
బాబా రాందేవ్
ఖాట్మండు: ఇంత పెద్ద భూకంపం తరువాత దేవుడు నన్ను బతికించాడంటే మరింత సేవచేయమే అర్ధం అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చెప్పారు. భూకంప బాధితులకు సాధ్యమైనంత సాయం చేసేందుకు మరి కొద్ది కాలం తాను నేపాల్లోనే ఉంటానన్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు బాబా చెప్పారు.
నేపాల్లో నిన్న సంభవించిన భారీ భూకంపం నుంచి రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఖాట్మాండులో 25 వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఆయన శిక్షణ ఇచ్చే వేదిక భూకంపం ప్రభావానికి కుప్పకూలిపోయింది. దాంతో వేదిక మీద ఉన్నవారంతా పడిపోయారు. అయితే, ఈ ప్రమాదం నుంచి రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు.