అసలు రాందేవ్ బాబా ఎవరైనా సరే కుట్ర చేయాల్సినంత ప్రముఖుడేమీ కాదని దిగ్విజయ సింగ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తనపై కుట్ర చేస్తోందన్న యోగా గురు రాందేవ్ బాబా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ సింగ్ ఖండించారు. అసలు రాందేవ్ బాబా ఎవరైనా సరే కుట్ర చేయాల్సినంత ప్రముఖుడేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాందేవ్ బాబాకు అంత స్థాయి లేదని ఆయన అన్నారు.
పతంజలి ఆశ్రమంలో ఓ ఉద్యోగిని కిడ్నాప్ చేసినందుకు రాందేవ్ బాబా సోదరుడు రాం భరత్పై పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఈ వ్యవహారమంతా జరిగింది. రాందేవ్ బాబా కుటుంబ సభ్యులు ఎవరినో కిడ్నాప్ చేస్తే, అది కాంగ్రెస్ కుట్ర ఎలా అవుతుందని, అందుకు ఆయనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.