తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కష్టమే: రాందేవ్
లోకసభ ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యే అవకాశం లేదని యోగా గురువు రాందేవ్ బాబా జోస్యం చెప్పారు
లోకసభ ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యే అవకాశం లేదని యోగా గురువు రాందేవ్ బాబా జోస్యం చెప్పారు. కాని తెలంగాణ ఏర్పాటు మాత్రం తథ్యం అని ఆయన అన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు వల్ల వనరులు, ఉద్యోగాలు, ఇతర రంగాలకు సంబంధించినంత అంశాల్లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగదని రాందేవ్ తెలిపారు.
ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందేందుకే తెలంగాణ గురించి కాంగ్రెస్ మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు. ఒకవేళ నిజంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే.. తెలంగాణను ముందే ప్రకటించాల్సి ఉండేదన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా ఐదేళ్లపాటు కాంగ్రెస్ నిద్రపోయిందా అని రాందేవ్ ప్రశ్నించారు. సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఎన్నికల కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు.