మొబైల్ షాపులో భారీ చోరీ | robbery in mobile shop at secunderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 19 2015 11:13 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

సికింద్రాబద్ లోని చిలకడగూడలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా ఉండే ఓ మొబైల్ షాప్ లో శుక్రవారం అర్థరాత్రి ఈ దొంగతనం చోటుచేసుకుంది. షాపు వెనుక భాగంలో గోడ బద్దలు కొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపులోని రూ. 5 లక్షల విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం గమనించిన షాపు యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement