
తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా
నేపాల్లో వచ్చిన పెను భూకంపం బారి నుంచి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు. ఖాట్మాండులో 25 వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు.
రాందేవ్ బాబా ఉన్న వేదిక భూకంపం ప్రభావానికి కుప్పకూలిపోయింది. దాంతో వేదిక మీద ఉన్నవారంతా పడిపోయారు. అయితే.. ఈ ప్రమాదం నుంచి రాందేవ్ బాబా మాత్రం తృటిలో తప్పించుకున్నారు.