mobile shop
-
కొత్త సెల్‌ఫోన్: బైక్ దిగగానే ఒక్కసారిగా షాక్..
సోమందేపల్లి: మొబైల్షాపులోని కొత్తసెల్ఫోన్తో ఓ అపరిచిత వ్యక్తి ఉడాయించాడు. వివరాల్లోకెళ్తే.. సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల మొబైల్‌షాప్‌కు బుధవారం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. తాను పక్కనే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడినని పరిచయం చేసుకున్నాడు. తోటి మహిళా ఉపాధ్యాయురాలికి సెల్‌ఫోన్ కొనేందుకు వచ్చానని, వీవో కంపెనీకి చెందిన రూ.18వేలు విలువ చేసే పీస్‌ని ఎంపిక చేసుకుని, దీన్ని చూపించుకుని వస్తానన్నాడు. కావాలంటే తన వెంట మీ సేల్స్‌మన్‌ను కూడా పంపించండి అని అనడంతో షాపు యజమాని ఈశ్వరయ్య సరేనన్నాడు. అలా సేల్స్‌మన్‌తో ద్విచక్రవాహనంపై ఉన్నతపాఠశాల వద్దకు వెళ్లాడు. అక్కడ సేల్స్‌మన్ కిందకు దిగగానే అపరిచిత వ్యక్తి సెల్‌ఫోన్‌తో బైక్‌పై తుర్రుమన్నాడు. బాధిత షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: దారుణం: తల్లి, ఇద్దరు పిల్లల హత్య కూతురి ప్రేమ: యువకుడి కాళ్లు, చేతులు నరికి హత్య -
సెల్ ఫోన్ల దుకాణంలో చోరీ
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం) : స్థానిక విజయవాడ రోడ్డులోని ఓ సెల్ షాపులో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్ప డ్డారు. సెల్ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లు, రూ.20 వేల నగదు అపహరించుకుపోయారు. రోజూలాగానే గురువారం ఉదయం షాపు తెరిచేందుకు వచ్చిన సేల్స్ బాయ్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి యాజమాని షేక్ అబ్ధుల్ ఖలీల్‌కు తెలియజేశారు. హుటాహుటిన షాపునకు వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. షాపులోని 12 సెల్ ఫోన్లు, రూ.20,710 నగదు అపహరణకు గురైనట్లు లెక్క తేలింది. దీంతో హనుమాన్‌జంక్షన్ పోలీసులకు సెల్ షాపు యాజమాని షేక్ అబ్ధుల్ ఖలీల్ ఫిర్యాదు చేయటంతో సీఐ ఎన్.రాజశేఖర్, ఎస్ఐ కె.ఉషారాణి ఘటనాస్థలికి వచ్చి విచారించారు. సెల్ షాపు పక్కన సందులో ఉన్న మరో షట్టర్ తాళాలను దుండగులు చాకచాక్యంగా పగలుగొట్టి లోనికి ప్రవేశించినట్లు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో రికార్డు అయ్యింది. సుమారు 22 ఏళ్లు వయస్సు కలిగిన ముగ్గురు యువకులు ఈ చోరీకి పాల్పడినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. వీరు షాట్లు ధరించి, బ్యాగ్‌లు పట్టుకుని తిరుగుతున్నట్లుగా సీసీ కెమెరా ఫుటేజి ద్వారా పోలీసులు గుర్తించారు. కాగా రెండు, మూడు రోజులుగా సెల్ షాపు పక్క సందులో ఈ ముగ్గురు దుండగులు అనుమానాస్పదంగా తిరుగుతూ చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీ ఘటనపై హనుమాన్‌జంక్షన్ ఎస్ఐ కె.ఉషారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పేలిన సెల్‌ఫోన్
బి.కొత్తకోట: స్థానిక సింహం వీధిలోని ఓ మొబైల్ దుకాణంలో బుధవారం రాత్రి 9గంటల సమయంలో సెల్‌ఫోన్ పేలింది. ఓ యువ తి తన మొబైల్ ఫోన్‌కు సేఫ్‌గార్డ్ వేయించుకునేందుకు వచ్చింది. షాపు యజమాని ఆ సెల్‌ను తీసుకున్న కొంతసేపటికి అది పేలి గోడవైపు దూసుకుపోయింది. దీనిదెబ్బకు అద్దాలు పగిలాయి. సెల్ పూర్తిగా కాలిపోయింది. బ్యాటరీ పేలడంవల్ల ఇలా జరిగిందని దుకాణ యజమాని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు నిప్పుపెట్టిన దుండగులు
మైలార్‌దేవ్‌పల్లి: గుర్తుతెలియని ముగ్గురు దుండగులు గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను తగులబెట్టిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు జి.నవీన్‌కుమార్, లక్ష్మీనర్సింహస్వామి మొబైల్ రిపేరింగ్ సెంటర్ యజమాని సందీప్‌కుమార్, స్థానికుడు సూర్యకిరణ్ కథనం ప్రకారం వివరాలు... గత నాలుగు సంవత్సరాలుగా నవీన్‌కుమార్ పద్మశాలిపురంలో ఉంటూ మధుబన్ కాలనీలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. పద్మశాలిపురానికి చెందిన సందీప్‌కుమార్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ సమీపంలోనే మొబైల్ రిపేరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ కాలిన ఘటనలో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు పక్కనే ఉన్న మొబైల్ రిపేరింగ్ సెంటర్, మెకానిక్ గ్యారేజీలు తగులబడ్డాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు స్థానికుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పూర్తిగా కాలిపోగా, మొబైల్ సెంటర్లోని రెండు ల్యాప్టాప్స్, ఒక కంప్యూటర్ ప్రింటర్, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. మొబైల్ షాపులో సుమారు రూ. 25 వేల నగదు కాలిపోయిందని సందీప్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మంచిగా నడుస్తుందని తాను లాభాల బాటలో ఉండటం తట్టుకోలేక గిట్టని వారు ఈ ప్రమాదానికి పాల్పడి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు వచ్చి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించారన్నారు. రాత్రి డ్యూటీలో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీతో పాటు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చీరాలలో హెబ్బా పటేల్ సందడి
చీరాల: సినీనటి హెబ్బా పటేల్ సందడి చేసింది. స్థానిక దర్బార్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బిన్యూ మొబైల్ షాపును శనివారం ఆమె ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా బిన్యూ షోరూం ఎండీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37 షోరూంలను ప్రారంభించామని, చీరాలలో 38వ షోరూంను ప్రారంభించినట్లు తెలిపారు. అలానే బాపట్ల, పొన్నూరు, హిందూపూర్లలో కూడా షోరూంలు ప్రారంభిస్తున్నామన్నారు. లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు షోరూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలో వంద షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బిన్యూ షోరూం ప్రారంభించేందుకు ప్రముఖ నటి హెబ్బా పటేల్ చీరాలకు వచ్చిందని తెలుసుకున్న ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. -
ఎల్బీనగర్ మొబైల్‌షాపులో చోరీ
-
మొబైల్ షాపులో భారీ చోరీ
నందికోట్కూర్(కర్నూలు): మొబైల్ షాపులో దొంగలు పడి ఫోన్లు ఎత్తుకెళ్లిన సంఘటన కర్నూలు జిల్లా నందికోట్కూర్లోని పాతబస్టాండ్ వెనుక భాగంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాపు షట్టర్ పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు దుకాణంలో ఉన్న విలువైన మొబైల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 25 లక్షల విలువైన ఫోన్లు చోరీ
తిరుపతి క్రైం: నగరంలోని ఎంఆర్‌పల్లిలో ఉన్న ఓ మొబైల్ దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం షట్టర్ పగలగొట్టిన దుండగులు షాపులోని 52 సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. సుమారు రూ. 25 లక్షల విలువైన ఫోన్లను తస్కరించినట్లు అంచనా. ఉదయం దుకాణం యజమాని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాల కోసం సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మొబైల్‌షాపులో అగ్నిప్రమాదం
రూ.5 లక్షల ఆస్తినష్టం నెల్లూరు (క్రైమ్) : విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మొబైల్‌షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.5లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. బుజబుజనెల్లూరుకు చెందిన వై. మోహన్ అదే ప్రాంతంలోని దర్గా సమీపంలో శ్రీవెంకటేశ్వర మొబైల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మొబైల్స్‌తో పాటు ద్విచక్రవాహనాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్‌ను సైతం విక్రయిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి మోహన్‌కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే అప్పటికే దుకాణంలోని మొబైల్స్, రీచార్డ్ కార్డ్‌లు, ఇంజన్ అయిల్స్, స్పేర్‌పార్ట్‌లు, మోహన్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణం వెనుక వైపు ఉన్న కరుణాకర్ ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. వారు మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఘటనలో రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
మొబైల్ షాప్‌లో అగ్నిప్రమాదం
నల్లగొండ : నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని మొబైల్ షాపులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పూలసెంటర్‌లోని ఓ మొబైల్ షాపులో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని తెలిపాడు. -
రూ.25 లక్షల విలువైన మొబైళ్లు చోరి
హైదరాబాద్: తాళం పగులకొట్టలేదు.. షట్టర్ ధ్వంసం చేయలేదు.. ఏడుగురు వచ్చారు, ఇద్దరు లోపలికి వెళ్లారు.. 20 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని రూ.25 లక్షలు సొత్తు ఎత్తుకుపోయారు. ఇదీ సోమవారం అర్ధరాత్రి మహంకాళి పోలీసుస్టేషన్ పరిధిలోని ‘అపెక్స్’ యాపిక్ మొబైల్ ఔట్లెట్లో జరిగిన భారీ చోరీ నేపథ్యం. దుకాణం బయట, లోపల ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను నగర పోలీసులు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. షాపు నిర్వాహకుల నిర్లక్ష్యం దుండగులకు కలిసొచ్చిందని భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ‘అపెక్స్’ దుకాణం బయట ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దశ్యాల్లో మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా చోరీకి పాల్పడినట్ట తెలుస్తోంది. వీరిలో నలుగురి వీపుకు బ్యాగ్‌లు తగిలించుకుని ఉన్నారు. తెల్లవారుజామున 3.39 గంటల ప్రాంతంలో దుకాణం దగ్గరకు వచ్చిన గ్యాంగ్.. వెంట తెచ్చుకున్న బ్యాగుల్లోంచి రెండు దుప్పట్లు బయటకు తీశారు. షట్టర్‌కు కుడివైపుగా ఇద్దరు వాటిని తెరిచి అడ్డంగా పట్టుకున్నారు. ఎవరైనా వాళ్లను చూసినా.. దుప్పట్లు పర్చుకొని పడుకుంటున్నారని భావించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దుకాణానికి సెంటర్ లాక్ వ్యవస్థ అందుబాటులో ఉన్నా నిర్వాహకులు దాన్ని ఉపయోగించకపోవడం దుండగులకు కలిసొచ్చింది. షట్టర్ ను చిన్న రాడ్ తో ఎత్తిపట్టుకుని ఏర్పడిన సందులో నుంచి ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. మిగిలిన వారు దుప్పటిని మడతపెట్టుకుని కాస్త దూరంగా వెళ్లారు. షట్టర్ వెనుక దుకాణం లోపలి వైపు అలంకరణ కోసం గ్లాస్ ఫిటింగ్, డోర్ ఉన్నప్పటికీ దానికి కూడా ఎలాంటి లాక్ లేకపోవడంతో దుండగుల పని తేలికైంది. దుకాణంలోకి వెళ్లిన ఇద్దరు దుండగులు 16 నిమిషాల్లో పని పూర్తి కానిచ్చేశారు. ఫోన్లు మాత్రమే.. ‘అపెక్స్’ దుకాణంలో యాపిల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్స్ తదితరాలు ఉన్నాయి. అయితే, దొంగలు కేవలం సెల్ఫోన్లు ఉన్న షెల్ఫ్‌ను చిన్నపాటి రాడ్డుతో పగులకొట్టారు. ఒకడు అందులోని సెల్ఫోన్లను బయటకు తీసి ఇస్తుండగా.. మరొకడు బాక్సులు ఓపెన్ చేసి పక్కన పడేస్తూ కేవలం వాటిలో ఉన్న ఫోన్లు మరో పక్కన పేర్చాడు. ఇలా తమకు కావాల్సిన ఫోన్లు వేరు చేసిన తర్వాత క్యాష్ కౌంటర్‌ను పగులకొట్టి అందులో ఉన్న రూ.51 వేల నగదు తీసుకున్నారు. ఆపై రూ.24.85 లక్షల విలువైన ఫోన్లను వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో సర్దుకుని పారిపోయారు. ఈ మొత్తం చోరీ 20 నిమిషాల్లో పూర్తయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అంతర్రాష్ట్ర ముఠా ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యాపిల్ ఫోన్లకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబర్లు క్లోనింగ్ చేయడం సాధ్యం కాదు. అలా కాకుండా వాటిని దేశంలో ఎక్కడ విక్రయించినా పోలీసులు సాంకేతికంగా ట్రాకింగ్ చేసి గుర్తిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాదికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా పక్కా రెక్కీ తర్వాత ఈ చోరీ చేసిందని, సొత్తును వివిధ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించే ఆస్కారం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండుగులు వచ్చిపోయిన మార్గాలను గుర్తించడం కోసం సికింద్రాబాద్ ఎస్డీ రోడ్‌లోని మినర్వా కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ‘అపెక్స్’ నుంచి అన్ని వైపులకు ఉన్న రహదారుల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను అధ్యయనం చేస్తున్నారు. వీరు రైలులో వచ్చి వెళ్లి ఉంటారనే అనుమానంతో రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. -
మొబైల్ షోరూంలో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని ప్రముఖ మొబైల్ షోరూంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. మొబైల్ షోరూమ్ గోడకు కన్నం వేసిన దొంగలు సుమారు 10 లక్షలు విలువ చేసే 74 సెల్ఫోన్లను, 27వేల నగదును దొచికెళ్లారు బుధవారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన షాపు సిబ్బంది వెంటనే పోలీసుకులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొబైల్ షాపునకు చేరుకుని... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ నుంచి తప్పించుకునేందుకు దొంగ నల్లదుస్తులు, మొఖానికి మాస్క్, గ్లౌజేస్ వేసుకొని దొంగతనానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ వివి కమలాసన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సీసీ ఫుటేజీలో ఓ దొంగ చోరికి పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. ముందస్తు చర్యగా నల్లదుస్తులు, మాస్కులు ధరించడాన్ని బట్టి చూస్తే దొంగతనం నైపుణ్యం గలిగిన వాడై ఉంటాడని ఈ దొంగను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
సెల్‌ఫోన్ షాపులో భారీ చోరీ
-
మొబైల్ షాపులో భారీ చోరీ
-
సికింద్రాబాద్ లో భారీ చోరీ
సికింద్రాబాద్: సికింద్రాబద్ లోని చిలకడగూడలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా ఉండే ఓ మొబైల్ షాప్ లో శుక్రవారం అర్థరాత్రి ఈ దొంగతనం చోటుచేసుకుంది. షాపు వెనుక భాగంలో గోడ బద్దలు కొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపులోని రూ. 5 లక్షల విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం గమనించిన షాపు యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.