
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురు బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగ చేసే వారికి మంచి రోజులు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి కారణం ఏమిటనేది కూడా రాందేవ్ బాబా తనదైన శైలిలో విశ్లేషించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ యోగా చేయకపోవడంతోనే ఆ పార్టీకి ఎన్నికల్లో పరాభవం ఎదురైందని అన్నారు.
‘మోదీజీ బహిరంగంగానే యోగా చేస్తారు..నెహ్రూ, ఇందిరా గాంధీలు కూడా యోగా చేస్తారు..కానీ వారి వారసుడు (రాహుల్) యోగా చేయరు..అందుకే ఆయన రాజకీయాలు నిష్ఫలమయ్యాయి..ఎవరైతే యోగా చేస్తారో వారికి అచ్చేదిన్ ఎదురవుతాయ’ని రాందేవ్ పేర్కొన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నారని కితాబిచ్చారు. మరోవైపు ఏడాది కిందట రాహుల్, సోనియా నిత్యం యోగాను అభ్యసిస్తారని, రాహుల్‌తో తనకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని గత ఏడాది ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ రాందేవ్ బాబా పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment