భువనేశ్వర్: ప్రమాదానికి గురైన కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మహంతి మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో రైలులోని బోగీలు గాల్లో ఎగిరి పక్క ట్రాక్‌పై ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వెళ్తున్న బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టడంతో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి.
దేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే ప్రమాదంగా మారిన ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. ఈ ఘోర ప్రమాదంలో 275 మంది అసువులు బాసారు. మరో వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. తాజాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనపై రైల్వే బోర్డు సీబీఐ సిఫార్సు చేసిందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment