ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో అంటే?
ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో అంటే?
Published Mon, Sep 16 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
ఎన్‌ఏవీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?
-మురళీధర్, హైదరాబాద్
ఇన్వెస్టర్ల పెట్టుబడులను నిర్వహించినందుకుగాను మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొన్ని చార్జీలను వసూలు చేస్తాయి. నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో కొంత శాతంగా ఈ చార్జీలు ఉంటాయి. ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నిర్వహణ, మార్కెటింగ్, తదితర వ్యయాలు కూడా ఈ చార్జీల్లో కలిసి ఉంటాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రవేశించినప్పుడు 30 బేసిస్ పాయింట్లు, వైదొలగినప్పుడు 20 బేసిస్ పాయింట్ల చొప్పున చార్జీలను వసూలు చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలను నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. (టాప్ 15 నగరాలకు ఇది వర్తించదు) అంతేకాకుండా అడ్వైజరీ ఫీజుపై సర్వీస్ చార్జీ కూడా అదనం. వీటిన్నటింటిని కలిపి ఎక్స్‌పెన్స్ రేషియోగా పరిగణిస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్ ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వాల్యూ)లో ఈ వ్యయాలన్నీ(ఎక్స్‌పెన్స్ రేషియో) కలిసి ఉంటాయి. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఫండ్ ఎన్‌ఏవీ నుంచి ఈ ఎక్స్‌పెన్స్ రేషియోను మినహాయించి ప్రతిరోజూ ఎన్‌ఏవీని ప్రకటిస్తుంది. ఒక ఫండ్ ఎన్‌ఏవీ రూ.10 ఉందనుకోండి. ఆ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.5 శాతం, లాభం 1.5 శాతం అయితే ఎన్‌ఏవీ రూ. 10 ఉంటుంది. లాభాలు 2.5 శాతమైతే ఎన్‌ఏవీ రూ.11.5గా ఉంటుంది. లాభాలు ఏమీలేకపోతే, ఎన్‌ఏవీ రూ.8.5గా ఉంటుంది.
క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) ద్వారా మదుపు చేయాలనుకుంటున్నాను. కానీ ఈ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్ లేదు. ఈ క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్ ఎందుకు లేదు?
- షాజహానా, నిజామాబాద్
ఏఎంసీ(అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ)ల పంపిణీ వ్యయాలు ఆదా చేసి వినియోగదారులకు తక్కువ వ్యయంతో ప్రయోజనం కలి గించడమే డెరైక్ట్ ప్లాన్ స్కీమ్‌ల ముఖ్య ఉద్దేశం. డిస్ట్రిబ్యూటర్ల సర్వీసులను ఉపయోగించుకోకుండా ఇన్వెస్టర్లతోనే నేరుగా లావాదేవీలు నిర్వహిస్తున్న తొలి, ఏకైక మ్యూచువల్ ఫండ్ క్వాంటమ్ సంస్థ మాత్రమే. దీంతో సహజంగానే ఈ సంస్థ స్కీమ్‌లన్నీ కూడా డెరైక్ట్ ప్లాన్‌లే. పోటీ కంపెనీల స్కీమ్‌లతో పోల్చితే ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటాయి. ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ వ్యయాలు ఉండవు. అందుకే క్వాంటమ్‌కు డెరైక్ట్ ప్లాన్‌లు ఏమీ లేవు. ఈ సంస్థ తన స్కీమ్‌లన్నింటినీ నేరుగా ఇన్వెస్టర్లకే అమ్మేస్తోంది. క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.25 శాతంగా ఉంది. లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్స్‌లో ఇంత కంటే తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న స్కీమ్ ఇంకొకటి లేదు.
మంచి ఈక్విటీ ఫండ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నాను.
డైవర్సిఫికేషన్ నిమిత్తం డెట్‌ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐడీఎఫ్‌సీ జీఎస్‌ఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ రెగ్యులర్, బిర్లా సన్‌లైఫ్ మీడియం టెర్మ్ ఫండ్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. వీటిల్లో దేనిని ఎంచుకోమంటారు?
- శ్రీనివాస్, విజయనగరం
ఐడీఎఫ్‌సీ జీఎస్‌ఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అనేది గిల్ట్ ఫండ్, ఇది మాధ్యమిక కాలం నుంచి దీర్ఘకాలం వరకూ ఉండే ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ తరహా స్కీమ్‌లలో ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండనప్పటికీ, ప్రభుత్వ సెక్యూరిటీలు తరచూ ట్రేడింగ్ జరగడం వల్ల కొంతమేరకు రిస్క్ ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతమున్న వడ్డీరేట్లపై ఆధారపడి ఈ సెక్యూరిటీల విలువ ఆధారపడి ఉంటుంది. వడ్డీరేట్లు మారితే సెక్యూరిటీల విలువ, ఎన్‌ఏవీ కూడా మారుతుంది. సందర్భోచితంగా ఈ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా బాగా ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు వీటినుంచి బయటపడాలి. బిర్లా సన్‌లైఫ్ మీడియం టెర్మ్ ప్లాన్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. ఏడాది నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉన్న సెక్యూరిటీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. దీర్ఘకాలంలో ఈ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ ఫండ్‌ను పరిశీలించవచ్చు.
Advertisement