సాధువుల పుష్కర స్నానానికి రూ.1.50కోట్లు! | Rs 1.50 crores to bath monks at puskara ghat | Sakshi
Sakshi News home page

సాధువుల పుష్కర స్నానానికి రూ.1.50కోట్లు!

Published Sat, Jul 11 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

Rs 1.50 crores to bath monks at puskara ghat

హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి వచ్చే 1,500 మంది సాధువులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఏర్పాట్ల నిమిత్తం రూ.1.50 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

అలాగే.. పుష్కర ఏర్పాట్లలో భాగంగా సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీచేసింది. వివిధ జిల్లాల్లో జరుగుతున్న పుష్కర పనుల కోసం ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ.2 కోట్లను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement