రేటింగ్ క్షీణిస్తున్నా, పెట్టుబడులు కొనసాగించాలా? | Direndra Kumar, CEO, Value Research ,interview | Sakshi
Sakshi News home page

రేటింగ్ క్షీణిస్తున్నా, పెట్టుబడులు కొనసాగించాలా?

Published Mon, Oct 21 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

రేటింగ్ క్షీణిస్తున్నా, పెట్టుబడులు కొనసాగించాలా?

రేటింగ్ క్షీణిస్తున్నా, పెట్టుబడులు కొనసాగించాలా?

 నా వయస్సు 33 సంవత్సరాలు. ఆన్‌లైన్ టెర్మ్ కవర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఐ-లైఫ్ ప్లాన్‌లో విదేశాల్లో మరిణిస్తే పాలసీదారునికి డెత్ కవర్ వర్తించదని అవైవా ఏజంట్ చెప్పారు. నేను తరచుగా ప్రయాణాలు చేస్తున్నట్లైతే, ఆఫ్‌లైన్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమమా?  చాలా ఆన్‌లైన్ ప్లాన్‌లకు మెడికల్ చెకప్ అడగడం లేదు. ఎలాంటి చెకప్ లేకుండా బీమా పాలసీ తీసుకుంటే పాలసీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏమైనా సమస్యలైనా వస్తాయా? 
 - ఆనంద్, బెంగళూరు
 అవైవా ఐ-లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్2ప్రొటెక్ట్ తదితర చాలా ఆన్‌లైన్ టెర్మ్ పాలసీలు విదేశాల్లో మరణానికి కూడా కవర్ చేస్తాయి. కాకుంటే మీరు పాలసీ తీసుకున్న బీమా సంస్థకు మీ టూర్ ప్రణాళికలు, ఎంత తరుచుగా మీరు విదేశీయానం చేస్తుంటారు తదితర పూర్తి వివరాలను రాత పూర్వకంగా వెల్లడించాల్సి ఉంటుంది. యువ జనుల మెడికల్ చెకప్ గురించి చాలా బీమా సంస్థలు అడగడం లేదు. అయితే పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ తీసుకునే వ్యక్తి తన ఆరోగ్య స్థితిగతుల గురించి వీలైనంత సమాచారం సదరు బీమా సంస్థకు తెలియజేయడం ఉత్తమం. దీంతో ఎలాంటి పొరపొచ్చాలకు తావుండదు. మీరు లేనప్పుడు మీ అప్పులను తీర్చి, మీ కుటుంబానికి ఆర్థికంగా బాసటనిచ్చేలా సరైన మొత్తానికి బీమా పాలసీ తీసుకోవడం మంచిది.
 
నేను గత కొన్నేళ్లుగా ఒక ఫైవ్ స్టార్ రేటెడ్ ఫండ్‌లో సిప్ విధానంలో మదుపు చేస్తున్నాను. అయితే ఈ ఫండ్ పనితీరు నానాటికీ దిగజారుతోంది. పెట్టుబడులను ఉపసంహరించమంటారా? లేక కనీసం 2-3 ఏళ్ల వరకూ పెట్టుబడులు కొనసాగించి, ఆ తర్వాత ఫండ్ పని తీరును బట్టి నిర్ణయం తీసుకోమంటారా? ముం దుగానే విత్ డ్రా చేసుకుంటే షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు. 
 - ప్రసన్న, విశాఖ పట్టణం
 మీరు మదుపు చేసిన ఫండ్ పనితీరు తగ్గిపోవడం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సిప్ విధానంపై నమ్మకం పోగొట్టుకోకండి. ఒక ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్ పనితీరు దిగజారి దాని రేటింగ్ ఫోర్ స్టార్‌కో, త్రీ స్టార్‌కో పడిపోయినప్పటికీ, ఆ ఫండ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగిం చడం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీ పెట్టుబడులను జాగ్రత్తగా మదింపు చేయాలి. మీ ఫండ్ పనితీరు మరింత దిగజారి రేటింగ్ టూ స్టార్ లేదా వన్ స్టార్‌కో వచ్చినప్పుడు మాత్రమే పెట్టుబడులు ఆపండి.  పనితీరు సరిగ్గా లేని ఫండ్‌లో మీ పెట్టుబడులు కొనసాగించడం వల్ల మీ నష్టాలు మరింతగా పెరుగుతాయి. అదే సమయంలో మంచి పనితీరు కనబరిచే ఫండ్ అందించే లాభాలను మీరు మిస్ అవుతారు. ఇక ఈక్విటీ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిలోపే ఉపసంహరించుకుంటే, మీరు షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
 
 మా నాన్నగారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్ గ్రోత్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఈ నెలలో రిటైరవుతున్నారు. ఈ ఫండ్ గ్రోత్ ఆప్షన్ నుంచి డివిడెండ్ పే అవుట్ ఆప్షన్‌కు మారాలనుకుంటున్నారు. ఏం చేయాలి? 
 - యాదగిరి, నిజామాబాద్
 ఒక ప్లాన్ నుంచి మరొక ప్లాన్‌కు మారడం అంటే ప్రస్తుతమున్న ప్లాన్ నుంచి యూనిట్లను విక్రయించి, కొత్త ప్లాన్ యూనిట్లను కొనుగోలు చేయడం కిందే వస్తుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్‌ల ఎన్‌ఏవీ రెండూ వేర్వురుగా ఉంటాయి. డివిడెండ్ ప్లాన్‌లో ఎప్పటికప్పుడు డివిడెండ్‌లు చెల్లిస్తారు. అదే గ్రోత్ ప్లాన్‌లో డివిడెండ్‌లను రీ ఇన్వెస్ట్ చేస్తారు. అందుకనే  గ్రోత్ ప్లాన్స్ ఎన్‌ఏవీ, డివిడెండ్ ప్లాన్ ఎన్‌ఏవీ కంటే అధికంగా ఉంటుంది.  ఇక ప్లాన్ మార్పు గురించి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ స్కీమ్స్ అన్నీ క్లోజ్డ్ ఎండ్ స్కీమ్స్. వీటిని మీరు రిడీమ్ చేసుకోలేరు. అందుకనే ఈ స్కీమ్స్ మెచ్యూరిటీ కంటే ముందుగానే వీటి నుంచి మారడం మినహా మరో మార్గం లేదు. క్లోజ్‌డ్ ఎండ్ స్కీమ్స్‌కు సంబంధించి డివిడెండ్ ఆప్షన్ ప్లాన్‌లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కూడా లేదు. క్లోజ్‌డ్ ఎండ్ స్కీమ్‌ల్లో న్యూ ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌ఓ) సమయంలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement