'థర్డ్ ఫ్రంట్ కు విధానాల్లేవు..నాయకుడూ లేడు'
ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దాంతాలను గాలికి వదిలి.. దారి తప్పుతోందని యోగా గురువు రాందేవ్ బాబా విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆతర్వాత ఆపార్టీతో పొత్తును కుదుర్చుకోవడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో 'చిపిరి కట్ట'ను పెట్టిన ఆమ్ ఆద్మీ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోక తప్పదని ఆయన అన్నారు.
అవినీతి నిర్మూలన, వ్యవస్థను మార్చేస్తాం అనే నినాదాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ తన సిద్దాంతాలకు దూరమైందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు అని రాందేవ్ అన్నారు. ఎన్నికల తర్వాత భారత రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్ అవిర్భావంపై పెదవి విరిచారు.
తృతీయ ఫ్రంట్ కు విధానాల్లేవని.. అంతేకాకుండా సరియైన నాయకత్వం కూడా లేకపోవడమే ప్రధాన లోపం అని ఆయన వ్యాఖ్యానించారు. లోకసభ ఎన్నికలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విజయానికి మద్దతుగా మార్చి 23 తేదిన న్యూఢిల్లీలో లక్షలాది మందితో యోగా క్యాంప్ ను నిర్వహిస్తానని రాందేవ్ తెలిపారు.