Value Research
-
ఫండ్స్‌ను మనవళ్లకు గిఫ్ట్ ఇవ్వొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
నేను గ్రోత్ ఆప్షన్ బదులు ఐడీసీడబ్ల్యూ (నెలవారీ) ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎలా ఉంటాయి? ఈ విషయలో పన్ను బాధ్యతలు ఎలా ఉంటాయి? – అభినవశ్రీ మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే ఇనకమ్ ఇస్ట్రిబ్యషన్ కమ్ క్యాపిటల్ విత్‌డ్రాయల్ (ఐడీసీడబ్ల్య) ప్లాన్‌కు దూరంగా ఉండండి. దీనికి బదులు గ్రోత్ ప్లాన్ ఎంపిక చేసుకోండి. ఐడీసీడబ్ల్యూ ప్లాన్ పన్ను పరంగా మెరుగైనది కాదు. గ్రోత్ ప్లాన్ పన్ను పరంగా మెరుగైన సాధనం. గ్రోత్ ప్లాన్‌లో పెట్టుబడులపై రాబడులు అన్నీ ఫండ్ వద్దే ఉంటాయి. దీంతో వాటిపైనా రాబడితో కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందుతారు. అదే ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్ అన్నది పెట్టుబడి, రాబడుల్లో కొత భాగాన్ని ఫండ్ సంస్థ తిరిగి చెల్లించడం. స్టాక్స్‌లో అయితే డివిడెండ్ వరకే ఇన్వెస్టర్లకు నేరుగా చెల్లిచడం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్లు అన్నవి తప్పుడు పదంతో ఇంత కాలం కొనసాగాయి. అందుకే ఇటీవలే డివిడెండ్ పేరును ఐడీసీడబ్ల్యూగా మార్చారు. డివిడెండ్లు చెల్లించిన వెంటనే ఫండ్ ఎన్ఏవీ అంతే మేర తగ్గుతుంది. ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్లు మీ పన్ను ఆదాయానికి తోడవుతాయి. మీ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒక ఏడాదిలో డివిడెండ్ ద్వారా రూ. 5,000కు మించి ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్‌ను ఇన్వెస్టర్‌కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఆదాయం లభిస్తే టీడీఎస్ కింద 10 శాతాన్ని మినహాయిస్తారు. డివిడెండ్‌ను ఇన్వెస్టర్‌కు చెల్లించినా, లేక దాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ 10 శాతం టీడీఎస్ అమలవుతుంది. సాంకేతికంగా చూస్తే ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో మీ పెట్టుబడి ఫండ్ సంస్థతోనే ఉంటుంది. కానీ, వాస్తవంగా చూస్తే చెల్లించే డివిడెండ్‌పై పన్ను పడుతుంది. కనుక పన్ను పరంగా అంత సమర్థమైనది కాదు. ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌లో డివిడెండ్ ఎంత చెల్లించాలన్నది ఫండ్ సంస్థలు నిర్ణయిస్తాయి. ఇందులో ఇన్వెస్టర్లకు పాత్రకు ఉండదు. మీకు క్రమం తప్పకుండా ఫండ్స్ పెట్టుబడుల నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, అందుకు గ్రోత్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంపిక చేసుకోవడం మెరుగైనది. దీనివల్ల ఎంత కాలానికి ఎంత చొప్పున కావాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. కనుక ఐడీసీడబ్ల్యూ ప్లాన్‌తో పోలిస్తే గ్రోత్ ప్లాన్ చాలా మెరుగైనది. మీ పెట్టుబడులపై మీరు నియంత్రణ కలిగి ఉంటారు. నా కుమారుడు మరణించాడు. జాయింట్ హోల్డర్‌గా ఉండడంతో ఫండ్స్ యూనిట్లు నాకు సంక్రమించాయి. వీటిని నా కుమారుడి పిల్లలకు బదిలీ చేయాలని అనుకుంటున్నాను. సాధ్యపడుతుందా? – విష్ణు కుమార్ మీ పేరుతో ఉన్న ఫండ్ యూనిట్లను మీ మనవళ్లు, మనవరాళ్లకు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఫండ్స్ యూనిట్లు అనేవి గిఫ్ట్‌గా ఇవ్వడానికి, మరొకరికి బదిలీ చేయడానికి అవకాశం లేదు. అయితే మీ మనవళ్ల పేరిట ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇందుకు మీరు ముందుగా మీ పేరుతో ఉన్న ఫండ్స్ పెట్టుబడులు మొత్తాన్ని వెనక్కి తీసుకోండి. మీ మనవళ్ల వయసు 18 ఏళ్లు నిండి ఉంటే ప్రస్తుత పెట్టుబడులను వెనక్కి తీసుకుని, వచ్చిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయండి. అప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లే స్వయంగా వారి బ్యాంకు ఖాతా నుంచి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయంలో మీరు వారికి సాయం అందించొచ్చు. ఒకవేళ మీ మవనళ్ల వయసు 18 ఏళ్లలోపు ఉంటే వారి తల్లి లేదంటే కోర్టు నియమించిన గార్డియన్‌కు పెట్టుబడులు బదలాయించొచ్చు. ఆ పని వారే చేస్తారు. మరో మార్గంలో ప్రస్తుతం మీ పేరుతో ఉన్న పెట్టుబడులను కొనసాగిస్తూ, నామినీగా మీ మనవళ్లు, మనవరాళ్లను పేర్కొనాలి. ఎవరికి ఎంత శాతం అనేది నిర్ణయించొచ్చు. అప్పుడు యూనిట్ హోల్డర్‌కు ఏదైనా జరిగితే అవి వారి పేరిట బదిలీ అవుతాయి. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా?
నేను ఒక కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాను. నా సోదరి వివాహం కోసం నా పీఎఫ్ ఫండ్‌ను వాడుకోవాలని అనుకుంటున్నాను. నా సందేహం ఏమిటంటే.. నేను కరోనా లాక్డౌన్ల సమయంలో ఒకసారి పాక్షికంగా ఉపసంహరించుకున్నాను. కనుక మరోసారి పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చా? పన్ను పడుతుందా? – వేణు ఉదత్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రెండు సార్లు ఉపసంహరించుకోవచ్చు. పన్నుల అంశానికంటే ముందు తెలుసుకోవాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో పీఎఫ్ నుంచి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం, రుణాల చెల్లింపు, కొన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సా వ్యయాల చెల్లింపులకు, వివాహం లేదా పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్కు ఏడాది ముందు సందర్భాల్లో ఉపసంహరించుకోవచ్చు. (ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!) ఈ ప్రత్యేక సందర్భాలకు సంబంధించి ఈపీఎఫ్‌వో సభ్యుడు నిర్ణీత సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సభ్యుడు/సభ్యురాలి వివాహం కోసం లేదంటే కుమార్తె, కుమారుడు, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలంటే కనీసం ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. ఉద్యోగి వాటా కింద జమ అయి, దానికి వడ్డీ చేరగా సమకూరిన మొత్తం నుంచి 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ అవసరాల కోసం మూడు సార్లు ఉపసంహరణకు అనుమతిస్తారు. మీరు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కనుక మీరు చేసే ఉపసంహరణలపై పన్ను ఉండదు. మీ సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారు. కనుక కనీసం ఏడేళ్ల సర్వీసు ఉండాలి. మీకు ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉంది. ఏడేళ్లు పూర్తి కాకుండా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతుంది. గతంలో మీరు కోవిడ్ సమయంలో చేసిన ఉపసంహరణ ప్రభావం తాజా ఉపసంహరణలపై ఉండదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మార్చుకోవచ్చా..? – రాజేష్ షా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ మూడేళ్ల తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఈ లాకిన్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. ఒక సంస్థ నుంచి ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడిని మరోసంస్థకు చెందిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోకి మార్చుకోవాలంటే ముందుగా ఉపసంహరించుకోవాలి. మూడేళ్ల లాకిన్ పీరియడ్ వరకు ఉపసంహరించుకోలేరు. (ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?) మూడేళ్లు నిండిన తర్వాత అప్పుడు మీ పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవచ్చు. మీకు నచ్చిన పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ కానీ, మరే ఇతర పన్ను ఆదా పథకాలు అయినా తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తుంటాయి. కనుక లాకిన్ సమయంలో ఉపసంహరణలను అనుమతించరు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! -
రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయానికి..
స్మాల్‌క్యాప్ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలున్నాయి. కనుక ఒకటికి మించిన స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు చేసుకోవచ్చా? ఎందుకంటే అసెస్మెట్ మేనేజ్మెంట్ కంపెనీలన్నవి ఒక్కోటీ వేర్వేరు వెలుగు చూడని జెమ్స్ లాంటి కంపెనీలను గర్తించొచ్చు కదా..? – యోగేష్ పెట్టుబడులన్నవి ఎల్లప్పుడూ చాలా సులభంగా ఉండాలి. మేము అనుసరించే సూత్రం ఇదే. స్మాల్‌క్యాప్ పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించొచ్చా? అన్నది ప్రశ్న. పూర్తి స్థాయి పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి వివిధ మార్కెట్ క్యాప్ సైజుల నుంచి నాలుగు లేదా ఐదు పథకాలను సూచిస్తుంటాం. చిన్న పోర్ట్‌ఫోలియో అయితే ఒక్కో కేటగిరీ నుంచి ఒక పథకాన్ని కలిగి ఉండొచ్చు. పెద్ద పోర్ట్‌ఫోలియో అయితే ఒకే విభాగం నుంచి రెండు పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వేర్వేరు పథకాల మధ్య వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని గమనించి, ఆయా పథకాల పట్ల నమ్మకం ఏర్పడితే రెండు స్మాల్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఇలా రెండు పథకాలను ఎంపిక చేసుకున్నప్పుడు వాటి పెట్టుబడుల పరంగా ఏకరూపత (ఒకే స్టాక్స్) 50% మించి ఉండకూడదు. ఏకరూపత అంటే రెండు స్మాల్‌క్యాప్ పథకాలు అవే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం. ఇంతకుమించితే పోర్ట్‌ఫోలియోకు రిస్క్ పెరుగుతుంది. ఈ రిస్క్‌ను వైవిధ్యం చేసుకునేందుకు.. వేర్వేరు పెట్టుబడుల విధానంతో కూడిన వేర్వేరు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సంబంధించి రెండు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ఏకరూపత రిస్క్ తగ్గుతుంది. మొత్తంపెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ విభాగానికి 20% మించకుండా చూసుకోవాలి. నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న మార్గాలు ఏంటి? విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. ఈ నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ రాబడి కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బ ణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40% చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్‌స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.34.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. చదవండి: ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్! -
ఫండ్స్‌లో ఏ ప్లాన్ ఎంచుకోవాలి?
నాకు రెండేళ్ల కూతురు ఉంది. తనను మంచి చదువులు చదివించాలన్న ఆలోచనతో స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇది సరైన నిర్ణయమేనా? –అనిత, విశాఖపట్టణం మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదు. ఆరంభంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. దీంతో మొదటిసారిగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు బెంబేలు పడతారు. ఫండ్సంటే భయపడేలా నష్టాలూ రావచ్చు. మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి కనీసం రెండేళ్లు అయితే, వాటి పనితీరుపై మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉండాలి. అందుకని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. మార్కెట్ పతన బాటలో ఉన్నా, ఈ సమయంలో వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నా, కొండొకచో నష్టాలు వచ్చినా అధైర్యపడకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఏదైనా హైబ్రిడ్ లేదా మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందలేరు. అందుకని స్మాల్ క్యాప్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లంతా సదా అప్రమత్తంగా ఉండాలి. స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు ఇప్పడున్నట్లుగానే మరో రెండేళ్ల తర్వాతో, మూడేళ్ల తర్వాతో అలాగే ఉంటుందనుకోకూడదు. స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు బాగా ఉంది కదాని చాలా మంది ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. అప్పుడు ఈ ఫండ్‌లోకి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వచ్చి చేరడం మొదలవుతుంది. అప్పుడు ఈ స్మాల్‌క్యాప్ ఫండ్ మేనేజర్‌కు ఈ నిధులను మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఆశించిన స్థాయిలో ఫండ్స్ పనితీరు ఉండకపోవచ్చు. మొత్తం మీద స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేసే ఇన్వెస్టర్లు రెండు ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది మార్కెట్ ఎలా ఉన్నా, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం. ఇక రెండవది కనీసం, ఆరు నెలల కొకసారైనా, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును జాగ్రత్తగా మదింపు చేయడం. ఇక డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందడం కోసం మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం ఒక్క మల్టీ క్యాప్ ఫండ్‌నైనా చేర్చుకోండి. నేను మ్యూచువల్ ఫండ్స్‌ల్లో నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే వీటిల్లో మూడు రకాలైన ప్లాన్లు ఉంటాయని తెలిసింది. డివిడెండ్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్, గ్రోత్ ప్లాన్లు–ఈ మూడింటితో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? –అన్వర్ పాషా, కరీంనగర్ ఈ మూడు ప్లాన్‌ల్లో గ్రోత్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఒక ఇన్వెస్టర్‌కు డివిడెండ్, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు సరైనవి కావని చెప్పవచ్చు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌పై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) విధించినప్పటి నుంచి చూస్తే, గ్రోత్ ప్లాన్లే మిగిలిన రెండు ప్లాన్ల కన్నా మెరుగైనవి అని చెప్పవచ్చు. డెట్ ఫండ్స్ విషయంలోనూ గ్రోత్ ప్లాన్లనే ఎంచుకోవడం మంచిది. వీటిల్లో ఇన్వెస్ట్ చేసి, కొంత కాలం తర్వాత సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. పైగా ఎస్‌డబ్ల్యూపీని పాటించడం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇక ఈక్విటీ ఫండ్స్ విషయానికొస్తే, గ్రోత్ ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల, మీపై డీడీటీ భారం ఏమాత్రం పడదు. నా వయస్సు 42 సంవత్సరాలు. నాకు ఐదేళ్ల పాప ఉంది. తన ఉన్నత చదువుల నిమిత్తం రూ.60 లక్షలు అవసరమవుతాయని అంచనా. తనకు 18 ఏళ్ల వచ్చేటప్పటి నుంచి ఈ డబ్బులు అవసరం అవుతాయి. నా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎలా ఉండాలి? –సుధీర్, హైదరాబాద్ ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే, పిల్లల ఉన్నత చదువుల కోసం కనిష్టంగా రూ.20 లక్షలు, గరిష్టంగా రూ.20 కోట్లు అవసరమవుతాయని అంచనా. మీ పాప ఉన్నత చదువుల కోసం రూ.60 లక్షల మేర అవసరమవుతాయని మీరు అంచనా వేయడం సరైనదే. ఈ డబ్బులు పొందడానికి మీకు 13 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి మీరు మదుపు చేయడానికి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఎంత వీలైతే అంత ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. గత 15–20 ఏళ్లలో చదువులకు సబంధించిన ఖర్చులు బాగా పెరిగాయి. రానున్న 10–15 ఏళ్లలో ఈ వ్యయాలు ఈ స్థాయిలో పెరగకపోయినా, బాగానే పెరిగే అవకాశాలున్నాయి. ఈక్విటీ ఫండ్స్ వార్షిక రాబడులు గత కొంత కాలంగా 18–20 శాతం రేంజ్లో ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే 12 శాతం రాబడిని ఆశించడం సమంజసమేనని చెప్పవచ్చు. అందుకని ఈక్విటీ ఫండ్స్‌లో ఎంత వీలైతే అంత ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. మీకు మరో పదమూడేళ్ల తర్వాత ఈ సొమ్ములు అవసరం కాబట్టి, పదేళ్ల తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ల్లో మదుపు చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత భాగాన్ని స్థిరాదాయ సాధనాల్లోకి బదిలీ చేయండి. ఇలా చేయడం వల్ల అప్పటి(మీరు మీ మదుపును విత్‌డ్రా చేసేకునే సమయం నాటి) మార్కెట్ స్థితిగతుల ప్రభావం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్స్‌ను ఎప్పుడు విక్రయించాలి?
నేను కొన్ని మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు(గ్రోత్ ఆప్షన్), డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటిపై పన్నులు ఎలా ఉంటాయి? – ఫరూక్, హైదరాబాద్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు(గ్రోత్ ఆప్షన్), డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పన్నులు ఒకే విధంగా ఉంటాయి. మీరు ఏదైనా డెట్ ఫండ్ గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మూడేళ్లలోపే మీరు ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫండ్ యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, వీటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులపై ఇండెక్సేషన్ ప్రయోజనాలతో 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలపై కొంత అవగాహన ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఇన్వెస్టర్‌గా నేను ఏం చేయాలి? ఫండ్ పనితీరు బాగా లేకపోతే ఆ ఫండ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలా ? లేదా వేరే ఫండ్‌లోకి మారిపోవాలా? అసలు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఏ ఏ సందర్భాల్లో విక్రయించాలో చెబుతారా ? – శైలజ, విజయవాడ ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను దీర్ఘకాలం కొనసాగిస్తే, సంపద అదే పెరిగిపోతుందని చాలా మంది ఇన్వెస్టర్లు అనుకుంటారు. అయితే ఇది అన్ని ఫండ్స్‌కు వర్తించదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫండ్స్ పనితీరును తప్పనిసరిగా మదింపు చేయాలి. మంచి రాబడులు ఇస్తుందా లేక ప్రతికూలంగా ఉందా గమనించాలి. ఫండ్ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేకపోయినా, ఈ కేటగిరిలోని ఇతర ఫండ్స్ కన్నా అధ్వానంగా ఉన్నా ఈ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి బదిలీ చేయాలి. దశాబ్దాలుగా మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్ పనితీరు అధ్వానంగా ఉంటే పనితీరు మెరుగుపడేదాకా వెయిట్ చేయడం ఉత్తమం. ఫండ్ మేనేజర్ మార్పు కూడా పరిగణనలోకి తీసుకోదగిన విషయమే. మీ ఫండ్ మేనేజర్‌ను సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ తొలగించి వేరే ఫండ్ మేనేజర్‌ను నియమించిందనుకుందాం. వెంటనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చేయాల్సిన పనిలేదు. కొత్త ఫండ్ మేనేజర్ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించండి. కొత్త ఫండ్ మేనజర్ నేతృత్వంలో మీ ఫండ్ పనితీరును కనీసం ఆరు నెలల పాటు అయినా మదింపు చేయండి. ఆ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు ఆ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. మీరు రెండు, అంతకంటే ఎక్కువ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. ఒకటికి మించిన ఫండ్ పోర్ట్‌ఫోలియో స్టాక్ హోల్డింగ్స్ దాదాపు ఒకే విధంగా ఉంటే, ఏదో ఒక ఫండ్ నుంచి వైదొలగడమే ఉత్తమం. ఫండ్ పోర్ట్‌ఫోలియోలు ఒకే విధంగా ఉంటే, డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు మీకు లభించవు. మీ పోర్ట్‌ఫోలియోలో అధిక సంఖ్యలో మ్యూచువల్ ఫండ్స్ ఉంటే, తక్కువ రాబడులు వచ్చే, పనితీరు బాగా లేని ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఐదు కంటే ఎక్కువ ఫండ్స్ ఉండకపోవడమే మంచిది. ఇక మీ అంచనాలకు అనుగుణంగా లేని ఫండ్స్‌ను కూడా విక్రయించవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే.. సొంత ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు తదితర ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు వస్తాయి. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మా నాన్నగారి వయసు 75 సంవత్సరాలు. ఆయనకు బేసిక్ మెడిక్లెయిమ్ పాలసీ రూ.1.5 లక్షలకు ఉంది. ఆయన కోసం రూ.5 లక్షల టాప్ అప్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి ? – కరుణాకర్, విశాఖ పట్టణం హాస్పిటలైజేషన్‌ను కవర్ చేసే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని టాప్ అప్ పాలసీగా చెప్పుకోవచ్చు. స్వల్ప అదనపు వ్యయంతో ఆరోగ్య బీమా కవర్‌ను పెంచుకోవడానికి ఇది అత్యుత్తమ మార్గం. వైద్య ఖర్చులు ఒక పరిమితికి మించితేనే ఈ టాప్ అప్ పాలసీలు పనిచేస్తాయి. చాలా టాప్ అప్ పాలసీలకు గరిష్ట వయసు పరిమితి 65 సంవత్సరాలు. ఐసీఐసీఐ లొంబార్డ్ హెల్త్ కేర్ ప్లస్వంటి కొన్ని ప్లాన్లకు గరిష్ట వయోపరిమితి లేదు. ఇలాంటి టాప్ అప్ ప్లాన్లకు ప్రీమియమ్ కూడా అధికంగానే ఉంటుంది. అంతే కాకుండా మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా ప్రీమియమ్ ఆధారపడి ఉంటుంది. అందుకని అధిక వయసు వ్యక్తులకు వివిధ సంస్థలు అఫర్ చేస్తున్న టాప్ అప్ ప్లాన్లన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి మీ బడ్జెట్‌కు సరిపడే ప్లాన్‌ను ఎంచుకోండి. -
టర్మ్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి..?
యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌లో 2011 ఆగస్టు నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్‌పై రాబడులు తక్కువగా వస్తున్నాయి. దీంతో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 2014 అక్టోబర్ నుంచి ఆపేశాను. నా నిర్ణయం సరైనదేనా? ఈ ఫండ్‌లో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌కు మార్చాలనుకుంటున్నాను. ఎలా మార్చుకోవాలో వివరిస్తారా? -శర్మిష్ట, హైదరాబాద్ అధిక డివిడెండ్లు చెల్లించే కంపెనీల నుంచి నిలకడైన రాబడులు ఆశించే సాంప్రదాయిక ఇన్వెస్టర్లకు అనువైన ఫండ్‌గా యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌ను చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు బాగాలేని మాట వాస్తవమే. కానీ ఈ ఒక్క కారణంతో ఈ ఫండ్ నుంచి వైదొలగడం సరైనది కాదు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ బుల్ మార్కెట్లో మంచి పనితీరు కనబరచకపోవడమనేది సాధారణమైన విషయమే. మీ నిర్ణయంపై పునరాలోచించండి. ఈ ఫండ్ నుంచి వైదొలగాలని పూర్తి స్థాయిలో మీరు నిర్ణయించుకుంటే, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా యూటీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ నుంచి వేరే కొత్త ఫండ్‌కు మారవచ్చు. నేనొక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మార్కెట్లో చాలా టర్మ్ ప్లాన్లున్నాయి. ప్రీమియం విషయానికొస్తే, 70 నుంచి 80 శాతం వరకూ తేడా ఉంది. రిలయన్స్, అవైవా, ఏఎక్స్ఏ, ఎస్బీఐ లైఫ్‌ల్లో ఏది ఎంచుకోవాలో సలహా ఇస్తారా? - నవనీత్, విశాఖ పట్టణం బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బీమా తీసుకున్న మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడమనే ఒకే ఒక లక్ష్యంతో టర్మ్ ప్లాన్లు రూపొందిస్తారు. వివిధ కంపెనీలు వివిధ అంశాల ఆధారంగా ప్రీమియమ్‌లను నిర్ణయిస్తాయి. అందుకే వాటిల్లో తేడాలుంటాయి. బీమా కంపెనీల గతంలోని క్లెయిమ్‌ల నిష్పత్తిని బట్టి, ఇతర బీమా కంపెనీల ప్రీమియమ్‌లతో ఉన్న తేడాలను బట్టి టర్మ్ ప్లాన్లను ఎంచుకోవాలి. ఈ అంశాలన్నింటి పరంగా చూస్తే, భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఈప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్-లెవల్ కవర్... ఈ టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఆన్లైన్ టర్మ్ ప్లాన్లు. మీ వయస్సుకు ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందో, లెక్కలేసుకొని, మీ బడ్జెట్‌కు అనుగుణంగా టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోండి. నేను 2007 నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మార్ట్‌కిడ్ యులిప్(మ్యాక్సిమైజర్)లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.10,000 ప్రీమియం చొప్పున ఎనిమిది సంవత్సరాల పాటు మొత్తం రూ.80,000 చెల్లించాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ విలువ రూ.1,42,000గా ఉంది. ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటున్నాను. ఈ వచ్చిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనూ, ఎంపిక చేసిన షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? ఈ పాలసీని సరెండర్ చేస్తే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు. -జబ్బార్, వరంగల్ బీమా, పెట్టుబడులకు ఒకే పాలసీని తీసుకోవడం సరికాదని ఎప్పటి నుంచో చెపుతూనే ఉన్నాము. మీరు ఈ పాలసీని సరెండర్ చేసి, ఆ వచ్చిన మొత్తాన్ని ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ, లేదా బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ పాలసీ ఐదేళ్లు దాటింది కాబట్టి, మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇక ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. నేను గత ఏడాది మేలో డీఎస్పీ బ్లాక్‌రాక్ ఎఫ్ఎంపీ సిరీస్154లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇది ఈ నెలలో మెచ్యూర్ అవుతోంది. నేను పది శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. నేను ఎంత పన్ను చెల్లించాల్సి ఉం టుంది? దీనిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చా? -కుమార స్వామి, విజయవాడ మీరు ఈ ఫండ్‌లో పొందిన లాభాలపై 10 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్ ద్వారా మూడేళ్లలోపు పొందిన రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఒక క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్‌ను ఇన్వెస్టర్ పొడిగించడానికి వీలులేదు. మ్యూచువల్ ఫండ్ సంస్థ మాత్రమే ఫండ్ మెచ్యూరిటీని పొడిగించే వీలు ఉంది. అలా చేసినప్పుడు సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ మీకు సమాచారమిస్తుంది. అలాంటి సమాచారం మీకు అందితే, మీకు తక్షణం ఈ డబ్బులు అవసరం లేకపోతే, ఈ ప్లాన్‌ను ఎలాంటి అనుమానాలు లేకుండా పొడిగించుకోండి. -
డబ్బు అవసరమైతేనే లాభాలు స్వీకరించండి
నేను 2004 నుంచి 2007 వరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. పెట్టిన పెట్టుబడులపై 5-6 రెట్లు రాబడులు వచ్చాయి. 2009 నుంచి మళ్లీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను. మంచి రాబడులే వస్తున్నాయి. ఇంత వరకూ వీటిని విక్రయించలేదు. వీటి నుంచి లాభాలను తీసుకొని ప్రస్తుతం మరింత రాబడులు ఇస్తున్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? ఇక మా నాన్నగారు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టమని సలహా ఇచ్చాను. నా సలహా సరైనదేనా? - వాసుదేవ్, గుంటూరు మీరు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, మీకు మంచి రాబడులు వచ్చాయి. మీరు దీర్ఘకాలం దృష్ట్యా కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. కానీ వాటిని విక్రయించలేదు. లాభాలను తీసుకోలేదు. షేర్లలో ఇన్వెస్ట్ చేసేవారు కాక ట్రేడింగ్ చేసేవారు లాభాలు స్వీకరిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఇది సరికాదు. లాభాలు వస్తే, తీసుకోకుండా ఎందుకు ఉండాలనేది చాలా మంది వాదిస్తారు. దీనికి మీ అనుభవమే మంచి ఉదాహరణ. మీరు 2004లో ఇన్వెస్ట్ చేశారు. 2007లో మంచి రాబడులు వచ్చాయి. అయినా టెంప్ట్ కాకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించారు. ఒక వేళ మీరు టెంప్ట్ అయి లాభాలను బుక్ చేశారనుకోండి. ఇప్పుడున్న రాబడులు వచ్చేవి కావు కదా? లాభాల స్వీకరణ కోసం కాకుండా మీకు డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే మీరు మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించాలి. మీరు దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతమున్న మ్యూచువల్ ఫండ్స్‌లోనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఇక మీ నాన్నగారి విషయానికొస్తే, ఏదైనా డైవర్సిఫైడ్ ఫండ్‌ను ఎంచుకోమనండి. ఆ ఫండ్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయమనండి. మంచి రాబడులు పొందవచ్చు. నా పుట్టింటి వారి నుంచి స్త్రీ ధనం కింద పెద్ద మొత్తం లభించింది. ఇంత పెద్ద మొత్తం మరో మూడేళ్ల వరకూ మాకు అవసరం లేదు. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో గానీ, దీర్ఘకాలం ఉండే ఇన్‌కం ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. భద్రత, లిక్విడిటీ, పన్ను ప్రయోజనాలు... వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తగిన సలహా ఇవ్వగలరు. - సరళా రాణి, విశాఖ భద్రత, లిక్విడిటీ, పన్ను ప్రయోజనాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మీరు మీ సొమ్ములను దీర్ఘకాలం ఉండే ఇన్‌కం ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. వీటి ట్రాక్ రికార్డ్‌ను బట్టి మీరు వీటిని సులభంగా ఎంచుకోవచ్చు. ఇక ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ) విషయానికొస్తే, వీటి పనితీరును అంచనా వేసే ట్రాక్ రికార్డ్ అందుబాటులో ఉండదు. అంతేకాకుండా ఎఫ్ఎంపీలు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండదు. మూడేళ్ల పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, ఎఫ్ఎంపీకైనా, దీర్ఘకాలం ఉండే ఇన్‌కం ఫండ్‌కైనా పన్ను ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. ప్రస్తుతమున్న వడ్డీరేట్ల పరిస్థితులు ఇన్‌కం ఫండ్స్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇన్‌కం ఫండ్స్ ప్రస్తుతం లాంగ్ టెర్మ్ గిల్ట్ సెక్యూరిటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాయి. అందరూ అంచనా వేస్తున్నట్లుగా వడ్డీరేట్లు మరింతగా తగ్గితే ఇన్‌కం ఫండ్స్‌కు మరిన్ని రాబడులు వస్తాయి. డిస్ట్రిబ్యూటర్ల సర్వీస్ ట్యాక్స్ భారం ఇన్వెస్టర్లపైనే ఉంటుందనే వార్త విన్నాను. ఇది నిజమేనా? మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసేవారిపై కూడా ఈ భారం ఉంటుందా? - సదానంద, తిరుపతి. సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించి ఈ ఏడాది బడ్జెట్ రెండు రకాల మార్పులను తీసుకువచ్చింది. మొద టిది 12.3 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్లు...రెండింటికి ఇది వర్తిస్తుంది. ఇక రెండోది డిస్ట్రిబ్యూటర్ల కమిషన్‌ను సర్వీస్ ట్యాక్స్ పరిధిలోనికి తెచ్చారు. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్ల కమిషన్‌పై కూడా సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్‌ను డిస్ట్రిబ్యూటర్లే చెల్లించాలని సెబీ ఆదేశాలున్నప్పటికీ, ఈ భారం ఇన్వెస్టర్లపైననే పడుతుంది. అయితే డెరైక్ట్ ప్లాన్స్ విషయంలో ఎలాంటి డిస్ట్రిబ్యూటర్లు ఉండరు కాబట్టి దీనికి మినహాయింపు ఉంటుంది. -
వేతన జీవులకు సిప్.. వ్యాపారులకు?
నేను ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని 8 లేదా 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫండ్‌ను ఎంచుకోవాలి? ఆ ఫండ్ పనితీరు, ట్రాక్ రికార్డ్ తదితర సమాచారాన్నంతటినీ సేకరించాను. అయితే నేను ఎప్పుడు ఆ ఫండ్ నుంచి వైదొలగాలో అన్న విషయం నాకు కొంచెం గజిబిజిగా ఉంది. ప్రతీ 2-3 ఏళ్లకు కొంత రాబడి లక్ష్యంగా పెట్టుకుని, ఆ రాబడులు రాగానే వైదొలగడం మంచిదంటారా? లేకుంటే నేను లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక లక్ష్యం(పిల్లల చదువు) కోసం అవసరమయ్యే రాబడి ఎప్పుడు వస్తే అప్పుడు వైదొలగమంటారా? తగిన సలహా ఇవ్వండి. - మార్కండేయ, హైదరాబాద్ సాధారణంగా ట్రేడర్లు ఒక నిర్దేశిత రాబడి లక్ష్యంగా పెట్టుకుని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కొంత ధరను స్టాప్ లాస్‌గా పెట్టుకుంటారు. ఈ తరహా వ్యూహంలో లక్ష్యంగా పెట్టుకున్న రాబడి రాగానే లాభాలను స్వీకరిస్తారు. అయితే ఈ విధానం సాధారణ ఇన్వెస్టర్లకు సరిపడదు. ఈ విధానంలో క్రమం తప్పకుండా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందే అవకాశాన్ని ఇన్వెస్టర్లు కోల్పోతారు. సిప్ విధానం ఎంచుకునేది దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందడానికోసమే కదా. అందుకని 2, 3 ఏళ్లకు మీరు ఆశించిన కొంత రాబడి వచ్చినప్పటికీ, ఆ ఫండ్ నుంచి వైదొలగకుండా అలాగే కొనసాగడం మంచిది. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్‌ను ఎంచుకోండి. దాంట్లో క్రమం తప్పకుండా సిప్ విధానంలో కనీసం మూడేళ్లకు పైగానే ఇన్వెస్ట్ చేయండి. మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి(ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువు తదితర అంశాలు) ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ఫండ్ యూనిట్లన్నింటినీ విక్రయించండి. నెలా నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తంలో వేతనాలు లభించే వారికి సిప్ విధానం భేషుగ్గా ఉంటుంది. అయితే వ్యాపారం చేసే నా లాంటి వాళ్లకు ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో సొమ్ములు సమకూరే అవకాశం లేదు. అలాంటి వాళ్లం సిప్ విధానాన్ని అనుసరించలేం కదా. ఇప్పుడు నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నాయి. నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త. నేను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వ్యూహాన్ని అనుసరించాలి? - దక్షిణామూర్తి, విజయవాడ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడం కోసం సిప్ విధానాన్ని అనుసరిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చని మేం సూచిస్తూ ఉంటాం. మార్కెట్ ఉచ్ఛస్థాయిలో మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ తర్వాత మార్కెట్ పడిపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ విలువ బాగా తగ్గిపోతుంది. ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నవాళ్లు ఇది తట్టుకోగలుగుతారు. చిన్న, కొత్త ఇన్వెస్టర్లకు మాత్రం ఇది అశనిపాతమే. అందుకని ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం శ్రేయోదాయకం కాదు. అందుకని ఈక్విటీల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెబుతుంటాం. ఇక మీ విషయానికొస్తే, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న పెద్ద మొత్తాన్ని ముందుగా ఫిక్స్డ్ ఇన్‌కం ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఏదైనా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)ద్వారా ఈ ఈక్విటీ ఫండ్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తరలించండి. ఇలా చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందడమే కాకుండా, మంచి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. నేనొక ఈక్విటీ ఫండ్‌లో ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎస్టీపీ(సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్) ద్వారా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కు బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే నేను మూలధన పన్ను లాభాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు కదా. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద ఇతర పన్ను ప్రయోజనాలు ఏమైనా లభిస్తాయా? వివరించగలరు. - సరిత, నెల్లూరు ఎస్టీపీ ద్వారా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు బదిలీ చేయడం అంటే-ఒక మ్యూచువల్ ఫండ్‌లో యూనిట్లను విక్రయించి, కొత్తగా మరో మ్యూచువల్ ఫండ్‌లో యూనిట్లను కొనుగోలు చేయడమే. అందుకని ఏడాదికన్నా ముందే మీరు ఏదైనా ఈక్విటీ ఫండ్ నుంచి వైదొలిగితే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ విషయంలో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాది కాలాన్ని దాటాయి కాబట్టి మీకు ఇది వర్తించదు. ఈక్విటీ ఫండ్స్‌లో యూనిట్లను ఏడాది దాటాక విక్రయిస్తే ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లిం చాల్సిన పని లేదు. ఇక మీరు బదిలీ చేయాలనుకుం టున్న ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌కు సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈఎల్ఎస్ఎస్ యూనిట్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మీరు బదిలీ చేసే ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని గుర్తుంచుకోండి. -
రిటైర్మెంట్కు మంచి ప్రణాళిక ఎలా..?
నేనొక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్ నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్‌లోకి మళ్లిద్దామనుకుంటున్నాను. ఇలాచేస్తే నాకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? సాంకేతికంగా చూస్తే ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి పన్ను ప్రయోజనాలు లభించవని నేను అనుకుంటున్నాను. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అలా అయితే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి కదా. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - రవీందర్, వరంగల్ ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చు. ఒకేసారి కానీ, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా మార్చుకోవచ్చు. ఎస్టీపీ ద్వారా మార్చుకుంటేనే ఉత్తమం. ఇక ఇలా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకుంటే, ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరో ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేసినట్లుగా పరిగణిస్తారు. మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోకి మళ్లిద్దామనుకుంటున్నారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చినప్పటి నుంచి లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మీరు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నా తల్లిదండ్రుల కోసం యునెటైడ్ ఇండియా సూపర్ టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియమ్‌ను నగదు రూపంలో చెల్లించాను. ప్రీమియమ్‌ను చెక్కు ద్వారా గానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించనందున ఈ ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభ్యం కావని నా మిత్రుడొకరు చెప్పాడు. అయితే ప్రీమియమ్ చెల్లించిన రసీదుతో పన్ను ప్రయోజనాలు పొందవచ్చని బీమా ఏజెంట్ ఒకరు చెప్పారు. ఈ రెండింటిలో ఏది కరెక్టు? - సోమసుందర్, విశాఖపట్టణం తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య పాలసీల ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డీ ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ ప్రీమియమ్‌ను చెక్కు ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ చెల్లించాలి. నగదు రూపంలో చెల్లిస్తే పన్ను ప్రయోజనాలు లభ్యం కావు. ఈ విషయంలో మీ మిత్రుడే కరెక్టు. మీరు పన్ను ప్రయోజనాలు పొందలేరు. రిటైర్మెంట్ అవసరాల నిమిత్తం నెలకు రూ.40,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ)లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చనేది అతని అభిప్రాయం. కానీ ఇంత మొత్తం కొన్నేళ్లపాటు ఈ స్కీమ్‌లో నిరుపయోగంగా ఉండిపోతుందనేది నా అభిప్రాయం? మీరేమంటారు? - ఆనంద్, హైదరాబాద్ రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడమనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ వయస్సు, మీ రిటైర్మెంట్ అవసరాలు, మీ ప్రస్తుత సంపాదన ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్లాన్ చేసుకోవాలి. మీరు మీ వయస్సును వెల్లడించలేదు. కాబట్టి, మూడు రకాలైన పరిస్థితుల్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయవచ్చో సూచించాం. మీకు సరిపోయినది ఎంచుకోండి. మొదటిది: మీరు రిటైర్మెంట్కు దగ్గరగా ఉంటే ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. ప్రతి నెలా అంత మొత్తానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తే, అవి మెచ్యూరిటీ అయి రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం పొందవచ్చు.అయితే ఎన్ఎస్సీ వంటి స్థిరాదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందలేరు. రెండోది: మీ రిటైర్మెంట్ ఇంకా ఎక్కువ సంవత్సరాలున్నట్లయితే, ఈక్విటీల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 10 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో పెట్టుబడులు పెట్టాలి. మిగిలిన మొత్తాన్ని ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మూడవది: మీకు 30లోపు వయస్సుండి, రిటైర్మెంట్ అవసరాల కోసం చూస్తున్నట్లయితే, మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 60 శాతాన్ని డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్ ఎంచుకునే పద్ధతి ఏమిటి?
మంచి ఫండ్‌ను ఎంచుకోవడానికి సరైన పద్ధతి ఏమిటి? ఈక్విటీ డైవర్సీఫైడ్ ఫండ్కంటే బ్యాలెన్స్డ్ ఫండ్ మెరుగైనదా? - విశాల్, వైజాగ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపికచేసుకునేటపుడు ఆయా ఫండ్స్‌కు వున్న రేటింగ్స్ చూడటం ఉపయోగపడుతుంది. టాప్ రేటింగ్స్ వుండే ఫండ్స్‌లో మంచి పనితీరు కనపర్చినవాటిని...అవి గ్యారంటీ రాబడుల్ని ఆఫర్చేయకపోయినా మీరు విశ్వసించవచ్చు. మ్యూచువల్ ఫండ్ ధర, అవి ఆర్జించే రాబడులు రోజువారీగా మారిపోతుంటాయి. అయితే వాటికి (ఫండ్స్‌కు) వాల్యూ రీసెర్చ్ ఇచ్చే ఫండ్ రేటింగ్స్‌ను నెలకోసారి సవరించడం జరుగుతుంది. రేటింగ్ మార్పులు మరీ ఎక్కువగా లేకుండా మా రేటింగ్ పద్ధతిని రూపొందించాం. ఇక మీ రెండో ప్రశ్నకొస్తే...ఈక్విటీ ఫండ్స్‌కంటే రుణపత్రాల్లో పెట్టుబడి దృష్ట్యా బ్యాలెన్స్డ్ ఫండ్స్ మెరుగైన స్థిరత్వాన్ని ఇస్తాయి. మీరు భరించే రిస్క్నుబట్టి మీ ఎంపిక ఆధారపడివుంటుంది. ఒడుదుడుకుల్ని ఏమాత్రం భరించలేకపోతే ఎటువంటి మార్కెట్ ఆధారిత పెట్టుబడికైనా దూరంగా వుండండి. నా ఇద్దరు పిల్లలకోసం 10 సంవత్సరాలకుగాను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయదల్చాను. ఎక్కడ పెట్టుబడి చేయాలి? - శిరీష్, కరీంనగర్ మీ ఇద్దరు పిల్లల కోసం పెట్టుబడి చేసేటపుడు మీరు ఎటువంటి విభిన్న పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మంచి పనితీరు కనపర్చే ఓ రెండు ప్రధాన ఫండ్ స్కీములను ఎంచుకొని, వాటిలో సిప్ విధానంలో క్రమంగా పెట్టుబడి చేయండి. హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, యూటీఐ ఈక్విటీ, యూటీఐ ఆపర్చూనిటీస్, బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ల నుంచి మల్టీ-క్యాప్ విభాగంలోని కొన్ని స్కీముల్ని ఎంచుకోవొచ్చు. మార్కెట్లు ఎలావున్నా వీటిలో పెట్టుబడి చేయవచ్చు. కానీ ఏడాదికోసారి ఈ పెట్టుబడుల్ని సమీక్షించుకోవాలి. నెలకు ఎన్‌పీఎస్‌లో నెలకు రూ. 500, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 16,000, ఈపీఎఫ్‌లో రూ. 8,000 చొప్పున పెట్టుబడి చేస్తున్నా. అయితే నాకు పీపీఎఫ్ అకౌంట్ లేదు. నా రిటైర్మెంట్ కోసం పీపీఎఫ్ ఖాతా కావాలనుకుంటున్నాను. 15 సంవత్సరాల్లో అది పరిపక్వం కావాలంటే నేను ఇప్పుడే ఆ ఖాతాను ప్రారంభించాల్సివుంటుందా? ప్రతీ నెలా నేను ఎంత పెట్టుబడి చేయాల్సివుంటుంది? - సురేష్. ఈ మెయిల్ పదవీ విరమణ తర్వాత స్థిరాదాయం, తక్షణాదాయ అవసరాల కోసం మీకు వివిధ మార్గాలు అవసరమవుతాయి. ఉదాహరణకు ఈపీఎఫ్ నుంచి వచ్చే పెన్షన్ స్థిరాదాయం. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే ఆదాయం అలాంటిది కాదు. రిటైర్మెంట్ తర్వాత ఆదాయం కోసం చూసేటపుడు ద్రవ్యోల్బణ ప్రభావం, మీకు ప్రతీ నెలా కచ్చితంగా కావాల్సిన మొత్తం వంటివి పరిగణనలోకి తీసుకోండి. ఉదాహరణకు ప్రస్తుతం మీరు ఏదైనా కొనడానికి రూ. 10 ఖర్చుచేస్తుంటే , ప్రతీ ఏటా 6 శాతం ద్రవ్యోల్బణం ప్రకారం అది పదేళ్ల తర్వాత రూ. 18 ధరకు పెరుగుతుంది. అందువల్ల మీ ప్రస్తుత పెట్టుబడి మీ రిటైర్మెంట్ అవసరాలకు తగినంతగా లేకపోతే ఇందుకోసం మీరు పొదుపును, పెట్టుబడుల్ని పెంచాల్సివుంటుంది. ఈ నేపథ్యంలో మీరు పెట్టుబడిని 15 సంవత్సరాలు అట్టిపెట్టగలిగితే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) అనువైనది. మీ రిటైర్ అయ్యే సమయం తక్కువగావుంటే పదవీ విరమణ కోసం పెట్టుబడుల్ని పెంచుకోండి. నేను 10 శాతం టాక్స్ బ్రాకెట్లోకి వస్తాను. నేడు ఇండక్సేషన్ ప్రయోజనం కోసం ప్రయత్నించవచ్చా? - వినీల్, తిరుపతి మీకు వచ్చే ప్రయోజనం ఆధారంగానే మీరు వ్యవహరించాలి తప్ప, మీరు ఏ టాక్స్ బ్రాకెట్లో వున్నారన్నది ప్రధానం కాదు. ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌లో చేస్తే, మీరు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌గా 10 శాతంగానీ, ఇండెక్సేషన్‌తో 20 శాతంగానీ చెల్లించవచ్చు. లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ అసెట్ అయినప్పటికీ, ఇండెక్సేషన్‌తో 20 శాతం చెల్లించినా, పన్ను తక్కువగానే వుంటుందిగనుక ఈ ఆప్షన్‌ను ఎంచుకోండి. -
రేటింగ్ క్షీణిస్తున్నా, పెట్టుబడులు కొనసాగించాలా?
నా వయస్సు 33 సంవత్సరాలు. ఆన్లైన్ టెర్మ్ కవర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఐ-లైఫ్ ప్లాన్‌లో విదేశాల్లో మరిణిస్తే పాలసీదారునికి డెత్ కవర్ వర్తించదని అవైవా ఏజంట్ చెప్పారు. నేను తరచుగా ప్రయాణాలు చేస్తున్నట్లైతే, ఆఫ్‌లైన్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమమా? చాలా ఆన్లైన్ ప్లాన్లకు మెడికల్ చెకప్ అడగడం లేదు. ఎలాంటి చెకప్ లేకుండా బీమా పాలసీ తీసుకుంటే పాలసీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏమైనా సమస్యలైనా వస్తాయా? - ఆనంద్, బెంగళూరు అవైవా ఐ-లైఫ్, హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ తదితర చాలా ఆన్లైన్ టెర్మ్ పాలసీలు విదేశాల్లో మరణానికి కూడా కవర్ చేస్తాయి. కాకుంటే మీరు పాలసీ తీసుకున్న బీమా సంస్థకు మీ టూర్ ప్రణాళికలు, ఎంత తరుచుగా మీరు విదేశీయానం చేస్తుంటారు తదితర పూర్తి వివరాలను రాత పూర్వకంగా వెల్లడించాల్సి ఉంటుంది. యువ జనుల మెడికల్ చెకప్ గురించి చాలా బీమా సంస్థలు అడగడం లేదు. అయితే పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ తీసుకునే వ్యక్తి తన ఆరోగ్య స్థితిగతుల గురించి వీలైనంత సమాచారం సదరు బీమా సంస్థకు తెలియజేయడం ఉత్తమం. దీంతో ఎలాంటి పొరపొచ్చాలకు తావుండదు. మీరు లేనప్పుడు మీ అప్పులను తీర్చి, మీ కుటుంబానికి ఆర్థికంగా బాసటనిచ్చేలా సరైన మొత్తానికి బీమా పాలసీ తీసుకోవడం మంచిది. నేను గత కొన్నేళ్లుగా ఒక ఫైవ్ స్టార్ రేటెడ్ ఫండ్‌లో సిప్ విధానంలో మదుపు చేస్తున్నాను. అయితే ఈ ఫండ్ పనితీరు నానాటికీ దిగజారుతోంది. పెట్టుబడులను ఉపసంహరించమంటారా? లేక కనీసం 2-3 ఏళ్ల వరకూ పెట్టుబడులు కొనసాగించి, ఆ తర్వాత ఫండ్ పని తీరును బట్టి నిర్ణయం తీసుకోమంటారా? ముం దుగానే విత్ డ్రా చేసుకుంటే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు. - ప్రసన్న, విశాఖ పట్టణం మీరు మదుపు చేసిన ఫండ్ పనితీరు తగ్గిపోవడం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సిప్ విధానంపై నమ్మకం పోగొట్టుకోకండి. ఒక ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్ పనితీరు దిగజారి దాని రేటింగ్ ఫోర్ స్టార్కో, త్రీ స్టార్కో పడిపోయినప్పటికీ, ఆ ఫండ్‌లోనే ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిం చడం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీ పెట్టుబడులను జాగ్రత్తగా మదింపు చేయాలి. మీ ఫండ్ పనితీరు మరింత దిగజారి రేటింగ్ టూ స్టార్ లేదా వన్ స్టార్కో వచ్చినప్పుడు మాత్రమే పెట్టుబడులు ఆపండి. పనితీరు సరిగ్గా లేని ఫండ్‌లో మీ పెట్టుబడులు కొనసాగించడం వల్ల మీ నష్టాలు మరింతగా పెరుగుతాయి. అదే సమయంలో మంచి పనితీరు కనబరిచే ఫండ్ అందించే లాభాలను మీరు మిస్ అవుతారు. ఇక ఈక్విటీ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిలోపే ఉపసంహరించుకుంటే, మీరు షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మా నాన్నగారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్ గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఈ నెలలో రిటైరవుతున్నారు. ఈ ఫండ్ గ్రోత్ ఆప్షన్ నుంచి డివిడెండ్ పే అవుట్ ఆప్షన్‌కు మారాలనుకుంటున్నారు. ఏం చేయాలి? - యాదగిరి, నిజామాబాద్ ఒక ప్లాన్ నుంచి మరొక ప్లాన్‌కు మారడం అంటే ప్రస్తుతమున్న ప్లాన్ నుంచి యూనిట్లను విక్రయించి, కొత్త ప్లాన్ యూనిట్లను కొనుగోలు చేయడం కిందే వస్తుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్ల ఎన్ఏవీ రెండూ వేర్వురుగా ఉంటాయి. డివిడెండ్ ప్లాన్‌లో ఎప్పటికప్పుడు డివిడెండ్లు చెల్లిస్తారు. అదే గ్రోత్ ప్లాన్‌లో డివిడెండ్లను రీ ఇన్వెస్ట్ చేస్తారు. అందుకనే గ్రోత్ ప్లాన్స్ ఎన్ఏవీ, డివిడెండ్ ప్లాన్ ఎన్ఏవీ కంటే అధికంగా ఉంటుంది. ఇక ప్లాన్ మార్పు గురించి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ స్కీమ్స్ అన్నీ క్లోజ్డ్ ఎండ్ స్కీమ్స్. వీటిని మీరు రిడీమ్ చేసుకోలేరు. అందుకనే ఈ స్కీమ్స్ మెచ్యూరిటీ కంటే ముందుగానే వీటి నుంచి మారడం మినహా మరో మార్గం లేదు. క్లోజ్డ్ ఎండ్ స్కీమ్స్‌కు సంబంధించి డివిడెండ్ ఆప్షన్ ప్లాన్‌లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కూడా లేదు. క్లోజ్డ్ ఎండ్ స్కీమ్‌ల్లో న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ) సమయంలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. -
15 శాతం వార్షిక రాబడి.. అత్యాశే!
నేను ప్రైమరీ హోల్డర్‌గా నా భార్య సెకండరీ హోల్డర్‌గా కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేశాను. నా భార్య గృహిణి మాత్రమే. ఎలాంటి ఆదాయ వనరులు లేవు. ఫండ్ సంస్థ నివేదించిన వార్షిక సమాచార నివేదిక(యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-ఏఐఆర్) ఆధారంగా ఆదాయపు పన్ను అధికారులు సెకండరీ హోల్డర్‌గా ఉన్న మా ఆవిడ ఫండ్స్ విషయమై వివరణ అడుగుతున్నారు. నేను ఏం చేయాలి? - పవన్ కుమార్, వరంగల్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా కనీసం రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు సంబంధిత ఇన్వెస్ట్మెంట్ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ వార్షిక సమాచార నివేదిక(యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-ఏఐఆర్)ను ఆదాయపు పన్ను అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష పన్ను ఎగవేతలను నివారించడానికి ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. ఇన్వెస్టర్ సమర్పించే ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్)లో, ఐటీ అధికారులకు అందే ఏఐఆర్‌లో ఏమైనా తేడాలుంటే దానికి సదరు ఇన్వెస్టర్దే బాధ్యత. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను మీరు ప్రైమరీ హోల్డర్‌గా, మీ భార్య సెకండరీ హోల్డర్‌గా కొనుగోలు చేసిన పక్షంలో, సెకండరీ హోల్డర్‌గా ఉన్న మీ భార్య తాను కేవలం మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణకు సంబంధించి కేవలం జాయింట్ సెకండరీ హోల్డర్ని మాత్రమేనని ఆదాయపు పన్ను అధికారులకు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ప్రైమరీ హోల్డర్ పెట్టుబడులతోనే కొనుగోలు చేయడం జరిగిందని వారికి తెలపాల్సి ఉంటుంది. నేను రిటైరై ఏడాదవుతోంది. ఎలాంటి నష్టభయం లేని, ఏడాదికి 15% రాబడినిచ్చే మ్యూ చువల్ ఫండ్స్‌లో కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. - సింహాచలం, విశాఖ పట్టణం నష్ట భయం లేని ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 15% వార్షిక రాబడి ఆశించడం కొంచెం ఎక్కువేనని చెప్పాలి. మీ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని స్థిరాదాయాన్నిచ్చే మార్గాల్లో, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో మదుపు చేయండి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పెట్టుబడులు పెట్టడం సముచితం. రిటైరైన తర్వాత క్రమం తప్పకుండా మీకు కొంత ఆదాయం కావాలి. ఎంత ఆదాయం కావాలో అంత మొత్తానికి స్థిరాదాయాన్నిచ్చే స్కీముల్లో పెట్టుబడులు పెట్టాలి. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో మదుపు చేయాలి. ఉదాహరణకు మీకు రిటైర్మెంట్ సొమ్ము రూ.25 లక్షలు వచ్చిందనుకుందాం. దీంట్లో రూ.15 లక్షలను 9% రాబడినిచ్చే సీని యర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో పొదుపు చేయవచ్చు. మిగతా మొత్తాన్ని ఈక్విటీల్లో కొద్ది మొత్తాల్లో క్రమం తప్పక ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకే కేటగిరీ ఈక్విటీల్లో కాకుండా, వివిధ రంగాలకు చెందిన ఈక్విటీల్లో డైవర్సిఫై చేయడాన్ని మరువకండి. నేను కొంత మొత్తాన్ని 366 రోజుల ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో ఇన్వెస్ట్ చేశాను. దీనిపై వచ్చే రాబడిని ఫిక్స్డ్ డిపాజిట్‌పై వచ్చే రాబడిని లెక్కించినట్లుగా మా ఆడిటర్ లెక్కించాడు. ఎఫ్‌ఎంపీలకు ఉండే ఇండెక్సేషన్ ప్రయోజనాలను మా ఆడిటర్‌కు తెలిపాను. దీనికి సంబంధించిన చట్టం, తదితర వివరాలు కావాలని ఆయన అడుగుతున్నారు. దయచేసి ఆ వివరాలు వెల్లడిస్తారా? - సమీర, హైదరాబాద్ ఆదాయపు పన్ను(ఐటీ) చట్టం, 1961లో సెక్షన్ 112లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. అన్ని ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్‌లో కూడా ఈ సమాచారం ఉంటుంది. పన్ను ఆదాలకు ఇండెక్సేషన్ తోడ్పడుతుంది. -
ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో అంటే?
ఎన్‌ఏవీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? -మురళీధర్, హైదరాబాద్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను నిర్వహించినందుకుగాను మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొన్ని చార్జీలను వసూలు చేస్తాయి. నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో కొంత శాతంగా ఈ చార్జీలు ఉంటాయి. ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నిర్వహణ, మార్కెటింగ్, తదితర వ్యయాలు కూడా ఈ చార్జీల్లో కలిసి ఉంటాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రవేశించినప్పుడు 30 బేసిస్ పాయింట్లు, వైదొలగినప్పుడు 20 బేసిస్ పాయింట్ల చొప్పున చార్జీలను వసూలు చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలను నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. (టాప్ 15 నగరాలకు ఇది వర్తించదు) అంతేకాకుండా అడ్వైజరీ ఫీజుపై సర్వీస్ చార్జీ కూడా అదనం. వీటిన్నటింటిని కలిపి ఎక్స్పెన్స్ రేషియోగా పరిగణిస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వాల్యూ)లో ఈ వ్యయాలన్నీ(ఎక్స్పెన్స్ రేషియో) కలిసి ఉంటాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఫండ్ ఎన్ఏవీ నుంచి ఈ ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించి ప్రతిరోజూ ఎన్ఏవీని ప్రకటిస్తుంది. ఒక ఫండ్ ఎన్ఏవీ రూ.10 ఉందనుకోండి. ఆ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.5 శాతం, లాభం 1.5 శాతం అయితే ఎన్ఏవీ రూ. 10 ఉంటుంది. లాభాలు 2.5 శాతమైతే ఎన్ఏవీ రూ.11.5గా ఉంటుంది. లాభాలు ఏమీలేకపోతే, ఎన్ఏవీ రూ.8.5గా ఉంటుంది. క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ద్వారా మదుపు చేయాలనుకుంటున్నాను. కానీ ఈ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్ లేదు. ఈ క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్ ఎందుకు లేదు? - షాజహానా, నిజామాబాద్ ఏఎంసీ(అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ)ల పంపిణీ వ్యయాలు ఆదా చేసి వినియోగదారులకు తక్కువ వ్యయంతో ప్రయోజనం కలి గించడమే డెరైక్ట్ ప్లాన్ స్కీమ్‌ల ముఖ్య ఉద్దేశం. డిస్ట్రిబ్యూటర్ల సర్వీసులను ఉపయోగించుకోకుండా ఇన్వెస్టర్లతోనే నేరుగా లావాదేవీలు నిర్వహిస్తున్న తొలి, ఏకైక మ్యూచువల్ ఫండ్ క్వాంటమ్ సంస్థ మాత్రమే. దీంతో సహజంగానే ఈ సంస్థ స్కీమ్‌లన్నీ కూడా డెరైక్ట్ ప్లాన్లే. పోటీ కంపెనీల స్కీమ్‌లతో పోల్చితే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటాయి. ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ వ్యయాలు ఉండవు. అందుకే క్వాంటమ్‌కు డెరైక్ట్ ప్లాన్లు ఏమీ లేవు. ఈ సంస్థ తన స్కీమ్‌లన్నింటినీ నేరుగా ఇన్వెస్టర్లకే అమ్మేస్తోంది. క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1.25 శాతంగా ఉంది. లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్స్‌లో ఇంత కంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న స్కీమ్ ఇంకొకటి లేదు. మంచి ఈక్విటీ ఫండ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నాను. డైవర్సిఫికేషన్ నిమిత్తం డెట్ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐడీఎఫ్సీ జీఎస్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్, బిర్లా సన్‌లైఫ్ మీడియం టెర్మ్ ఫండ్లను షార్ట్‌లిస్ట్ చేశాను. వీటిల్లో దేనిని ఎంచుకోమంటారు? - శ్రీనివాస్, విజయనగరం ఐడీఎఫ్సీ జీఎస్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది గిల్ట్ ఫండ్, ఇది మాధ్యమిక కాలం నుంచి దీర్ఘకాలం వరకూ ఉండే ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ తరహా స్కీమ్‌లలో ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండనప్పటికీ, ప్రభుత్వ సెక్యూరిటీలు తరచూ ట్రేడింగ్ జరగడం వల్ల కొంతమేరకు రిస్క్ ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతమున్న వడ్డీరేట్లపై ఆధారపడి ఈ సెక్యూరిటీల విలువ ఆధారపడి ఉంటుంది. వడ్డీరేట్లు మారితే సెక్యూరిటీల విలువ, ఎన్ఏవీ కూడా మారుతుంది. సందర్భోచితంగా ఈ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా బాగా ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు వీటినుంచి బయటపడాలి. బిర్లా సన్‌లైఫ్ మీడియం టెర్మ్ ప్లాన్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. ఏడాది నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉన్న సెక్యూరిటీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. దీర్ఘకాలంలో ఈ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ ఫండ్‌ను పరిశీలించవచ్చు. -
తొలిసారి మదుపునకు ఉత్తమమైన ఆప్షన్?
గత ఏడాది రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్‌లో రూ.30,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్ లాకిన్ పీరియడ్ మూడేళ్లు. ప్రస్తుతం ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేదు. పన్ను ఆదా కోసం ఈ ఫండ్‌లో పెట్టుబడులు కొనసాగించమంటారా? లేక మరో ఫండ్‌లో పెట్టుబడి పెట్టమంటారా? - శ్రీనివాసరావు, నెల్లూరు ఈ ఏడాది ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ కేటగిరీ ఫండ్స్ సగటు క్షీణత 12 శాతంగా ఉండగా, ఈ ఫండ్ 21.45 శాతం క్షీణించింది. ఈ ఫండ్ -మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా (మొత్తం పోర్ట్‌ఫోలియోలో 84 శాతం) ఇన్వెస్ట్ చేయడం ఇంత అధ్వాన పనితీరుకు కారణం. ఈ ఏడాది సెన్సెక్స్ 5 శాతం క్షీణించగా, బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్‌లు 25 శాతం నుంచి 30 శాతం వరకూ క్షీణించాయి. అందుకే ఈ ఫండ్ రేటింగ్‌ను ఫోర్ స్టార్ నుంచి త్రీ స్టార్‌కు తగ్గించాం. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఎక్కువ పెట్టుబడులు వద్దనుకుంటే లార్జ్ క్యాప్ షేర్లలో అధికంగా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఫండ్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇవి స్థిరమైన రాబడులనిస్తున్నాయి. నా వయస్సు 26 సంవత్సరాలు. నేను ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15,000 ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇదే నా మొదటి మదుపు. కనిష్ట రిస్క్, గరిష్ట ప్రయోజనాలు లభించే ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌ను సూచించండి? - కాత్యాయిని, విశాఖ పట్టణం మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఈక్విటీ ఫండ్స్ అధిక రాబడులనిస్తాయి. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెడితేనే ఈ స్థాయి రాబడులు వస్తాయి. స్టాక్ మార్కెట్ల రోజువారీ కదలికలకు అనుగుణంగా ఈ ఫండ్స్ కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంటాయి. మీరు తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నందున, రిస్క్ తక్కువగా ఉండాలనుకుంటున్నందున హైబ్రిడ్ ఈక్విటీ ఓరియంటెడ్, లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 65 శాతం వాటాను ఈక్విటీల్లో, మిగిలిన వాటాను డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడతాయి. స్టాక్ మార్కెట్లు పెరిగినప్పుడు ఈ ఈక్విటీ వాటా అధిక వృద్ధిని అందిస్తుంది. స్టాక్‌మార్కెట్లు కుదేలైనప్పుడు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కుషన్‌గా పనిచేస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లు కదం తొక్కుతున్నప్పుడు మామూలు ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే ఈ హైబ్రిడ్ ఈక్విటీ ఓరియంటెడ్, లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్ కొంచెం డల్‌గా అనిపిస్తాయి. అయితే పెట్టుబడి వృద్ధి, రాబడి, భద్రత వంటి అంశాల పరంగా చూసినప్పుడు ఇవి ఉత్తమమైనవని చెప్పవచ్చు. అందుకని రెండు ఉత్తమమైన బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. వాటిల్లో సిప్ ద్వారా మదుపు చేయండి. నేను ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఈ సొమ్ములు నాకు నా కొడుకు విద్యావసరాల నిమిత్తం 2015 జూన్‌కల్లా అవసరం. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లాగా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ మార్గాలను సూచించండి. నేను 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను? - శ్రీకాంత్ రెడ్డి, కరీంనగర్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలాగా పెట్టుబడులకు భద్రతను, వృద్ధిని ఇస్తామని ఏ మ్యూచువల్ ఫండ్ గ్యారంటీనివ్వదు. సాధారణంగా అయితే ఇలాంటి ప్రశ్నలకు డైనమిక్ బాండ్ ఫండ్స్ లేదా షార్ట్‌టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. కానీ గత కొద్ది నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్ నుంచి నిధులు వెనక్కి తీసుకుంటున్నందున ఈ ఫండ్స్ ఎన్ఏవీ రుణాత్మకంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లను పరిశీలించవచ్చు. పన్ను ప్రయోజనాల నిమిత్తం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా వీటిని పరిగణిస్తారు. ఎఫ్ఎంపీలు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. న్యూఫండ్ఆఫర్(ఎన్ఎఫ్ఓ) ద్వారానే వీటిల్లో పెట్టుబడులు పెట్టాలి. నిర్దేశిత గడువు తర్వాతనే వీటిని రిడీమ్ చేసుకోవాలి. వీటి రాబడులను ముందే అంచనా వేయవచ్చు. స్వల్పకాలిక రాబడులు కావాలనుకునే ఇన్వెస్టర్లు వీటిల్లో పెట్టుబడులు పెడతారు. ఎఫ్ఎంపీలు తమ మెచ్యూరిటీ కాల వ్యవధి ఉండే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే పది నెలల మెచ్యూరిటీ ఉండే ఎఫ్ఎంపీలు అదే కాలవ్యవధి ఇన్స్ట్రుమెంట్స్లో, మూడు నెలల మెచ్యూరిటీ ఉండే ఎఫ్ఎంపీలు అదే కాలవ్యవధి ఉండే ఇన్స్ట్రు మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వడ్డీరేట్లలో తేడాలు ఉన్నప్పటికీ, ఇవి ఇచ్చే రాబడులను ముందే అంచనా వేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫండ్స్ 9.75 శాతం నుంచి 10 శాతం రాబడులనిస్తున్నాయి. ఎఫ్ఎంపీల్లో లాంగ్ టర్మ్ గెయిన్స్ కనుక మీరు పొందితే ఇండెక్సేషన్ ప్రయోజనాలు కూడా మీకు అందుతాయి. అందుకే ఇవి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా పన్ను పరంగా ప్రయోజనకరమైనవని చెప్పవచ్చు. మీకు సొమ్ములు కావలసిన కాలవ్యవధి ఉండే ఎఫ్ఎంపీని ఎంచుకొని, దాంట్లో పెట్టుబడులు పెట్టండి. -
తొలిసారి మదుపునకు ఉత్తమమైన ఆప్షన్?
గత ఏడాది రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్‌లో రూ.30,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్ లాకిన్ పీరియడ్ మూడేళ్లు. ప్రస్తుతం ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేదు. పన్ను ఆదా కోసం ఈ ఫండ్‌లో పెట్టుబడులు కొనసాగించమంటారా? లేక మరో ఫండ్‌లో పెట్టుబడి పెట్టమంటారా? - శ్రీనివాసరావు, నెల్లూరు ఈ ఏడాది ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ కేటగిరీ ఫండ్స్ సగటు క్షీణత 12 శాతంగా ఉండగా, ఈ ఫండ్ 21.45 శాతం క్షీణించింది. ఈ ఫండ్ -మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా (మొత్తం పోర్ట్‌ఫోలియోలో 84 శాతం) ఇన్వెస్ట్ చేయడం ఇంత అధ్వాన పనితీరుకు కారణం. ఈ ఏడాది సెన్సెక్స్ 5 శాతం క్షీణించగా, బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్‌లు 25 శాతం నుంచి 30 శాతం వరకూ క్షీణించాయి. అందుకే ఈ ఫండ్ రేటింగ్‌ను ఫోర్ స్టార్ నుంచి త్రీ స్టార్‌కు తగ్గించాం. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఎక్కువ పెట్టుబడులు వద్దనుకుంటే లార్జ్ క్యాప్ షేర్లలో అధికంగా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఫండ్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇవి స్థిరమైన రాబడులనిస్తున్నాయి. నా వయస్సు 26 సంవత్సరాలు. నేను ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15,000 ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇదే నా మొదటి మదుపు. కనిష్ట రిస్క్, గరిష్ట ప్రయోజనాలు లభించే ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌ను సూచించండి? - కాత్యాయిని, విశాఖ పట్టణం మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఈక్విటీ ఫండ్స్ అధిక రాబడులనిస్తాయి. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెడితేనే ఈ స్థాయి రాబడులు వస్తాయి. స్టాక్ మార్కెట్ల రోజువారీ కదలికలకు అనుగుణంగా ఈ ఫండ్స్ కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంటాయి. మీరు తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నందున, రిస్క్ తక్కువగా ఉండాలనుకుంటున్నందున హైబ్రిడ్ ఈక్విటీ ఓరియంటెడ్, లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 65 శాతం వాటాను ఈక్విటీల్లో, మిగిలిన వాటాను డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడతాయి. స్టాక్ మార్కెట్లు పెరిగినప్పుడు ఈ ఈక్విటీ వాటా అధిక వృద్ధిని అందిస్తుంది. స్టాక్‌మార్కెట్లు కుదేలైనప్పుడు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కుషన్‌గా పనిచేస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లు కదం తొక్కుతున్నప్పుడు మామూలు ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే ఈ హైబ్రిడ్ ఈక్విటీ ఓరియంటెడ్, లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్ కొంచెం డల్‌గా అనిపిస్తాయి. అయితే పెట్టుబడి వృద్ధి, రాబడి, భద్రత వంటి అంశాల పరంగా చూసినప్పుడు ఇవి ఉత్తమమైనవని చెప్పవచ్చు. అందుకని రెండు ఉత్తమమైన బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. వాటిల్లో సిప్ ద్వారా మదుపు చేయండి. నేను ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఈ సొమ్ములు నాకు నా కొడుకు విద్యావసరాల నిమిత్తం 2015 జూన్‌కల్లా అవసరం. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లాగా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ మార్గాలను సూచించండి. నేను 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను? - శ్రీకాంత్ రెడ్డి, కరీంనగర్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలాగా పెట్టుబడులకు భద్రతను, వృద్ధిని ఇస్తామని ఏ మ్యూచువల్ ఫండ్ గ్యారంటీనివ్వదు. సాధారణంగా అయితే ఇలాంటి ప్రశ్నలకు డైనమిక్ బాండ్ ఫండ్స్ లేదా షార్ట్‌టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. కానీ గత కొద్ది నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్ నుంచి నిధులు వెనక్కి తీసుకుంటున్నందున ఈ ఫండ్స్ ఎన్ఏవీ రుణాత్మకంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లను పరిశీలించవచ్చు. పన్ను ప్రయోజనాల నిమిత్తం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా వీటిని పరిగణిస్తారు. ఎఫ్ఎంపీలు క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. న్యూఫండ్ఆఫర్(ఎన్ఎఫ్ఓ) ద్వారానే వీటిల్లో పెట్టుబడులు పెట్టాలి. నిర్దేశిత గడువు తర్వాతనే వీటిని రిడీమ్ చేసుకోవాలి. వీటి రాబడులను ముందే అంచనా వేయవచ్చు. స్వల్పకాలిక రాబడులు కావాలనుకునే ఇన్వెస్టర్లు వీటిల్లో పెట్టుబడులు పెడతారు. ఎఫ్ఎంపీలు తమ మెచ్యూరిటీ కాల వ్యవధి ఉండే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే పది నెలల మెచ్యూరిటీ ఉండే ఎఫ్ఎంపీలు అదే కాలవ్యవధి ఇన్స్ట్రుమెంట్స్లో, మూడు నెలల మెచ్యూరిటీ ఉండే ఎఫ్ఎంపీలు అదే కాలవ్యవధి ఉండే ఇన్స్ట్రు మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వడ్డీరేట్లలో తేడాలు ఉన్నప్పటికీ, ఇవి ఇచ్చే రాబడులను ముందే అంచనా వేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫండ్స్ 9.75 శాతం నుంచి 10 శాతం రాబడులనిస్తున్నాయి. ఎఫ్ఎంపీల్లో లాంగ్ టర్మ్ గెయిన్స్ కనుక మీరు పొందితే ఇండెక్సేషన్ ప్రయోజనాలు కూడా మీకు అందుతాయి. అందుకే ఇవి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా పన్ను పరంగా ప్రయోజనకరమైనవని చెప్పవచ్చు. మీకు సొమ్ములు కావలసిన కాలవ్యవధి ఉండే ఎఫ్ఎంపీని ఎంచుకొని, దాంట్లో పెట్టుబడులు పెట్టండి. -
చౌకగా దొరికే మంచి టెర్మ్ ప్లాన్ ఏది?
నా వయస్సు 43 సంవత్సరాలు. నా వార్షిక వేతనం రూ.12 లక్షలు. రూ. కోటి టెర్మ్ప్లాన్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. చౌకలో దొరికే ఉత్తమ టెర్మ్ప్లాన్ను సూచించండి. - రామస్వామి, భద్రాచలం చిన్న వయస్సులోనే బీమా పాలసీలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అయితే ఆలస్యమైనా సరే బీమా పాలసీ తీసుకోవడం మాత్రం మరువద్దు. ఇక మీ విషయానికొస్తే, వ్యయాలు ఆదా చేయడం కోసం టెర్మ్ పాలసీని ఆన్లైన్లో కొనుగోలు చేయడం మంచిది. ఏజెంట్ల ప్రమేయం ఉండదు. కాబట్టి వారి కమీషన్లు తదితర ఖర్చులుండవు ప్రీమియం తక్కువగా ఉంటుంది. హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఐసీఐసీఐ ప్రు ఐకేర్ ఇవి కొన్ని ఉత్తమమైన ఆన్లైన్ టెర్మ్ పాలసీలు. ఇక వేర్వేరు బీమా సంస్థల నుంచి వేర్వేరు టర్మ్ (కనీసం రెండు)పాలసీలు తీసుకోవడం ఉత్తమం. మీ రిటైర్మెంట్ వరకూ లేదా మీ కొడుకో, కూతురో సంపాదనా పరుడయ్యేంత వరకూ మీరు ప్రొటక్షన్ తీసుకోవాలి. సింగిల్ ప్రీమియం పాలసీ బదులు రెగ్యులర్ ప్రీమియం పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే రెగ్యులర్ ప్రీమియం పాలసీతో పోల్చితే సింగిల్ ప్రీమియం పాలసీ ఖరీదెక్కువ. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండి, పొగ తాగని వారైతేనే ఈ ప్రీమియంలు వర్తిస్తాయి. ఒకవేళ వేరే ఏమైనా ఆరోగ్య సమస్యలున్నట్లయితే ప్రీమియం పెరిగే అవకాశాలుంటాయి. ఎఫ్‌ఎంపీల నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ) రుణాత్మకంగా ఉన్న సందర్భాల్లో ఏం చేయాలి? -పద్మిని, బెంగళూరు ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ)లు దాదాపు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలాంటివే. బ్యాంక్ ఎఫ్డీలకు ఎంత వడ్డీనిచ్చేదీ బ్యాంకులు ముందుగానే వెల్లడిస్తాయి. ఈ ఎఫ్‌ఎంపీల ఈ రిటర్న్‌లు సూచనాత్మకంగానే ఉంటాయి. కచ్చితంగా ఇంత ఇస్తామని మ్యూచువల్ ఫండ్ సంస్థలు వెల్లడించకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లకు ఏడాదికి 9.75 శాతం నుంచి 10 శాతం వరకూ రిటర్న్‌లు వచ్చే అవకాశాలున్నాయి. 2008 సంక్షోభానికి ముందు ఫండ్ కంపెనీలు ఇండికేటివ్ రిటర్న్‌లు ఆఫర్ చేసేవి. దీనిని ప్రస్తుతం సెబీ రద్దు చేసింది. ఏది ఏమైనా ఇన్వెస్టర్లకు ఏడాదికి 9.75 శాతం నుంచి 10 శాతం వరకూ రిటర్న్‌లు గ్యారంటీగా వస్తాయి. ఎఫ్ఎంపీలు ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్(సీడీ), కమర్షియల్ పేపర్స్(సీపీ), మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, కార్పొరేట్ బాండ్స్, ఒక్కోసారి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా ఎఫ్ఎంపీలు ఇన్వెస్ట్ చేస్తాయి. ఎఫ్‌ఎంపీల మెచ్యూరిటీ కాలాన్ని బట్టి పై ఇన్స్ట్రుమెంట్స్లో కలిపిగాని, విడివిడిగా కానీ ఫండ్ సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణంగా వీటి మెచ్యూరిటీ ఒక నెల నుంచి మూడేళ్ల వరకూ ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు స్వల్పకాలిక రాబడుల కోసం ఎఫ్ఎంపీల్లో పెట్టుబడులు పెడతారు. వీటితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా బాగానే ఉంటాయి. ఎఫ్ఎంపీలు క్లోజ్డ్ ఎండ్ స్కీమ్‌లు కాబట్టి వీటిని న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్వో) సమయంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి మెచ్యూరిటీ అయ్యేదాకా వీటినుంచి వైదొలిగే అవకాశం లేదు. ఎక్స్ఛేంజ్ ద్వారా మాత్రమే వైదొలిగే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ) ఇన్వెస్ట్ చేసిన రుణ పత్రాలు మార్క్-టు-మార్కెట్‌గా మారిన పరిస్థితుల్లో ఎఫ్‌ఎంపీల ఎన్ఏవీలు రుణాత్మకంగా ఉంటాయి. సంబంధిత ఎఫ్ఎంపీ అసలైన విలువను ఈ ఎన్ఏవీ వెల్లడిస్తుంది. ఎఫ్‌ఎంపీల ఎన్ఏవీలు రుణాత్మకంగా మారినప్పటికీ, ఇన్వెస్టర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. టెర్మ్ ప్లాన్ వార్షిక ప్రీమియం(రూ.) హెచ్డీఎఫ్సీ లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్ రూ. 17,712 ఐసీఐసీఐ ప్రు ఐకేర్ రూ. 16,450 అవైవా ఐ-లైఫ్ రూ. 9,275 (రూ.50 లక్షల పాలసీ, 20 ఏళ్ల టెర్మ్ ప్లాన్) -
ఆర్బిట్రేజ్ ఫండ్స్... ఓకేనా?
సిప్ విధానంలో 2011 నుంచి 5 ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నాను. అవి హెచ్డీఎఫ్సీ గ్రోత్, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్, రిలయన్స్ గ్రోత్, యూటీఐ డివిడెండ్ ఈల్డ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ ఫండ్స్ సరైనవేనా? మీ అభిప్రాయం చెప్పండి? - నరసింగరావు, వరంగల్ మీరు పెట్టుబడులు పెడుతున్న మొత్తం 5 ఫండ్స్‌లో మూడింటికి-యూటీఐ డివిడెండ్ ఈల్డ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్లకు 4/5 స్టార్ రేటింగ్ ఉంది. ఇక మిగిలిన రెండింటికి-రిలయన్స్ గ్రోత్, హెచ్డీఎఫ్సీ గ్రోత్లకు 2/3 స్టార్ రేటింగ్ ఉంది. గత ఐదేళ్లుగా రిలయన్స్ గ్రోత్ ఫండ్ సగటు వార్షిక రాబడి 3.78 శాతంగా ఉంది. ఈ కేటగిరి ఫండ్స్ 6.16 శాతం రాబడులనిచ్చాయి. ఈ ఫండ్ పనితీరు ఆశాజనకంగా లేనందున ఈ ఫండ్ నుంచి వైదొలగవచ్చు. గత ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 73 లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌ల్లో హెచ్డీఎఫ్సీ గ్రోత్ ఫండ్ 51వ స్థానంలో ఉంది. ఈ కేటగిరి ఫండ్స్ 13 శాతం క్షీణిస్తే ఈ ఫండ్ 17 శాతం క్షీణించింది. ఈ ఫండ్ తన పెట్టుబడుల్లో 64 శాతం వాటాను లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులుగా ఉండడమే దీనికి కారణం. గత ఐదేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకుంటే, మంచి రాబడినే ఆర్జించినట్లు లెక్క. ఈ ఫండ్ పనితీరు మరింత దిగజారితే ఈ ఫండ్ నుంచి వైదొలగవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో 91% పెట్టుబడులు ఈక్విటీలోనూ, 4% డెట్ ఇన్స్ట్రు మెంట్స్లోనూ, మిగిలినవి నగదు, సంబంధిత విభాగాల్లో ఉన్నాయి. ఇక మీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 63% లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోనూ, 24% మిడ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ,12% స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లోనూ ఉన్నాయి. మొత్తం మీ పోర్ట్‌ఫోలియోలో 156 స్టాక్స్ ఉన్నాయి. ఇతర మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను ఆర్బిట్రేజ్ ఫండ్‌కు మార్చాలనుకుంటున్నాను. ఆర్బిట్రేజ్ ఫండ్స్ వల్ల ఏమైనా ప్రయోజనాలుంటాయా? అలా మారితే ఎలాంటి పన్ను వ్యవహారాలు ఎలా ఉంటాయి. - నందిని, హైదరాబాద్ ఇతర మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను ఆర్బిట్రేజ్ ఫండ్‌కు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా బదిలీ చేయడం మంచి ఐడియా. ఫలితంగా డెట్ ఫండ్స్లాగా భద్రత, ఈక్విటీ ఫండ్స్లాగా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ షేర్లను కొనుగోలు చేయడం, అమ్మకం చేస్తూ ఉంటాయి. ఈ కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీల్లో తేడా ద్వారా, క్యాష్, డెరివేటివ్స్ మార్కెట్ల మధ్య ఉండే ధరల్లో తేడా ద్వారా ఈ ఫండ్స్ ప్రయోజనాలు పొందుతాయి. ఈక్విటీ ఫండ్స్ కేటగిరిలోకి వచ్చే ఈ ఫండ్స్ కారణంగా ఈక్విటీ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అర్బిట్రేజ్ ఫండ్స్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ల్లోనూ కొంతవరకూ పెట్టుబడులు పెడతాయి కాబట్టి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం పెద్దగా ఉండదు. వీటన్నింటి దృష్ట్యా వీటి నుంచి మంచి రాబడులే వస్తాయి. ట్రేడింగ్ కార్యకలాపాలు అధికంగా ఉన్నందున వీటికి చార్జీలు కూడా అధికంగానే ఉంటాయి. డివిడెండ్ ఆదాయం, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ఈ రెండింటిపై పన్నుల్లేనందున ఈక్విటీ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు బాగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనవడం, ఒకోసారి మనం పెట్టిన పెట్టుబడులు హరించుకు పోవడం వంటి నష్టాలున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఉత్తమమే. నేను ప్రవాస భారతీయుణ్ని. గత 13 ఏళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నాను. నేను భారత్‌కు వచ్చి స్థిరపడుదామనుకుంటున్నాను. ఎన్నారై హోదా నుంచి నివాసిత భారతీయుడిగా మారిన విషయాన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలకు తెలియజేయాల్సి ఉంటుందా? వివరించగలరు. - అన్వేష్, కాకినాడ మీరు ఎన్నారై హోదా నుంచి నివాసిత భారతీయుడి హోదాకు మారితే ఆ విషయాన్ని మీరు పెట్టుబడులు పెడతున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. మీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)కి ఒక దరఖాస్తు రాస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తును జతచేసి మీ ఏఎంసీ మీ బ్యాంక్ అకౌంట్‌ను అప్డేట్ చేస్తుంది. నో యువర్ కస్టమర్ దరఖాస్తులో కూడా మీ రెసిడెంట్ స్టేటస్‌ను మార్చుకోవలసి ఉంటుంది.