నేను గ్రోత్ ఆప్షన్ బదులు ఐడీసీడబ్ల్యూ (నెలవారీ) ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎలా ఉంటాయి? ఈ విషయలో పన్ను బాధ్యతలు ఎలా ఉంటాయి? – అభినవశ్రీ
మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే ఇనకమ్ ఇస్ట్రిబ్యషన్ కమ్ క్యాపిటల్ విత్‌డ్రాయల్ (ఐడీసీడబ్ల్య) ప్లాన్‌కు దూరంగా ఉండండి. దీనికి బదులు గ్రోత్ ప్లాన్ ఎంపిక చేసుకోండి. ఐడీసీడబ్ల్యూ ప్లాన్ పన్ను పరంగా మెరుగైనది కాదు. గ్రోత్ ప్లాన్ పన్ను పరంగా మెరుగైన సాధనం. గ్రోత్ ప్లాన్‌లో పెట్టుబడులపై రాబడులు అన్నీ ఫండ్ వద్దే ఉంటాయి. దీంతో వాటిపైనా రాబడితో కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందుతారు. అదే ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్ అన్నది పెట్టుబడి, రాబడుల్లో కొత భాగాన్ని ఫండ్ సంస్థ తిరిగి చెల్లించడం. స్టాక్స్‌లో అయితే డివిడెండ్ వరకే ఇన్వెస్టర్లకు నేరుగా చెల్లిచడం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్‌లు అన్నవి తప్పుడు పదంతో ఇంత కాలం కొనసాగాయి. అందుకే ఇటీవలే డివిడెండ్ పేరును ఐడీసీడబ్ల్యూగా మార్చారు. డివిడెండ్‌లు చెల్లించిన వెంటనే ఫండ్ ఎన్‌ఏవీ అంతే మేర తగ్గుతుంది.
ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్‌లు మీ పన్ను ఆదాయానికి తోడవుతాయి. మీ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒక ఏడాదిలో డివిడెండ్ ద్వారా రూ. 5,000కు మించి ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్‌ను ఇన్వెస్టర్‌కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్‌ను ఇన్వెస్టర్‌కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో మీ పెట్టుబడి ఫండ్ సంస్థతోనే ఉంటుంది.
కానీ, వాస్తవంగా చూస్తే చెల్లించే డివిడెండ్‌పై పన్ను పడుతుంది. కనుక పన్ను పరంగా అంత సమర్థమైనది కాదు. ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్ ఎంత చెల్లించాలన్నది ఫండ్ సంస్థలు నిర్ణయిస్తాయి. ఇందులో ఇన్వెస్టర్లకు పాత్రకు ఉండదు. మీకు క్రమం తప్పకుండా ఫండ్స్ పెట్టుబడుల నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, అందుకు గ్రోత్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంపిక చేసుకోవడం మెరుగైనది. దీనివల్ల ఎంత కాలానికి ఎంత చొప్పున కావాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. కనుక ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌తో పోలిస్తే గ్రోత్ ప్లాన్ చాలా మెరుగైనది. మీ పెట్టుబడులపై మీరు నియంత్రణ కలిగి ఉంటారు.
నా కుమారుడు మరణించాడు. జాయింట్ హోల్డర్‌గా ఉండడంతో ఫండ్స్ యూనిట్లు నాకు సంక్రమించాయి. వీటిని నా కుమారుడి పిల్లలకు బదిలీ చేయాలని అనుకుంటున్నాను. సాధ్యపడుతుందా? – విష్ణు కుమార్
మీ పేరుతో ఉన్న ఫండ్ యూనిట్లను మీ మనవళ్లు, మనవరాళ్లకు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఫండ్స్ యూనిట్లు అనేవి గిఫ్ట్‌గా ఇవ్వడానికి, మరొకరికి బదిలీ చేయడానికి అవకాశం లేదు. అయితే మీ మనవళ్ల పేరిట ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇందుకు మీరు ముందుగా మీ పేరుతో ఉన్న ఫండ్స్ పెట్టుబడులు మొత్తాన్ని వెనక్కి తీసుకోండి.
మీ మనవళ్ల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే ప్రస్తుత పెట్టుబడులను వెనక్కి తీసుకుని, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయండి. అప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లే స్వయంగా వారి బ్యాంకు ఖాతా నుంచి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయంలో మీరు వారికి సాయం అందించొచ్చు. ఒకవేళ మీ మవనళ్ల వయసు 18 ఏళ్లలోపు ఉంటే వారి తల్లి లేదంటే కోర్టు నియమించిన గార్డియన్‌కు పెట్టుబడులు బదలాయించొచ్చు. ఆ పని వారే చేస్తారు. మరో మార్గంలో ప్రస్తుతం మీ పేరుతో ఉన్న పెట్టుబడులను కొనసాగిస్తూ, నామినీగా మీ మనవళ్లు, మనవరాళ్లను పేర్కొనాలి. ఎవరికి ఎంత శాతం అనేది నిర్ణయించొచ్చు. అప్పుడు యూనిట్ హోల్డర్‌కు ఏదైనా జరిగితే అవి వారి పేరిట బదిలీ అవుతాయి.
ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment