విరిగిన రైలు పట్టా: తప్పిన ప్రమాదం | Loco pilot recognises damaged train track, Out of danger at Nellore | Sakshi
Sakshi News home page

విరిగిన రైలు పట్టా: తప్పిన ప్రమాదం

Published Sat, Jan 30 2016 6:48 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

విరిగిన రైలు పట్టా: తప్పిన ప్రమాదం

విరిగిన రైలు పట్టా: తప్పిన ప్రమాదం

రైలు పట్టా విరగడాన్ని సకాలంలో లోకో పైలట్(డ్రైవర్) గుర్తించడంతో పెనుప్రమాదం త్రుటిలో తప్పింది.

నెల్లూరు(మనుబోలు): రైలు పట్టా విరగడాన్ని సకాలంలో లోకో పైలట్(డ్రైవర్) గుర్తించడంతో  పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలపరిధిలోని కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని యలమంద కాలువ వద్ద 149-15 కిలోమీటర్‌లోని అప్‌లైన్‌లో వేకువ జామున 4:00ల ప్రాంతంలో రైలుపట్టా విరిగింది. ఆ సమయంలో విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రైలు నడక శబ్ధంలో తేడాను గుర్తించి రైలును ఆపేశాడు.

ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిదానంగా ఎలాగో దానిని దాటించి రైలు పోనిచ్చాడు. అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది. యుద్ధప్రాతిపదికన పట్టాకు మరమ్మతులు చేశారు. ఈ సమయంలో వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సుమారు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి. పట్టా విరిగిన చోట వంతెన కూడా ఉండడంతో ఈ విషయాన్ని డ్రైవర్ సకాలంలో గుర్తించకపోతే పెద్దప్రమాదం జరిగేదని సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement