Ananth
-
అనంత్ అంబానీ-రాధిక సంగీత్‌లో మెరిసిన బ్యూటీ క్వీన్స్
-
అనంత్-రాధిక సంగీత్‌లో అదరగొట్టిన అందాల తారలు (ఫోటోలు)
-
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్‌తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
-
కుబేరుడి కాబోయే కోడలికి స్టార్ హీరోయిన్ స్పెషల్ పార్టీ (ఫోటోలు)
-
అనంత్‌రెడ్డి ఔట్!
బషీరాబాద్ : తీవ్ర అవినీతి ఆరోపణల్లో మునిగిపోయిన మండల పరిధిలోని నావంద్గి సొసైటీ చైర్మన్ అనంత్‌రెడ్డి తన పదవిని కోల్పోయారు. ఆయన అవినీతి వ్యవహారంపై గతంలో పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా అధికారులు విచారణ జరిపారు. చైర్మన్ అనంత్‌రెడ్డిని పర్సన్ ఇన్చార్జిగా కొనసాగించవద్దని డీసీఓ హరిణి పదిహేను రోజుల క్రితం ప్రభుత్వానికి మూడు పేజీల లేఖ రాశారు. చైర్మన్ స్థానంలో ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రతిపాదిస్తూ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ వీరభద్రయ్యకు ఈనెల 5న లేఖ అందజేశారు. దీంతో పాటు సహకార సంఘం ఆర్థిక లావాదేవీలపైన జరిపిన ఆడిట్‌లోనూ అక్రమాలు జరిగినట్లు తేలాయి. ఈ రెండు అంశాలను పరిశీలించిన కమిషనర్ నావంద్గి సొసైటీ చైర్మన్ అనంత్‌రెడ్డిని తొలగించడంతో పాటు, పాలకవర్గాన్ని రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై సొసైటీ పరిపాలనను ప్రత్యేక అధికారి పర్యవేక్షిస్తారని అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందుకు ప్రభుత్వం సహకార సంఘాల పదవీకాలాన్ని ఆరునెలల పాటు పొడగించింది. ఇది ఫిబ్రవరి 4తో ముగిసింది. ఈ క్రమంలో మరో ఆరునెలల పాటు ప్రస్తుత చైర్మన్లనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఇలా జిల్లాలోని అన్ని సహకార సంఘాలు కొనసాగింపునకు అర్హత సాధించాయి. నావంద్గి సొసైటీ మాత్రం కొనసాగింపు అర్హతను కోల్పోవాల్సి వచ్చింది. ఫలితమివ్వని పైరవీలు! సొసైటీ చైర్మన్‌తో పాటు డీసీసీబీ డైరెక్టర్‌గా కొనసాగిన అనంత్‌రెడ్డి ఎలాగైనా తన పదవిని కాపాడుకోవాలని చివరి వరకు విశ్వ ప్రయాత్నాలు చేశారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రిని ప్రాధేయపడ్డారు. అదేవిధంగా ప్రభుత్వంలో పరపతి ఉన్న అధికార పార్టీ నాయకులను సైతం ఆశ్రయించారు. అక్కడ అభయం దొరకకపోవడంతో ఏకంగా సంఘంలోని ఓ ఉన్నతాధికారితో కాళ్లబేరానికి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. తనను కొనసాగించాలని కోరారు. అదీ కూడా ఫలితమివ్వలేదు. చివరకు జిల్లాలోని తన సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేతో ఉన్నతాధికారులకు, మాజీ మంత్రి వద్దకు రాయబేరాలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే సొసైటీ పాలకవర్గాన్నే రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో అనంత్‌రెడ్డి తన పదవిని కోల్పోయారు. అయితేరద్దు విషయమై తనకు ఎలాంటి సమాచారం అందలేదని చైర్మన్ ‘సాక్షి’తో చెప్పారు. -
రాష్ట్ర బార్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్‌కు శనివారం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.బాలరాజ్, ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌రెడ్డి, కార్యదర్శిగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అధ్యక్షుడు డి.జగదీశ్వర్‌రావు ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కేఎస్ రాహుల్, బి.జానకి రాములు, జి.విప్లవ్‌రెడ్డి, జి.వినోద్‌కుమార్, కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.శేఖర్‌రెడ్డి, బి.యోగేశ్వర్రావు, బ్రహ్మయ్య, వి.శ్రీరామ్ కుమార్, ఎన్.కృష్ణ, జగన్మోహన్ గౌడ్, హెచ్.చక్రధర్ ఎంపికయ్యారు. -
అంజలి ప్రేమలేఖ
కార్తికేయ, హిమాన్సి, శుభాంగి పంత్, అనంత్, సైదులు వెంకీ, అవినాష్ ముఖ్యతారలుగా నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇట్లు..అంజలి’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘హీరోకి నటనలో పట్టు ఉంది. నాయిక కూడా జాతీయ స్థాయిలో భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న అమ్మాయి. నవీన్ బాగా తెలుసు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అన్నారు. ప్రేమలేఖ ఆధారంగా తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. అంజలి అనే అమ్మాయి రాసిన ప్రేమలేఖ, అదే పేరు గల మరో అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అన్నారు నవీన్ మన్నేల. ఈ సినిమాకు కెమెరా: వీకే రామరాజు, సంగీతం: కార్తీక్ కొడగండ్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్. ఆర్ట్: ఎస్వీ మురళి. -
రాజబాబు తమ్ముడిగా పుట్టడం ...
కాకినాడ : సినిమా పండాలన్నా, జీవితం పండాలన్నా హాస్యం ప్రధానమని ప్రముఖ సినీ హాస్య నటుడు అనంత్ అన్నారు. స్థానిక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ 80వ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. పాతతరం నుంచి నేటివరకూ సినిమాల్లో హాస్యం ప్రధాన పాత్ర పోషిస్తోందని, నేడు హాస్యనటులకు కూడా అగ్రస్థానం లభిస్తోందని అన్నారు. నేటి సాంకేతిక యుగంలో ముఖంపై చిరునవ్వు కూడా కరువవుతోందని, హాస్యం లేని జీవితం నిస్సారమవుతుందని అన్నారు. ఇప్పటివరకూ తాను 500 సినిమాల్లో నటించానని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇంద్రగంటి మోహనకృష్ణ, భీమనేని శ్రీనివాసరావులు దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో ప్రస్తుతం తాను నటిస్తున్నట్లు అనంత్ తెలిపారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వస్తున్న సినిమాతోపాటు, హీరో సాయిధరమ్‌తేజ నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నానని వివరించారు. స్వాతికిరణం, ఆపద్బాంధవుడు, అసెంబ్లీరౌడీ, అత్తారింటికి దారేది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తదితర సినిమాలు తనకు హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చాయన్నారు. వెంగమాంబ, అదుర్స్, శ్రీఆంజనేయం తదితర సినిమాల్లో కూడా తాను చేసిన విలన్ పాత్రలు గుర్తింపు తీసుకు వచ్చాయన్నారు. సినీ చరిత్రలో ప్రముఖ హాస్యనటుడు రాజబాబుది సువర్ణాధ్యాయమని అనంత్ అన్నారు. ఆయన తమ్ముడిగా జన్మించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. రాజబాబు ప్రభావం తనపై పూర్తిగా ఉందని అన్నారు.