near miss
-
జస్ట్ మిస్.. బ్యాంక్ డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి!
అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ సిబ్బంది చేసిన పొరపాటుతో బ్యాంక్‌లోని డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. సిటీ బ్యాంక్ గత ఏప్రిల్ నెలలో 280 డాలర్లకు బదులుగా 81 ట్రిలియన్ డాలర్లను (ప్రస్తుత మారక విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో రూ.6,723 లక్షల కోట్లు) పొరపాటున ఓ ఖాతాదారుడి ఖాతాలో జమ చేసింది.ఈ పొరపాటును ఇద్దరు ఉద్యోగులు పట్టుకోలేకపోయారు. డబ్బులు జమ చేసిన 90 నిమిషాల తర్వాత మూడో ఉద్యోగి గుర్తించారని నివేదిక తెలిపింది. అయితే బ్యాంకు నుంచి నిధులు పూర్తిగా ఆ ఖాతాలోకి బదిలీ కాలేదని, తృటి తప్పిందని (near miss) ఫెడరల్ రిజర్వ్, కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కార్యాలయానికి సీటీగ్రూప్ తెలియజేసింది."ఇంత పరిమాణంలో చెల్లింపు వాస్తవానికి పూర్తి కాలేదన్న విషయాన్ని పక్కన పెడితే మా డిటెక్టివ్ నియంత్రణలు రెండు సిటీ లెడ్జర్ ఖాతాల మధ్య ఇన్పుట్ దోషాన్ని వెంటనే గుర్తించాయి. మేము ఎంట్రీని తిప్పికొట్టాము" అని సిటీగ్రూప్ ప్రతినిధి ఈ-మెయిల్ ప్రతిస్పందనలో తెలిపారు. "మా నివారణ నియంత్రణలు పొరబాటున బ్యాంకు నుంచి నిధులు బయటకు వెళ్లకుండా నిలిపివేస్తాయి" అని పేర్కొన్నారు. ఈ సంఘటన బ్యాంకుపై గానీ, తమ క్లయింట్లపై గానీ ఎలాంటి ప్రభావం చూపలేదని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.ఇలాంటివి 10 పొరపాట్లుసిటీ బ్యాంక్‌లో 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించి ఇలాంటి పొరపాట్లు గత ఏడాది మొత్తం 10 జరిగాయని అంతర్గత నివేదికను ఉటంకిస్తూ ఎఫ్టీ తెలిపింది. అంతకు ముందు ఏడాది నమోదైన 13 కేసులతో పోలిస్తే ఇది తగ్గినప్పటికీ, యూఎస్ బ్యాంక్ పరిశ్రమలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన పొరపాట్లు అసాధారణమని నివేదిక పేర్కొంది. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రకాశం జిల్లా / మద్దిపాడు: ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. సుమో నుజ్జునుజ్జయినా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి దెబ్బలు తగలకుండా బయట పడడం విశేషం. ఈ ఘటన బుధవారం ఉదయం 6 గంటల సమయంలో వెల్లంపల్లి బ్రిడ్జిపై చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..ఎ¯టీఎస్ లాజస్టిక్ వాహనం భారీ లోడుతో ఒంగోలు వైపు నుంచి విజయవాడ వైపు బయలుదేరింది. వాహనానికి ఎస్కార్ట్‌గా ఆ కంపెనీ మేనేజర్ రమేష్, డ్రైవర్ జగన్ సుమోలో వెళుతుండగా ఆదే దారిలో కృష్ణపట్నం పోర్టు నుంచి కొత్తగూడెం వెళుతున్న లారీ డ్రైవర్ అతి వేగంగా ఢీ కొట్టడంతో సుమో నుజ్జునుజ్జయింది. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సుమోలో ఇరుక్కుపోయి హాహాకారాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గమనించి హైవే పెట్రొలింగ్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వారు ఎన్‌హెచ్ పెట్రోలింగ్ సిబ్బంది, మద్దిపాడు పోలీసులతో ఘటనా స్థలికి చేరుకుని సుమోలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి స్థానికులతో కలసి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒంగోలు నుంచి అగ్నిమాపక శకటం కూడా ఘటనా స్థలికి వచ్చింది. చివరకు లాజస్టిక్ పుల్లర్‌తో వారిని బయటకు తీసి 108 ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మద్దిపాడు పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోని తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా
-
తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా
నేపాల్‌లో వచ్చిన పెను భూకంపం బారి నుంచి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు. ఖాట్మాండులో 25 వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. రాందేవ్ బాబా ఉన్న వేదిక భూకంపం ప్రభావానికి కుప్పకూలిపోయింది. దాంతో వేదిక మీద ఉన్నవారంతా పడిపోయారు. అయితే.. ఈ ప్రమాదం నుంచి రాందేవ్ బాబా మాత్రం తృటిలో తప్పించుకున్నారు. -
స్పైస్‌జెట్ విమానాన్ని ఆపేసిన గద్ద
విమానాలకు టైం బాగున్నట్లు లేదు. వరుసపెట్టి వారం రోజుల్లోనే నాలుగు ప్రమాదాలు సంభవించాయి. మూడు విమానాలు, ఒక హెలికాప్టర్ పడిపోయాయి. తాజాగా మళ్లీ రాజమండ్రిలో స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం త్రుటిలో తప్పింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం టేకాఫ్ తీసుకుంటుండగా, ఓ గద్ద వచ్చి ఆ విమానం రెక్కను ఢీకొంది. దాంతో హైదరాబాద్ బయల్దేరకుండా రాజమండ్రి విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. ఈ విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి నుంచి బయల్దేరాలి. ఇంజన్లో పక్షి భాగాలు ఇరుక్కుపోవడంతో దాన్ని పరిశీలించడానికి ఇంజనీర్లను పిలిపించారు. సమయం ఎక్కువ పడుతుందని తెలియడంతో సర్వీసు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతమందిని రోడ్డు మార్గం గుండా గన్నవరం పంపారు. మిగిలినవారు మాత్రం వెనక్కి వెళ్లిపోయారు. రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ హైదరాబాద్‌కు మూడు విమానాలు బయల్దేరతాయి.