మీ ఇంట్లో పిల్లాడినే.. స్వాగతం ఎందుకు? | Amongst Monks, PM Narendra Modi Calls Himself 'Ghar Ka Ladka' | Sakshi
Sakshi News home page

మీ ఇంట్లో పిల్లాడినే.. స్వాగతం ఎందుకు?

Published Sun, May 10 2015 1:06 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

మీ ఇంట్లో పిల్లాడినే.. స్వాగతం ఎందుకు? - Sakshi

మీ ఇంట్లో పిల్లాడినే.. స్వాగతం ఎందుకు?

కోల్ కతా: ఓ ఇంటికి చెందిన వ్యక్తి తన ఇంటికే వస్తే ఎవరైనా స్వాగతం పలుకుతారా అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తాను మీ ఇంట్లో పిల్లాడినేనని, మీ అందరిలో ఒకడినని ఆయన బేలూరులోని రామకృష్ణ మఠానికి చెందిన సన్యాసులతో అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన తన గురువుగారు స్వామీ ఆత్మస్థానందను కలిసేందుకు ఆయన చికిత్స పొందుతున్న కోల్ కతాలోని మఠానికి చెందిన ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఏర్పాట్లు, ఘనస్వాగతాన్ని ఉద్దేశించి అలా అన్నారు. 'మీరంతా మా గురువుగారికి సేవ చేస్తున్నారు. ఆయనను జాగ్రత్తగా చూసుకొండి' అంటూ ఆయన వారికి సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement