ఆర్బిట్రేజ్ ఫండ్స్... ఓకేనా? | Dhirendra Kumar CEO, Value Research interview | Sakshi
Sakshi News home page

ఆర్బిట్రేజ్ ఫండ్స్... ఓకేనా?

Published Mon, Aug 12 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

ఆర్బిట్రేజ్ ఫండ్స్... ఓకేనా?

ఆర్బిట్రేజ్ ఫండ్స్... ఓకేనా?

సిప్ విధానంలో 2011 నుంచి 5 ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నాను. అవి హెచ్‌డీఎఫ్‌సీ గ్రోత్, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్ గిఫ్ట్, రిలయన్స్ గ్రోత్, యూటీఐ డివిడెండ్ ఈల్డ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ ఫండ్స్ సరైనవేనా? మీ అభిప్రాయం చెప్పండి? 
 - నరసింగరావు, వరంగల్
 
 మీరు పెట్టుబడులు పెడుతున్న మొత్తం 5 ఫండ్స్‌లో మూడింటికి-యూటీఐ డివిడెండ్ ఈల్డ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్‌లకు 4/5 స్టార్ రేటింగ్ ఉంది. ఇక మిగిలిన రెండింటికి-రిలయన్స్ గ్రోత్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రోత్‌లకు 2/3 స్టార్ రేటింగ్ ఉంది. గత ఐదేళ్లుగా రిలయన్స్ గ్రోత్ ఫండ్ సగటు వార్షిక రాబడి 3.78 శాతంగా ఉంది. ఈ కేటగిరి ఫండ్స్ 6.16 శాతం రాబడులనిచ్చాయి. ఈ ఫండ్ పనితీరు ఆశాజనకంగా లేనందున ఈ ఫండ్ నుంచి వైదొలగవచ్చు. గత ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 73 లార్జ్ అండ్  మిడ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌ల్లో హెచ్‌డీఎఫ్‌సీ గ్రోత్ ఫండ్ 51వ స్థానంలో ఉంది. ఈ కేటగిరి ఫండ్స్ 13 శాతం క్షీణిస్తే ఈ ఫండ్ 17 శాతం క్షీణించింది. 
 
ఈ ఫండ్ తన పెట్టుబడుల్లో 64 శాతం వాటాను లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులుగా ఉండడమే దీనికి కారణం. గత ఐదేళ్ల పనితీరును పరిగణనలోకి తీసుకుంటే, మంచి రాబడినే ఆర్జించినట్లు లెక్క. ఈ ఫండ్ పనితీరు మరింత దిగజారితే ఈ ఫండ్ నుంచి వైదొలగవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో 91% పెట్టుబడులు ఈక్విటీలోనూ, 4% డెట్ ఇన్‌స్ట్రు మెంట్స్‌లోనూ, మిగిలినవి నగదు, సంబంధిత విభాగాల్లో ఉన్నాయి. ఇక మీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 63% లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోనూ, 24% మిడ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ,12% స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లోనూ ఉన్నాయి. మొత్తం మీ పోర్ట్‌ఫోలియోలో 156 స్టాక్స్ ఉన్నాయి. 
 
 ఇతర మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను ఆర్బిట్రేజ్ ఫండ్‌కు మార్చాలనుకుంటున్నాను.  ఆర్బిట్రేజ్ ఫండ్స్ వల్ల ఏమైనా ప్రయోజనాలుంటాయా?  అలా మారితే ఎలాంటి పన్ను వ్యవహారాలు ఎలా ఉంటాయి. 
- నందిని, హైదరాబాద్
 
 ఇతర మ్యూచువల్ ఫండ్స్ నుంచి  పెట్టుబడులను ఆర్బిట్రేజ్ ఫండ్‌కు సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా బదిలీ చేయడం మంచి ఐడియా. ఫలితంగా డెట్ ఫండ్స్‌లాగా భద్రత, ఈక్విటీ ఫండ్స్‌లాగా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ షేర్లను కొనుగోలు చేయడం, అమ్మకం చేస్తూ ఉంటాయి. ఈ కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీల్లో తేడా ద్వారా, క్యాష్, డెరివేటివ్స్ మార్కెట్‌ల మధ్య ఉండే ధరల్లో తేడా ద్వారా ఈ ఫండ్స్ ప్రయోజనాలు పొందుతాయి. 
 
ఈక్విటీ ఫండ్స్ కేటగిరిలోకి వచ్చే ఈ ఫండ్స్ కారణంగా ఈక్విటీ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అర్బిట్రేజ్ ఫండ్స్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ల్లోనూ కొంతవరకూ  పెట్టుబడులు పెడతాయి కాబట్టి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం పెద్దగా ఉండదు. వీటన్నింటి దృష్ట్యా వీటి నుంచి మంచి రాబడులే వస్తాయి. ట్రేడింగ్ కార్యకలాపాలు అధికంగా ఉన్నందున వీటికి చార్జీలు కూడా అధికంగానే ఉంటాయి. డివిడెండ్ ఆదాయం, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ఈ రెండింటిపై పన్నుల్లేనందున ఈక్విటీ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు బాగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనవడం, ఒకోసారి మనం పెట్టిన పెట్టుబడులు హరించుకు పోవడం వంటి నష్టాలున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఉత్తమమే. 
 
 నేను ప్రవాస భారతీయుణ్ని. గత 13 ఏళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నాను. నేను భారత్‌కు వచ్చి స్థిరపడుదామనుకుంటున్నాను. ఎన్నారై హోదా నుంచి నివాసిత భారతీయుడిగా మారిన విషయాన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలకు తెలియజేయాల్సి ఉంటుందా?   వివరించగలరు. 
 - అన్వేష్, కాకినాడ
 
 మీరు ఎన్నారై హోదా నుంచి నివాసిత భారతీయుడి హోదాకు మారితే ఆ విషయాన్ని మీరు పెట్టుబడులు పెడతున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. మీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ)కి ఒక దరఖాస్తు రాస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తును జతచేసి మీ ఏఎంసీ మీ బ్యాంక్ అకౌంట్‌ను అప్‌డేట్ చేస్తుంది. నో యువర్ కస్టమర్ దరఖాస్తులో కూడా మీ రెసిడెంట్ స్టేటస్‌ను మార్చుకోవలసి ఉంటుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement