్స్ యజమాని. ప్రస్తుతం ఆమె అన్ని విలాసాలను త్యజించి సన్యాసి దీక్ష తీసుకుంటుంది. చిన్న వయసు నుంచి ఆమె ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అంతేగాదు అధికారికంగా ఈ సన్యాసి జీవితాన్ని స్వీకరించడానికి ముందు ఇతర సన్యాసులతో సుమారు రూ.700 కి.మీ దూరం నడించిందని, వారిలా జీవనం సాగించిందని కుంటుంబికులు చెబుతున్నారు. ఆమెకు ఐదు భాషలు తెలుసని, పైగా ఇతర ప్రత్యేక నైపుణ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సన్యాసి దీక్ష వేడుక గత శనివారం ప్రారంభమైంది. అంతేగాదు మంగళవారం, దేవాన్షి 'దీక్ష' తీసుకునే ఒక రోజు ముందు, నగరంలో కోలాహలంగా పెద్ద ఎత్తున మతపరమైన ఊరేగింపు జరిగింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: విచిత్రమైన ప్రేమ కథ: చనిపోయి తమ ప్రేమను గెలిపించుకున్న జంట!) -
సన్యాసుల వేషంలో వచ్చి.. బాలికల కిడ్నాప్‌నకు యత్నం
మెరకముడిదాం: పాఠశాలకు వెళుతోన్న ఇద్దరు బాలికలను సన్యాసి వేషంలో ఆటోలో భిక్షాటనకు వచ్చిన కొందరు అటకాయించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. పోలీసులు, బాలికలు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఊటపల్లికి చెందిన ఇద్దరు బాలికలు మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. వీరు గురువారం ఉదయం సైకిళ్లపై పాఠశాలకు బయలుదేరారు. గాదెల మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి అక్కడ సన్యాసి వేషాల్లో ఉన్న కొందరు వీరిని అడ్డగించే యత్నం చేశారు. బాలికలు కాస్త వేగంగా సైకిళ్లు తొక్కడంతో కొద్ది దూరం వెంబడించారు. అదే సమయంలో ప్రయాణికులతో కూడిన ఆటో అటువైపుగా రావడాన్ని గమనించిన సన్యాసులు వెనుదిరిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆటో బాలికలు వేగంగా మెరకముడిదాం చేరుకుని విషయాన్ని స్థానికులకు తెలిపారు. మెరకముడిదాం, ఊటపల్లి వాసులు అప్రమత్తమై మెరకముడిదాంకు సమీపంలో సన్యాసులను పట్టుకుని బుదరాయవలస పోలీసులకు అప్పగించారు. రెండు ఆటోలతో పాటు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఏడాది కిందట పార్వతీపురానికి చేరుకున్న వీరు కొన్నాళ్లు తగరపువలసలోను, 3 రోజుల కిందట బాడంగి వచ్చి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు ఆడపిల్లలు, ఐదుగురు మగవారు ఉన్నారు. వీరి ఆధార్ కార్డులను పరిశీలించగా వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, విచారిస్తున్నామని, కిడ్నాప్‌కు ప్రయత్నించినట్టు తేలితే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ సీహెచ్ నవీన్ పడాల్ తెలిపారు. -
‘సన్యాసులకు భారతరత్న ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ : భారత అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న’ ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును అందించలేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సన్యాసులకు ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.(ప్రణబ్‌దా భారతరత్న ) గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు కనీసం ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం దరదృష్టకరం. మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి లాంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదు. వచ్చే ఏడాదైనా కేంద్రం సన్యాసుల పట్ల సానుకూలంగా స్పందించి ఒక్కరికైనా భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నా’ అని రాందేవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత రత్న అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఏకదండి.. ద్విదండి... త్రిదండి అంటే ఏమిటి?
సన్యాసులు (స్వామీజీలు) వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. (దండి అంటే కర్ర అని అర్థం) ఒక కర్రను (ఏకదండి ) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు (ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది. రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు. మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర. శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధా్దంతాన్ని బోధిస్తారు !! -
సాధువుల పుష్కర స్నానానికి రూ.1.50కోట్లు!
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి వచ్చే 1,500 మంది సాధువులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఏర్పాట్ల నిమిత్తం రూ.1.50 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే.. పుష్కర ఏర్పాట్లలో భాగంగా సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీచేసింది. వివిధ జిల్లాల్లో జరుగుతున్న పుష్కర పనుల కోసం ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ.2 కోట్లను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. -
ద్రవమూ ఘనమూలాంటి జీవితం
మంచి కథ జీవితమంటే ఏమిటి? సాధువులు, సన్యాసులు, దొంగలు, పెద్ద మనుషులతో సహా ఎవడికీ సమాధానం తెలియదు. శిశువులు, పిచ్చివాళ్లకు మాత్రమే తెలిసుండొచ్చు, కానీ వాళ్లు చెప్పేది అర్థం కాదు. డీఎన్ఏ లాగా ఏ ఒక్కడి జీవితమూ ఇంకొకడిని పోలి లేదు. ఎక్కడికో తెలియకపోయినా ఎందుకైనా మంచిదని అందరూ పరిగెత్తుతున్నారు. ఈ వేగంలో రచయితలు కూడా గందరగోళంలో ఉన్నారు. తాను పరిగెత్తుతూ పరిగెత్తేవాడిని పరిశీలించాలి. ఇది షేర్ ఆటోలో వేలాడ్డానికి మించిన కష్టం. కథలు రాసేవాళ్లూ చదివేవాళ్లూ తగ్గిపోయారని అంటున్నారు. నిజమే తుక్కు రాసేవాళ్లూ చదివేవాళ్లూ తగ్గిపోయారు. మంచి కథకులు, చదువరులు ఇంకా ఉన్నారు. వాళ్లెప్పుడూ అల్ప సంఖ్యాకులే! 2014 ‘ప్రాతినిధ్య’ కథల సంపుటిలో వంశీధర్‌రెడ్డి ‘ఐస్‌క్యూబ్’కథ ఉంది. ఏకకాలంలో ద్రవ పదార్థంగానూ, ఘనంగానూ ఉండటమే ఐస్‌క్యూబ్ ప్రత్యేకత. జీవితం కూడా అంతే. గడ్డ కడుతూ కడుతూ కరిగిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒక సందర్భాన్ని ఎదుర్కోవడంలోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఈ కథలో ఏముంది? ఒక కుర్రాడు, కాస్త మందు తాగుతాడు, ఎవరో చనిపోతే హాజరవుతాడు, ఎప్పుడో విడిపోయిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఆమె గురించి ఆలోచనలు. చివరికి ‘ఒకటే జీవితం, ఏం చేసినా ఇప్పుడే, కానీ మనల్నే జీవితం అనుకునేవాళ్లని మోసం చేయడం కరెక్టేనా?’ అనుకోవడంతో కథ అయిపోతుంది. చైతన్యస్రవంతి పద్ధతిలో సాగే ఈ కథలో నగర జీవితానికి సంబంధించిన బోలెడన్ని షేడ్స్ ఉన్నాయి. తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచి ఆస్తి వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుని, తనకూ తన భార్యకూ సెలవు దొరికినప్పుడు వెంటిలేటర్ తీసేసి అంత్యక్రియలు చేసిన కొడుకున్నాడు(నిజానికి ఇది వేరే కథ). చాలా రోజుల తర్వాత గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇంటికి ప్లాన్ ఫ్రీగా అడుగుతుందేమోనని భయపడే కుర్రాడు. డబ్బులడుగుతుందనే భయం కూడా! చాలాకాలం తర్వాత ఎవరైనా స్నేహితులు ఫోన్ చేస్తే అందరిలోనూ ఇప్పుడు ఇవే భయాలు. స్త్రీ పురుష సంబంధాలపై సున్నితమైన విశ్లేషణ, అంతర్లీన హాస్యం ఉన్నాయి కథలో. గర్ల్‌ఫ్రెండ్‌తో ఒకరాత్రి గడిపేంత దూరం పోయిన ఆలోచనలు మళ్లీ వెనక్కి వస్తాయి. తనకే గుర్తులేని పుట్టినరోజుని భార్య సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఆ అపస్మారక స్థితి నుంచి బయటికొస్తాడు. రిలేషన్స్, కాంప్లికేషన్స్ ఈ రెంటికీ అర్థం ఒకటే అవుతున్న తరుణంలో ఐస్‌క్యూబ్ మంచి కథ. డా॥వంశీధర్ రెడ్డి -
మీ ఇంట్లో పిల్లాడినే.. స్వాగతం ఎందుకు?
కోల్ కతా: ఓ ఇంటికి చెందిన వ్యక్తి తన ఇంటికే వస్తే ఎవరైనా స్వాగతం పలుకుతారా అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తాను మీ ఇంట్లో పిల్లాడినేనని, మీ అందరిలో ఒకడినని ఆయన బేలూరులోని రామకృష్ణ మఠానికి చెందిన సన్యాసులతో అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన తన గురువుగారు స్వామీ ఆత్మస్థానందను కలిసేందుకు ఆయన చికిత్స పొందుతున్న కోల్ కతాలోని మఠానికి చెందిన ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఏర్పాట్లు, ఘనస్వాగతాన్ని ఉద్దేశించి అలా అన్నారు. 'మీరంతా మా గురువుగారికి సేవ చేస్తున్నారు. ఆయనను జాగ్రత్తగా చూసుకొండి' అంటూ ఆయన వారికి సూచించారు. -
వివేకం: రెండవ దృష్టికోణం
ఓ సన్యాసి తన సాధన కోసం అడవికి వెళ్లాడు. అతనికి ముందరి రెండు కాళ్లు పోగొట్టుకొని ఎటూ కదల్లేని ఒక నక్క ఎదురుపడింది. అది ఊరికే ఒక చెట్టు కింద కూర్చుని ఉంది. చూస్తే దానికి బాగానే ఆహారం దొరుకుతున్నట్టుగా ఉంది. ఆ నక్క బహుశా ఏ వేటగాడి ఉచ్చులోనో పడి అలా అయి ఉండవచ్చు అనుకున్నాడు. ఆ గాయం చాలా కాలం క్రితమే మానిపోయినట్టుంది. కాళ్లు లేకుండా నక్క ఎలా జీవించగలుగుతోందో సన్యాసికి అర్థం కాలేదు. ప్రకృతి కుంటితనంపై అంత దయ చూపదు. ఆహారం సంపాదించుకోలేకపోతే, మరణించినట్టే. అతని ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ, ఆ సాయంత్రం అక్కడికో సింహం వచ్చింది. అది తను వేటాడిన ఒక జంతు కళేబరాన్ని అక్కడికి తీసుకొచ్చి తిన్నది. తినగా మిగిలినదాన్ని నక్క ముందుంచింది. సన్యాసి తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ప్రతి రెండు మూడ్రోజులకూ, ఆ సింహం వచ్చేది, కొంత మాంసాన్ని నక్క ముందుంచి వెళ్లిపోయేది. దీంతో ఆ సన్యాసి ఇది దేవుడి నుండి వచ్చిన సందేశమే కాని మరొకటి కావడానికి వీల్లేదు. ఒక సింహం కుంటి నక్కను మేపడం ఒక అద్భుతం. అందుకే, అతను ఇది నాకో సందేశం అనుకున్నాడు. ఒక కుంటి నక్కకు అది కూర్చున్నచోటికే ఆహారం వస్తే, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న ఓ సన్యాసినైన నాకు ఆహారం ఎందుకు దొరకదు? భిక్షాటన కోసం నేను నగరానికి ఎందుకు వెళ్లాలి? కూర్చొని ధ్యానం చేయటానికి బదులు, నేను ఆహారం కోసం అనవసరంగా నగరానికి వెళుతున్నాను అనుకున్నాడు. అతను అడవిలో ఓ రాతిమీద కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. మూడు రోజులు ఎలాగో గడిపాడు. నాలుగో రోజు నుంచీ అతను ధ్యానం చేయలేకపోయాడు. అతను పొట్టను గట్టిగా పట్టుకొని కూర్చుండిపోయాడు. అతన్ని ఆకలి దహించి వేస్తోంది. 18 రోజులు గడిచాయి. అతను పూర్తి బలహీనంగా, బక్కగా అయిపోయాడు. కానీ ఇంకా దైవకృప కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. నాకు తటస్థ పడింది తప్పకుండా దేవుని సందేశమే. అయినా నాకేం జరుగుతోంది? ఎందుకు ఎవరూ రావట్లేదు. ఆహారాన్ని ఎందుకివ్వట్లేదు? అనుకున్నాడు. ఆ దారినే ఒక యోగి వెళుతూ, ఈ సన్యాసి మూలగడం విని, నీకేమైంది? ఎందుకు నువ్వీ పరిస్థితిలో ఉన్నావు? అని అడిగాడు, నక్క-సింహం ఉదంతాన్ని వివరించి సన్యాసి ఇలా అడిగాడు: వివేకవంతులైన మీరే చెప్పండి. ఇది దైవ సందేశం కాదా? ఆ యోగి అతన్ని చూసి, కచ్చితంగా ఇది దేవుడి సందేశమే. కానీ నువ్వు కుంటి నక్కలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? దయ కలిగిన సింహంలా ఎందుకు ప్రవర్తించడం లేదు? అన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకోవడంలో వీరిద్దరిలోని తేడా గమనించారా? మీరు పరిస్థితిని సరిగా అర్థం చేసుకోండి. సమస్య - పరిష్కారం కష్టాలొచ్చినప్పుడు మానవులు ఎక్కువ పూజలు చేయడం అవశ్యమా? అలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? - ఎన్.కుమారి, నిడదవోలు సద్గురు: పూజలు ఎందుకోసం చేస్తారు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికా? మీరు పూజలు చేసేది దానికోసం కాదు. భగవంతుడు మీ కోరికలు తీర్చే ఒక యంత్రంగా మీరు భావిస్తున్నారు. భగవంతుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలు తీరుస్తాడని అందరూ మీతో చెప్పడం వల్ల, ఆయన ముందు విన్నవించుకోవడాన్నే మీరు ప్రార్థన అనుకుంటున్నారు. అసలు భయం వల్ల కాని, ఆశల వల్ల కాని భగవంతుడిని పూజించడం ప్రార్థన కాదు. భగవంతుడికి బదులుగా ఒక గాడిదను చూపి, దాన్ని పూజిస్తేనే మీ కష్టాలు తీరుతాయని ఎవరైనా అంటే ఆ పనిని కూడా మీరు సంతోషంగా చేస్తారు. ప్రార్థనను ఒక పనిలా కాకుండా, మనస్సుని నిజాయితీతో భగవంతుడిపై కేంద్రీకరించగలిగితే మీకు కష్టమొచ్చినప్పుడు స్నేహితుడిలా మిమ్మల్ని ఆదుకోగలడు. అయితే మీ ప్రార్థనలో భక్తి శ్రద్ధలు లోపించి, పూజలు ఒక సంప్రదాయంగా భావిస్తే, కోటి మార్లు పూజలు చేసినా ఎటువంటి ఫలితమూ పొందలేరు. - జగ్గీ వాసుదేవ్ -
వివరం: ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం
పూర్వకాలం రుషులు తపస్సు కోసం అరణ్యాలకో, హిమాలయాలకో వెళ్లేవారంటారు. సమాజానికి దూరంగా ఎవరూ లేని ఏకాంతంలో, వారు తమలోకి తాము చూసుకుంటూ చేసిన జ్ఞానసముపార్జనతో ప్రపంచాన్ని అర్థం చేసుకునేవారు; సరైన దిశానిర్దేశాన్ని చేసేవారు. అయితే, అరణ్యాల్లో ముక్కు మూసుకోనక్కర్లేకుండా, హిమాలయాల్లో చలికి వణికిపోనవసరం లేకుండా, సమూహంలో ఉంటూనే ఏకాంతాన్ని అనుభవించగలిగే అతిసుందర ప్రదేశం గ్రంథాలయం. ఇక్కడ, తవ్వుకోగలిగినన్ని జ్ఞానగనులు! కూర్చునే ప్రపంచాన్ని చుట్టిరాగలిగినన్ని వాహనాలు!! ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. ఇది చదువుకోవడం గురించిన ఊసు కాదు; చదవడానికి వీలు కల్పించేదాని సంగతి. ఎవరైనా తాను ఎక్కడా చదవలేని పుస్తకాల్ని ‘స్టేట్ లైబ్రరీ’లో సంపాదించానని కళ్లు మెరుస్తుండగా చెప్పొచ్చు. మరెవరైనా తనకు ఎక్కడా దొరకని పుస్తకం ‘గౌతమీ గ్రంథాలయం’లో కనబడిందని అక్షరాలు కురుస్తుండగా రాయొచ్చు. చాలామంది చాలా పుస్తకాలు చదవడానికి కారణం వారి వారి శాఖా గ్రంథాలయాలు కావొచ్చు. లైబ్రరీకి వెళ్లేవారంటే కొంత పద్ధతైన మనుషులు అనుకోవడంలో అబద్ధం ఏమీ లేకపోవచ్చు. అంతేగా! లైబ్రరీ అంటేనే పుస్తకాల కూర్పు, ఒక పద్ధతైన పేర్పు, ఎన్నో ఉద్యమాలకు చేర్పు. క్రీస్తుకు పూర్వమే గ్రంథాలయాలు సంపదను దాచుకోగలడేమోగానీ, మనిషి జ్ఞానాన్ని దాచిపెట్టలేడు. తాను కనుక్కున్నదీ, అనుభవించిందీ, ఆలోచించిందీ ఎదుటివారితో పంచుకోవాలనే తపనే భాష, లిపి పుట్టుకలకు కారణం. రాసిన అన్నింటినీ నిర్దేశిత స్థలంలో అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రాథమికభావనే గ్రంథాలయాలకు మూలం. క్రీస్తుపూర్వం 2600ల్లోనే గ్రంథాలయాలు ఉండేవనడానికి ఆధారాలను పురాతత్వ పరిశోధకులు సంపాదించారు. కాగితం పుట్టకముందే, మట్టి పలకల రాతల్ని సుమేర్(ఆధునిక ఇరాక్ ప్రాంతం)లో కనుక్కున్నారు. కాగితం కనుక్కున్న తర్వాత ‘ప్రపంచ రాతే’ మారిపోయింది. ఎందరో సామ్రాజ్యాధిపతులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న దర్శనాలను, ఆవిష్కరణలను తమ భాషలో తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. దీనికిగానూ అరబిక్, రోమన్, పర్షియన్, గ్రీక్, సంస్కృతం లాంటి భాషలు తెలిసిన పండితులను అనువాదకులుగా నియమించుకునేవారు. దీనిద్వారా యావత్ప్రపంచం సామూహికంగా ముందుకు అడుగు వేయడం సాధ్యమవుతూ వచ్చింది. కళలు, నిర్మాణం, సాహిత్యం, మతసంబంధ విషయాల్లో ఒకరినొకరు ప్రభావితం చేసుకునే వీలుకలిగింది. అయితే, గ్రంథాలయ భావన ఉన్నప్పటికీ, పండితుల వ్యక్తిగత లైబ్రరీలే ఎక్కువ. వాళ్లు దేశ సంచారం కోసం వెళ్లినప్పుడు, వస్తుసామగ్రితో పాటు, పుస్తకాలను కూడా తమ పెంపుడు జంతువుల మీద మోసుకెళ్లేవారు. మరి ఎన్ని నెలల ప్రయాణమో! ఏరోజు ఏం చదవాలనిపిస్తుందో!! అలాగే, పుస్తకాలను వర్గీకరించుకునే సూత్రాల్ని కూడా క్రీస్తుపూర్వమే రూపొందించుకున్నారు చదువరి పెద్దలు. అంతేగా! లేకపోతే ఏ ఒంటెమీద ఏం పెట్టామో వెంటనే చెప్పలేకపోతే ఎన్నని వెతుకుతాం! ప్రాచీన గ్రంథాలయాలు ఐదవ శతాబ్దంలో కాన్‌స్టంట్‌నోపుల్‌లోని ఇంపీరియల్ లైబ్రరీ 1,20,000 పుస్తకాలతో ఐరోపాలోనే పెద్ద గ్రంథాలయంగా వినుతికెక్కింది. అయితే, 477వ సంవత్సరంలో అది పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. తిరిగి నిర్మించినప్పటికీ 726లో ఒకసారి, మళ్లీ 1204 లో మరోసారి, చివరకు 1453లో పూర్తిగా నాశనమైపోయింది. ఇప్పటికీ ఉన్న అత్యంత పురాతన గ్రంథాలయంగా చైనాలోని ‘తియాన్ యి జె’ ప్రసిద్ధి. దీన్ని మింగ్ వంశస్థుల కాలంలో 1561లో ఫాన్ క్విన్ స్థాపించాడు. దీని ఉచ్ఛ దశలో 70,000 ప్రాచీన పుస్తకాలుండేవి. దీని నమూనాలోనే దేశంలోని ప్రశస్త జాతీయ లైబ్రరీలను చైనా నిర్మించుకుంది. బ్రిటన్‌తో జరిగిన యుద్ధం అప్పుడూ, స్థానిక దొంగతనాల వల్లా ఇది చాలా పుస్తకాల్ని కోల్పోయింది. అయినప్పటికీ జాతీయ వారసత్వ సంపదగా అక్కడ గౌరవం పొందుతోంది. ప్రపంచంలో రెండు అతి పెద్ద గ్రంథాలయాలు అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి.లోని ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’లో సుమారు 15 కోట్ల ఐటెమ్స్ ఉన్నాయి. ఇందులో పుస్తకాలు, డీవీడీలు, మ్యాపులు, ఫిలింలు, ప్రింట్లు, ఆడియోబుక్స్, ఇంకా ఇతరత్రా జ్ఞానపేటికలన్నీ లెక్కే! పుస్తకాలనే విడిగా గణిస్తే సుమారు 2.2 కోట్లు! 1800 సంవత్సరంలో నెలకొల్పిన దీన్ని అతి పురాతన సాంస్కృతిక నిలయంగా అమెరికన్లు పరిగణిస్తారు. ఏటా 17.5 లక్షల మంది సందర్శిస్తారు. సుమారు 3600 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారు. అలాగే, బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉన్న ‘బ్రిటిష్ లైబ్రరీ’ కూడా 15 కోట్ల ఐటెమ్స్‌తో కళకళలాడుతుంటుంది. ఇందులో సుమారు 1.4 కోట్ల పుస్తకాలు! క్రీ.పూ.2000 నాటి మాన్యుస్క్రిప్టులు, చారిత్రక ఆధారాలు కూడా ఇక్కడ భద్రంగా ఉండటం దీని ఘనతను చాటుతుంది. మన జాతీయ గ్రంథాలయం ప్రత్యేకత మన ‘నేషనల్ లైబ్రరీ’ కోల్‌కతాలో ఉంది. ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ లైబ్రరీ భారత్‌లో అతి పెద్దది. అన్ని భాషల్లోని 22 లక్షల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. కలకత్తా పబ్లిక్ లైబ్రరీగా ఇది 1836లో ద్వారకానాథ్ టాగూర్ లాంటి సంపన్నుల చందాలతో ప్రారంభమైంది. 300 రూపాయల భూరివిరాళాన్ని ప్రకటించి ఆయన గ్రంథాలయానికి తొలి ప్రొప్రయిటర్ అయ్యారు. దీనికి సమాంతరంగా 1891లో ఇదే కోల్‌కతాలో కొన్ని చిన్న చిన్న గ్రంథాలయాల మేళవింపుతో ఇంపీరియల్ లైబ్రరీ నెలకొల్పారు. అయితే, 1903లో అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఈ రెంటినీ కలిపేసి పుస్తకాలను ఏకం చేశారు. పేరు మాత్రం ఇంపీరియల్ లైబ్రరీగా కొనసాగింది. స్వాతంత్య్రానంతరం పేరు మార్చుకుని నేషనల్ లైబ్రరీ అయింది. ఇందులో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, మరాఠీ, మలయాళం, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, ఉర్దూ లాంటి భాషలు; సహా పాళీ, ప్రాకృత భాషల్లోని పుస్తకాలు కూడా ఉన్నాయి. ఏ భాషా విభాగం దానికే. 1963లో ఇందులో తెలుగు విభాగం ప్రారంభమైంది. భారత ముద్రణా వారసత్వ సంపదను భవిష్యత్ తరాల కోసం కాపాడటం దీని ప్రాథమిక లక్ష్యం. ఇక, మన ‘స్టేట్ లైబ్రరీ’లో సుమారు ఐదు లక్షల పుస్తకాలు జ్ఞాన ద్వారాలను తెరుస్తూవుంటాయి. ఇందులో తెలుగుతో పాటు ఉర్దూ, అరబిక్, పర్శియన్, సంస్కృతం లాంటివి కూడా ఉన్నాయి. జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఆగస్టు 12నే ఎందుకు? ఇది డాక్టర్ ఎస్.ఆర్ రంగనాథన్(1892-1972) జయంతి. ఈ లెక్కల ప్రొఫెసర్ 1923లో అనుకోకుండా మద్రాసు యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా చేరారు. తొలిరోజుల్లో బోరింగ్ ఉద్యోగమని విరమించాలనుకున్నా, యూనివర్సిటీ అందులోనే కొనసాగమని కోరింది. దాంతో గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, విశేష అనుభవం గడించి, గ్రంథాలయ కేటలాగుల్ని తయారు చేయడానికి ఒక కొత్త కోడ్‌ను 1933లో రూపొందించారు. కోలన్ క్లాసిఫికేషన్ అని పిలిచే ఈ వర్గీకరణ సూత్రాన్ని దేశంలోని చాలా గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి. ఏమిటీ కోలన్ క్లాసిఫికేషన్? పుస్తకం వ్యక్తిత్వం, విషయం, శక్తి, నిడివి, సమయం అనే ఐదు ప్రాథమిక సూత్రాల ఆధారంగా కోలన్ క్లాసిఫికేషన్ రూపకల్పన జరిగింది. నానారకాల పుస్తకాలను ఎలా అమర్చాలి? దీనికోసం వాటికి సంకేతాలు ఇచ్చారు రంగనాథన్. ఉదాహరణకు సాహిత్య పుస్తకాలను ‘ఒ’తో సూచించారు; ధార్మిక పుస్తకాలను ‘క్యూ’తో; వైద్యానికి సంబంధించినవి ‘ఎల్’తో; అగ్రికల్చర్ ‘జె’; ఇందులో మళ్లీ హార్టికల్చర్ ‘జె1’; ఇలా గ్రూప్సు, సబ్ గ్రూప్సు విభజనతో పుస్తకాన్ని ఎక్కడున్నా గాలించి పట్టుకునే కోడ్ సృష్టించారు. దీన్ని వివరించేందుకు ఈ ఉదాహరణను ఎక్కువగా ఉటంకిస్తారు. ‘1950లో భారత్‌లో జరిగిన ఊపిరితిత్తులకు సోకే ట్యూబర్క్యులోసిస్ను ఎక్స్ కిరణాలతో నివారించే పరిశోధన’కు సంబంధించిన పుస్తకం ఏదో కావాలి మనకు. ఈ పుస్తకం ముందుగా వైద్యవిభాగంలోకి వస్తుంది(ఎల్); అదీ ఊపిరితిత్తులకు సోకిన జబ్బు(45); అందునా ట్యూబర్క్యులోసిస్(421); దాని నివారణ గురించి కావాలి(6); ఆ నివారణ కోసం పరిశోధన జరిగింది(253); అది ఎక్స్ కిరణాలతో చేసిన పరిశోధన(ఎఫ్); ఆ పరిశోధన జరిగిన భౌగోళిక ప్రదేశం భారత్(44); జరిగిన కాలం 1950(ఎన్5) ముందుగా వర్గీకరించి ఉన్న కోడ్స్‌ను ఒక క్రమంలో రాస్తే మనకు కావాల్సిన పుస్తకం చిరునామా ఇలావుంటుంది: [L,45;421:6;253:f.44'N5] పాఠకుడికి ఇదంతా గందరగోళంగా ఉండొచ్చేమోగానీ, లైబ్రేరియన్ దీన్ని ఇట్టే పట్టేస్తాడు; పుస్తకాన్ని మీ చేతుల్లో పెట్టేస్తాడు. లైబ్రేరియన్‌కు ధన్యవాదాలు ఏ ఊళ్లో అయినా చిన్నదో, పెద్దదో ఒక శాఖా గ్రంథాలయం ఉంటుంది, అందులో కొన్ని పుస్తకాలుంటాయి, వాటన్నింటిలో కావాల్సింది వెతుక్కోవడంలోనే సమయం కరిగిపోకుండా, పాఠకుడికి ‘కొంగు పుస్తకం’గా ఉండేవాళ్లు లైబ్రేరియన్లు. ఉప్పు పక్కన కారం, చక్కెర పక్కన టీపొడి; మళ్లీ ఆ రెండూ ఏ షెల్ఫులో పెట్టాలి; అని గృహిణి ఇంటిని పనికి అనుకూలం చేసుకున్నట్టుగా వీళ్లు చదవడానికి పుస్తకాలను అనుకూలం చేస్తుంటారు. ఏ పుస్తకమైనా మీకు నచ్చి రచయిత మీద మీ అభిమానాన్ని పెంచుకునేప్పుడు, దానికి కారణమైన లైబ్రేరియన్‌కు ధన్యవాదాలు చెప్పడం మరిచిపోవద్దు. మనదే పురాతనమైనది! ‘ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్’ 1914లో ప్రారంభమైంది. విజయవాడ కేంద్రంగా ఉన్న ఈ సంఘం భారతదేశంలోనే పురాతనమైనది! 1915 నుంచి గ్రంథాలయ సర్వస్వము పేరిట ఒక మాసపత్రికను కూడా తెస్తోంది. గ్రంథాలయ పంచశీల తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ రంగనాథన్ లైబ్రరీ సైన్సులో చేసిన సేవలకుగానూ పద్మశ్రీ పొందారు. 1931లో ఆయన గ్రంథాలయ పంచ సూత్రాలు వెలువరించారు: పుస్తకం ఉన్నది అవసరం నిమిత్తం. {పతి పాఠకుడికీ పుస్తకం ఉంటుంది. {పతి పుస్తకానికీ పాఠకుడుంటాడు. పాఠకుడి సమయం ఆదాచేయాలి. {గంథాలయం పెరిగే వ్యవస్థ. సరళమైన విషయాలే. కానీ గ్రంథాలయం అనేది ఏమిటో, అది దేనికి ఉందో లైబ్రరీ ఉద్యోగులకు దిశానిర్దేశం చేయగలిగే సూత్రాలివి! పాతికశాతమే చదువుతున్నారు! 2012లో ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ జరిపిన ఒక దేశవ్యాప్త సర్వే ప్రకారం: యువతరంలో మూడొంతుల మంది పాఠ్యాంశాలు తప్ప మరో పుస్తకం చదవడం లేదు. క్లాసిక్స్, బెస్ట్ సెల్లర్స్ ఏవీ ముట్టడం లేదు. 13-35 ఏళ్ల మధ్య ఉన్న మొత్తం 33.27 కోట్ల మంది యువతీ యువకుల్లో 26 శాతం మందికే చదివే అలవాటు ఉంది. ఈ చదివే అలవాటు ఉన్నవాళ్లలో 41.7 శాతం కాల్పనిక సాహిత్యం, 23.8 శాతం నాన్ ఫిక్షన్, 34.5 శాతం రెండూ చదువుతున్నారు. ఓప్రాస్ బుక్ క్లబ్ సుప్రసిద్ధ సిండికేటెడ్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రే తన టీవీ షోలో భాగంగా ప్రతీ వారం ఒక పుస్తకాన్ని పరిచయం చేయడం, చర్చించడం మొదలుపెట్టారు. దానివల్ల కొన్ని లక్షల కాపీల అమ్మకాల్ని ఆమె ప్రభావితం చేశారు. ఎ లెస్సన్ బిఫోర్ డైయింగ్ (ఎర్నెస్ట్ జె.గెయిన్స్), శూల (టోనీ మారిసన్), వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (గాబ్రియెల్ గార్సియా మార్క్వెజ్), అన్నా కరేనినా (లియో టాల్‌స్టాయ్), ద గుడ్ ఎర్త్ (పర్ల్ ఎస్ బక్), ఎ టేల్ ఆఫ్ టు సిటీస్ (చార్లెస్ డికెన్స్) లాంటివి ఆమె షోలో చర్చకు వచ్చిన కొన్ని మంచి పుస్తకాలు.క్రీ.శ. 983లో పర్షియా రాజు అదుద్ అల్ దౌలా చిన్న నీటి సరస్సులు, ఉద్యానవనాలతో కూడిన 360 గదుల రెండంతస్థుల గ్రంథాలయాన్ని నిర్మించాడు. పుస్తకాల వర్గీకరణ సూత్రం ‘కోలన్ క్లాసిఫికేషన్’ రూపొందించిన ఎస్.ఆర్.రంగనాథన్ జయంతినే నేషనల్ లైబ్రరీ డేగా గౌరవిస్తున్నాం. ఓప్రా విన్ఫ్రే తన టీవీ షో ద్వారా లక్షల కాపీల అమ్మకాల్ని ఓప్రా ప్రభావితం చేశారు. ఒంటెల గ్రంథాలయం కెన్యాలోని ఈశాన్య గ్రామీణ ప్రాంతాల్లో ఒంటెలే గ్రంథాలయాల్ని వీపున మోసుకెళ్తుంటాయి. సరైన రహదారులు లేని గ్రామాల్లోని బడిపిల్లలు, యువ పాఠకుల కోసం ఇవి వాళ్ల దగ్గరికే వెళ్తుంటాయి. 1996లో ఈ క్యామెల్ మొబైల్ లైబ్రరీ సర్వీస్ ప్రారంభమైంది. ఒంటెల మీదే టెంటు, కుర్చీలు, టేబుళ్లు, పుస్తకాలు వేసుకెళ్తారు సిబ్బంది. అక్కడక్కడా కొంతకాలం క్యాంపు వేసుకుంటూ సాగిపోతుంటారు. లోపలికి వెళ్లాలంటే బెరుకు గ్రంథాలయం అనేది పుస్తకాల ఆలయమే కావొచ్చు; కానీ అందులోకి వెళ్లడం కూడా ఆందోళన కలిగించే విషయమేనని 1986లో పరిశోధించి తేల్చారు అమెరికా లైబ్రరీ సైన్స్ ప్రొఫెసర్ కాన్స్టన్స్ మెలన్. లైబ్రరీ యాంగ్జయిటీ ఉన్నవాళ్లు ముందుగా గ్రంథాలయ పరిమాణం చూడగానే భీతిల్లుతారు, ఒకవేళ వెళ్లినా తనకు కావాల్సిన పుస్తకాన్ని ఎలా వెతుక్కోవాలో తెలియక తికమకపడతారు, తెలియకపోవడాన్ని న్యూనతగా భావించి గ్రంథాలయ సిబ్బంది సహకారాన్ని తీసుకోవడానికి చొరవ చూపరు. ఈ లక్షణాలున్నవాళ్లు ముందు ఇలాంటి ఒక ఇబ్బంది ఉంటుందని గుర్తించండి, కొంచెం అనుభవంతో దాన్ని పోగొట్టుకోవచ్చు అంటారామె. ఆన్లైన్ లైబ్రరీలు ఇంటర్నెట్ సౌకర్యం విస్తరించాక, వేలాది పుస్తకాలు ఇప్పుడు వెబ్సైట్లలో లభ్యమవుతున్నాయి. www.gutenberg.org, www.arvindguptatoys.com లాంటి సైట్లలో ఎన్నో అమూల్యమైన పుస్తకాలను ఉచితంగా చదువుకోవచ్చు. ఉత్తి టెక్స్టుగానే కాకుండా, బొమ్మలు సహా పుస్తకాన్ని యధాతథ అనుభూతితో చదువుకోగలిగే ఈ-రీడర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. చదువుకోవాలన్న ఆసక్తి, దానికి తగిన ఓపిక ఉండాలేగానీ బ్రిటిష్ లైబ్రరీ, నేషనల్ లైబ్రరీ, ఇంపీరియల్ లైబ్రరీ అన్నీ మీ కంప్యూటర్ తెరమీదే ఉంటాయి. గ్రీన్ లైబ్రరీలు పర్యావరణ స్పృహ పెరిగిన నేటి కాలంలో గ్రంథాలయాలు కూడా కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సహజమైన సూర్యకాంతి వెలుతురులో చదువుకునే వీలు కల్పిస్తూ విద్యుత్‌ను ఆదా చేయడం, నిర్మాణంలో వాడిన ప్రతిదాన్నీ రీసైకిల్ చేసుకోగలగడం, డాబా మీద పడిన వర్షపు నీటిని గార్డెన్లకు మళ్లించగలగడం వంటి పర్యావరణ హిత గ్రీన్ లైబ్రరీలకు సియాటిల్ సెంట్రల్ లైబ్రరీ, సింగపూర్ నేషనల్ లైబ్రరీ మంచి ఉదాహరణ.